అన్వేషించండి

Pushpa 2 Second Song: మొరటోడు, మొండోడు కాదు... మహారాజు - 'పుష్ప'తో శ్రీవల్లి పాట వచ్చేసింది, కపుల్ సాంగ్ చూశారా?

Sooseki Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న 'పుష్ప 2' నుంచి 'సూసేకి...' సాంగ్ రిలీజ్ చేశారు. ఆ పాటను  చూడండి. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) హీరోగా క్రియేటివ్ జీనియస్ & టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్న సినిమా 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2 The Rule Movie). ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్. 'పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్' అంటూ సాగే టైటిల్ సాంగ్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సినిమాలో రెండో పాటను విడుదల చేశారు.

నా సామి కాదు... మహారాజు!
'పుష్ప'లో 'నా సామి...' పాటకు రష్మిక వేసిన స్టెప్పులు ప్రేక్షకుల్ని అలరించారు. ఆ సినిమాలో పుష్పను 'నా సామి' అన్న శ్రీవల్లి... ఈ సినిమాలో 'మహారాజు' అంటూ తన భర్త గురించి పాడటం విశేషం. 

'వీడు మొరటోడు...
అని వాళ్ళు వీళ్ళు ఎనెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు!
వీడు మొండోడు...
అని ఊరూ వాడా అనుకున్నా గానీ
మహారాజు నాకు నా వాడు!

మాట పెళుసైనా... మనసులో వెన్న!
రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసు నాకన్నా
సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి''
అంటూ సాగిన ఈ గీతానికి తెలుగులో ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ (Oscar Winner ChandraBose) సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: బాలయ్య బర్త్ డేకి మరో గ్లింప్స్ - ఈసారి వేటకు డబుల్ పూనకాలు వచ్చేస్తాయ్!

ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్!
'పుష్ప 2: ది రూల్' సినిమాను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. 'పుష్ప'కు గాను బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో  తొలిసారి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న హీరోగా ఆయన చరిత్ర సృషించారు. దాంతో సీక్వెల్ మీద అంచనాలు మరింత పెరిగాయి.

Also Readఎలాన్ మస్క్ గారూ... బుజ్జి కోసం 'ఎస్' బాస్‌ కు 'కల్కి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పెషల్ రిక్వెస్ట్

అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్ .బి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: ఎస్. రామకృష్ణ - మోనిక నిగొత్రే, సాహిత్యం: చంద్రబోస్, సీఈఓ: చెర్రీ, నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Seven Hills Satish: దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
గుడిలోకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి?  కారణాలు తెలుసా?
గుడిలోకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి? కారణాలు తెలుసా?
Preventing Stroke in Diabetics : మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
Advertisement

వీడియోలు

1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
ఒరే ఆజామూ..  1000 రోజులైందిరా!
బీసీసీఐ వార్నింగ్‌కి బెదరని నఖ్వి.. ట్రోఫీ నేనే ఇస్తానంటూ మొండి పట్టు
బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలుపుతో ఇండియాకి లైన్ క్లియర్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Seven Hills Satish: దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
గుడిలోకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి?  కారణాలు తెలుసా?
గుడిలోకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి? కారణాలు తెలుసా?
Preventing Stroke in Diabetics : మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 45 రివ్యూ... ఇమ్మూపై దువ్వాడ మాధురి దౌర్జన్యం... మళ్ళీ నోరు జారిన సంజన... హౌస్‌లో ఏం జరిగిందంటే?
బిగ్‌బాస్ డే 45 రివ్యూ... ఇమ్మూపై దువ్వాడ మాధురి దౌర్జన్యం... మళ్ళీ నోరు జారిన సంజన... హౌస్‌లో ఏం జరిగిందంటే?
Love OTP Movie: బన్నీతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశా... కానీ ఆయన సలహా వినలేదు - హీరో అనీష్
బన్నీతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశా... కానీ ఆయన సలహా వినలేదు - హీరో అనీష్
OG OTT: ఓటీటీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 'ఓజీ'... నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందంటే?
ఓటీటీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 'ఓజీ'... నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Tuni Rapist Issue: తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
Embed widget