Mars in Cancer 2025: కర్కాటక రాశిలో కుజుడు.. జూన్ 5 వరకూ ఈ రాశులవారి వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపారంలో అన్నీ సమస్యలే!
Mars in Cancer 2025: ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజుడు జూన్ మొదటివారం వరకూ ఇదే రాశిలో ఉండి జూన్ 5న సింహ రాశిలో అడుగుపెడతాడు. కుజుడి ప్రభావం మీ రాశిపై ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి

Mars in Cancer: Zodiac Sign Predictions 2025: కర్కాటక రాశిలో కుజుడి సంచారం ద్వాదశ రాశుల్లో చాలామందికి శుభ ఫలితాలను ఇవ్వడం లేదు. ఏ రాశులవారికి అనుకూల, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయో చూద్దాం..
మేష రాశి
కర్కాటక రాశిలో కుజుడి సంచారం మేష రాశి నుంచి నాలుగో స్థానంలో ఉంటుంది. ఫలితంగా ఈ సమయం మీకు అనుకూల ఫలితాలను ఇవ్వదు. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. భూ వివిదాల నుంచి చికాకులుంటాయి. వైవాహిక జీవితం గందరగోళంగా అనిపిస్తుంది. అయితే ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
వృషభ రాశి
కుజుడి సంచార ప్రభావం వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ఈ సమయంలో అనుకోని వివాదాల్లో చిక్కుకోవాల్సి రావొచ్చు. కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీరు శుభ ఫలితాలను చూడలేరు. అయితే కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది. శత్రువులను జయించటానికి ఇదే మంచి సమయం. ఉద్యోగం చేసే ప్రదేశంలో పురోగతి ఉంటుంది.
మిథున రాశి
కుజుడి సంచారం మీకు చికాకులు పెంచుతుంది. ఈ సమయంలో మీకు రావాల్సిన ఆదాయానికి అడ్డంకులు ఏర్పడతాయి. డబ్బు కూడబెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడులు కలసిరావు. పిల్లల వైపునుంచి ఆందోళనలు ఉంటాయి. అయితే మీకున్న అదృష్టం కారణంగా అనుకున్న పనులు పూర్తిచేసి ఉపశమనం పొందుతారు.
కర్కాటక రాశి
మీ రాశిలోనే కుజుడి సంచారం జరుగుతోంది. ఫలితంగా ఈ సమయంలో అనుకోని సమస్యలు వెంటాడుతాయి. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది . పిల్లల వైపు నుంచి ఆందోళనలు ఉండొచ్చు. వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి. ఆస్తికి సంబంధించిన ఏదైనా వ్యవహారం నడుస్తుంటే అది ఓ కొలిక్కి వచ్చేస్తుంది.
సింహ రాశి
కుజుడి సంచారం సింహ రాశివారికి శుభ ఫలితాలను ఇవ్వడం లేదు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది..పైగా ఆ ప్రయాణాల్లో డబ్బు వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది.
కన్యా రాశి
కుజుడి ప్రభావంతో కన్యా రాశివారికి సంపాదనకు సంబంధించిన అడ్డంకులు ఏర్పడతాయి. డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారం పెంచుకునే ఆలోచన ఉంటే కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. పొట్టకు సంబంధించిన సమస్యలుంటాయి. అయితే ఈ సమయంలో ఓ శుభవార్త వినే అవకాశం ఉంటుంది.
తులా రాశి
కర్కాటక రాశిలో కుజుడి సంచార ప్రభావం తులా రాశివారి వైవాహిక జీవితంపై పడుతుంది. కుటుంబంలో వివాదాలు పెరుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అడ్డంకులు ఉంటాయి. అయితే భూమి సంబంధిత విషయాలకు సమయం మంచిది.
వృశ్చిక రాశి
కుజుడి సంచార ప్రభావం వృశ్చిక రాశివారికి ఆరోగ్యంపై పడుతుంది. కుటుంబంలో చికాకులు, అనవసర చర్చలు ఉంటాయి. అదృష్టం కలసిరాదు. రచనారంగంలో ఉండేవారికి అడ్డంకులుంటాయి. స్నేహతుల నుంచి సహకారం అందుతుంది.
ధనస్సు రాశి
కుజుడి సంచారం ప్రభావం ఈ రాశివారిని మానసికంగా కుంగదీస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. రహస్య విషయాలు బయటపడతాయి. డబ్బు, వ్యాపార సంబంధిత విషయాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.
మకర రాశి
మకర రాశివారు గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. భూ వివాదాల్లో చిక్కుకుంటారు. కుటుంబంలో పెద్దవారికి సంబంధించి అనారోగ్య సమస్యలుంటే ఆ ఇబ్బంది పెరుగుతుంది.
కుంభ రాశి
కుజుడి సంచారం కుంభ రాశివారికి అనుకూల ఫలితాలు ఇ్వడం లేదు. ఇంటా బయటా వివాదాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన అడ్డంకులు ఎర్పడతాయి.
మీన రాశి
కర్కాటక రాశిలో కుజుడి సంచారం మీన రాశివారికి ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందలేరు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















