బీసీసీఐ వార్నింగ్‌కి బెదరని నఖ్వి.. ట్రోఫీ నేనే ఇస్తానంటూ మొండి పట్టు
ఆసియా కప్ 2025 ట్రోఫీ విషయంలో ఏసిసీ, బీసీసీఐ మధ్య సిట్యుయేషన్ సీరియస్ అవుతోంది. టోర్నీ గెలిచి నెల రోజులు కావస్తున్నా.. ఇంకా ట్రోఫీ, మెడల్స్‌ని బీసీసీఐకి అప్పగించకపోవడంపై.. ఏసీసీపై సీరియస్ అయిన బీసీసీఐ.. మర్యాదగా ట్రోఫీ, మెడల్స్‌ని అప్పగించాలని, లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని నఖ్వికి అఫీషియల్ ఈ-మెయిల్ పంపి వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఈ ఈమెయిల్‌కి ఎలాంటి రిప్లై రాకపోతే.. వెంటనే ఐసీసీలో కంప్లైంట్ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఈ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చినా.. నఖ్వీ మాత్రం వెనక్కి తగ్గేలా లేడు.
రీసెంట్‌గా బీసీసీఐ ఈమెయిల్‌కి రిప్లై ఇచ్చిన నఖ్వి.. ‘ఆసియా కప్ 2025 ట్రోఫీ బీసీసీఐకి ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అది కచ్చితంగా భారతదేశానికే చెందుతుంది. కానీ ఇది ఏసీసీ టోర్నీ కాబట్టి.. నేను ఏసీసీ అధ్యక్షుడిని కాబట్టి.. నా చేతుల మీదుగానే ట్రోఫీని టీమిండియాకు అందిస్తా. భారతదేశంలో ఒక ప్రెజెంటేషన్ వేడుకను నిర్వహించుకోండి. సరిహద్దులు దాటి ట్రోఫీని పంపాలని మాత్రం ఆశించొద్దు. నా నుంచి నేరుగా ట్రోఫీని తీసుకోవడానికి ఒక భారత జట్టు ఆటగాడిని పంపాలని బీసీసీఐని కోరుతున్నా’ అని రిప్లై ఇచ్చాడు. అంటే నఖ్వి తన నక్కజిత్తులు ఇంకా మార్చుకోలేదన్నమాట. ఒకపక్క ఆసియా కప్ 2025 ట్రోఫీని ఇస్తా అంటూనే.. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తానని పట్టుదలగా కూర్చున్నాడు. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందింస్తుందో చూడాలి.






















