Krishnamma: అమెజాన్‌లో దుమ్ము రేపుతున్న ‘కృష్ణమ్మ’ - టాప్ 10 ట్రెండింగ్ మూవీస్‌లో సత్యదేవ్ సినిమా
సత్యదేవ్ తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ అమెజాన్ ప్రైమ్ లో ఓరేంజిలో వ్యూస్ అందుకుంటుంది. భారత్ సహా 240కి పైగా దేశాల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా.. టాప్ 10 ఇండియన్ మూవీస్ లో ఒకటిగా కొనసాగుతోంది.
'Krishnamma' in Amazon's Top 10 Trending Movies: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కంచర్ల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. మే 10న విడుదలైన ఈ సినిమా వారం రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా మే 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ భారత్ సహా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. భారత్ లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో ఈ సినిమా సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ సినిమా 7వ స్థానంలో కొనసాగుతోంది.
‘కృష్ణమ్మ’ సినిమా కథ ఏంటంటే?
భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్ మీసాల) అనే ముగ్గురు అనాథలు. చిన్నప్పటి కలిసి మెలసి పెరుగుతారు. ప్రాణ స్నేహితులు. శివ చిన్నతనంలోనే జైలుకు వెళ్తాడు. బయటకు వచ్చిన ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తాడు. భద్ర, కోటి గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈ ముగ్గురు యువకులు తమకంటూ ఓ కుటుంబం ఉండాలని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే శివ మీనా(అతీరా రాజ్)తో ప్రేమలో పడతాడు. ఆమె భద్రకు రాఖీ కడుతుంది. అప్పటి నుంచి అతడు ఆమెను చెల్లిగా చూస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే మీనా తల్లి ఆరోగ్యం బాగుండదు. ఆమెకు ఆపరేషన్ చేయాలంటే రూ. 2 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్తారు. ఎలాగైనా ఆ డబ్బును సాధించాలని భద్ర, శివ, కోటి నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు ఒప్పుకుంటారు. సరుకు తీసుకొస్తుండగా మధ్యలో పోలీసులకు చిక్కుతారు. అదే సమయంలో ఓ అమ్మాయి అత్యాచారం, హత్య కేసులో ఇరుక్కుంటారు. ఇంతకీ చనిపోయిన అమ్మాయి ఎవరు? వీళ్లు ఆ కేసులో ఎలా చిక్కుకుంటారు? జైలు నుంచి బయటకు వచ్చాక ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు? అనేది సినిమాలో చూడాల్సిందే.
View this post on Instagram
కొరటాల శివ సమర్పించడంతో భారీ అంచనాలు
‘కృష్ణమ్మ’ సినిమాను రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వి వి గోపాలకృష్ణ తెరకెక్కించిన విధానంపై సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను సమర్పించడంతో పాటు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగినట్లుగా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. కనీవినీ ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లక్ష్మణ్ మీసాల, కృష్ణ బురుగుల, అతీరా రాజ్, రఘు కుంచె కీలక పాత్రలు పోషించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Read Also: ‘గం గం గణేశా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!