Gam Gam Ganesha First Review: ‘గం గం గణేశా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!
Anand Deverakonda: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తాజా సినిమా ‘గం గం గణేశా’ ప్రీమియర్ షోను కొంత మంది విద్యార్థులతో పాటు కొన్ని కుటుంబాలకు చూపించారు. వాళ్లు ఈ సినిమా గురించి ఏమన్నారంటే...?
Gam Gam Ganesha Movie Public Response: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే కొంత మంది స్టూడెంట్స్ తో పాటు కొన్ని ఫ్యామిలీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..
‘గం గం గణేశా’ మూవీ గురించి ఆడియెన్స్ రివ్యూ
‘గం గం గణేశా’ సినిమా కామెడీతో పాటు కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు. రెండున్నర గంటల పాటు సినిమా ఫుల్ ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటుందని అభిప్రాయపడ్డారు. సినిమాలో ఎక్కడా లాగ్ అనేది లేకుండా ఆకట్టుకుంటుందన్నారు. సినిమా క్లైమాక్స్ అల్టిమేట్ గా ఉందని తెలిపారు. కామెడీ, యాక్టింగ్, సస్పెన్స్ తో పాటు ఓవరాల్ మూవీ చాలా బాగుందంటున్నారు.
❤️#gamgamganesha pic.twitter.com/VceudX5Qlt
— Anand Deverakonda (@ananddeverkonda) May 29, 2024
నిన్న ‘బేబీ’... నేడు ‘గం గం గణేశా’
ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. చిన్న సినిమా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆల్మోస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసింది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. చాలా కాలం తర్వాత చక్కటి లవ్ స్టోరీ రావడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించింది. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 90 కోట్లుకు పైగా వసూళ్లు సాధించింది అదరగొట్టింది. ‘బేబీ’ సినిమా తర్వాత ఆనంద్ నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’ పైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కూడా అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్ దేరకొండ ఖాతాలో ‘బేబీ’కి మించి హిట్ పడటం ఖాయం అని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.
మే 31న ప్రేక్షకుల ముందుకు ‘గం గం గణేశా’
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ‘గం గం గణేశా’ మూవీ తెరకెక్కింది. మే 31న థియేటర్స్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ చిత్రంలో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో వంశీ కారుమంచి నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తన మిత్రుడు కేదార్ సెలగం శెట్టితో కలిసి హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీని నిర్మించారు. 400 థియేటర్లలో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతోంది. అటు ఫ్యాన్సీ అమౌంట్ వెచ్చించి ఈసినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
Read Also: మొరటోడు, మొండోడు కాదు... మహారాజు - 'పుష్ప'తో శ్రీవల్లి పాట వచ్చేసింది, కపుల్ సాంగ్ చూశారా?