Seven Hills Satish: దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
'బిగ్ బాస్' గౌతమ్ కృష్ణ హీరోగా 'సోలో బాయ్' సినిమా నిర్మించిన 'సెవెన్ హిల్స్' సతీష్... ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. తనతో పాటు ఎడిటర్ ప్రవీణ్ పూడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్టు చెప్పారు.

నిర్మాతలు దర్శకులు కావడం కొత్త కాదు. సంక్రాంతి రాజుగా పేరు తెచ్చుకున్న ఎంఎస్ రాజు డైరెక్టర్ అయ్యారు. ఆయనకు ముందు సైతం కొందరు ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో చేరుతున్నారు యువ నిర్మాత 'సెవెన్ హిల్స్' సతీష్. తన పుట్టినరోజు సందర్భంగా అప్ కమింగ్ మూవీస్ అనౌన్స్ చేసిన ఆయన... తాను దర్శకుడు అవుతున్న విషయాన్ని తెలిపారు.
వీవీ వినాయక్ సలహాతో దర్శకుడిగా!
'బట్టల రామస్వామి బయోపిక్'తో నిర్మాతగా 'సెవెన్ హిల్స్' సతీష్ జర్నీ మొదలైంది. ఆ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత 'కాఫీ విత్ ఏ కిల్లర్' అని మరో మూవీ చేశారు. సతీష్ ప్రొడ్యూస్ చేసిన రీసెంట్ సినిమా అయితే 'బిగ్ బాస్' ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన 'సోలో బాయ్'. అక్టోబర్ 23న తన పుట్టినరోజు సందర్భంగా దర్శకుడిగా మారుతున్నట్టు చెప్పారు.
'సెవెన్ హిల్స్' సతీష్ మాట్లాడుతూ... ''మా గురువు గారు వీవీ వినాయక్ 'సోలో బాయ్' ఈవెంట్‌లో చెప్పినట్టు నేను దర్శకుడు అవుతున్నాడు. ఆ ప్రయత్నాన్ని ఈ పుట్టిన రోజు సందర్భంగా మొదలు పెట్టాను. మూడు సినిమాలు నిర్మించిన అనుభవంతో దర్శకుడిగా మారుతున్నా. అలాగే ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా. రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేశాం. అది స్క్రిప్ట్ దశలో ఉంది'' అని చెప్పారు.
Also Read: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ థియేటర్లు ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
నార్నె నితిన్ డేట్స్ అలాగే ఉన్నాయ్!
ఉగాది రోజున నార్నె నితిన్ హీరోగా 'సెవెన్ హిల్స్' సతీష్ నిర్మాణంలో ఒక సినిమా ప్రారంభమైంది. అయితే అది పట్టాలెక్కలేదు. ఆ కథను సరికొత్తగా మార్చి త్వరలో మరో సినిమా చేస్తున్నామని సతీష్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నార్నె నితిన్ డేట్స్ మా దగ్గర అలాగే ఉన్నాయి. కథ కుదిరితే ఆయనతో సినిమా చేస్తాను. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నా. 'బలగం', 'లిటిల్ హార్ట్స్' తరహాలో తక్కువ నిర్మాణ వ్యయంలో ప్రేక్షకుల్ని నవ్వించే సినిమా చేస్తా. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సహాయ దర్శకుడిగా కొన్ని చిత్రాలకు పని చేశా. వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపత్ నంది, బలగం వేణు నాకు మంచి స్నేహితులు. సురేష్ ప్రొడక్షన్స్ సహా కొన్ని నిర్మాణ సంస్థల్లో పని చేశా. నందినీ రెడ్డి, మచ్చ రవి, నేచురల్ స్టార్ నానితో దర్శకత్వ శాఖలో వర్క్ చేశా'' అని వివరించారు.





















