టెస్ట్ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
ఇంగ్లండ్ టూర్‌లో తీవ్రంగా గాయపడి భారత జట్టుకు దూరమైన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కి ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. గాయం నుంచి కోలుకుంటున్న పంత్.. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సిరీస్ కంటే పంత్‌ని భారత్-ఏ టీమ్ కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ.
సౌతాఫ్రికా-ఏతో జరిగే రెండు అఫీషియల్ టెస్ట్‌లతో పాటు 3 అనఫీషియల్ వన్డేల కోసం పంత్ కెప్టెన్‌గా టీమ్‌ని అనౌన్స్ చేసింది సెలక్షన్ కమిటీ. ఈ టీమ్‌లో పంత్ కెప్టెన్‌గా సెలక్ట్ కాగా.. యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్‌కి కూడా ప్రమోషన్ ఇచ్చిన అజిత్ అగార్కర్ టీమ్.. వైస్ కెప్టెన్‌గా సెలక్ట్ చేసింది. ఇదెలా ఉంటే.. గత జూలైలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్ సందర్భంగా రిషభ్ పంత్ పాదానికి తీవ్ర గాయమైంది.
అయినా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించిన పంత్.. ఆఖరి టెస్ట్ ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున రీఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నా.. ఇండియా ఏ కెప్టెన్‌గా సెలక్ట్ కావడంతో.. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా ఏతో అనఫీషియల్ టెస్ట్ సిరీస్ మొదలవుతుండడం వల్ల.. రంజీలు ఆడే ఛాన్స్‌లు లేకుండా పోయాయి.





















