అన్వేషించండి

Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం

Indiramma Indlu in Urban Area: పట్టణ ప్రాంత పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జి ప్లస్1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Indiramma Indlu in Urban Area: పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలకు ఇల్ల విషయంలో సాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి కీలక ప్రకటన జారీ చేశారు. ఇందిర‌మ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఈ పథకం వర్తింపజేస్తున్నట్టు వెల్లడించారు.  

సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి..." రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింప చేస్తున్నాం. కనీసం 30 చదరపు  మీటర్ల విస్తీర్ణంలో  జి ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు  జీవో ఎంస్ నె 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేశాం." 

పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతోపాటు, స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇంటి వసతి కోసం కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధ్యయనం చేశామని వెల్లడించారు. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోడానికి తగిన స్థలం లేక, అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అటువంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 

అనేక మంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్రా తాత్కాలిక ఏర్పాట్లతో జీవిస్తున్నారని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి  ఆర్‌సిసి స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో జి ప్లస్ 1 నిర్మాణాలకు అనుమతినిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తున్న రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని దశల వారీగా నిర్మాణపు పనుల స్థాయిని బట్టి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలంటే....

జి+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో , 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి, ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్ రూంలు తప్పనిసరిగా ఉండాలని, ఈ ఇంటి నిర్మాణం ఆర్ సిసి స్లాబ్ తో ఉండాలని, ఇందుకు సంబంధించిన  స్ట్రక్చరల్  డిజైన్లకు డిఇఇ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

నాలుగు దశల్లో రూ.5 లక్షలు చెల్లింపు...

మొదటి అంతస్తు – రూఫ్  లెవల్ వరకు నిర్మాణం అయితే  రూ. 1 లక్ష , అటు తరువాత గ్రౌండ్ ఫ్లోర్ – రూఫ్ వేసిన తరువాత రూ.1 లక్ష, ఆపైన ఫస్ట్ ఫ్లోర్‌లో కాలమ్స్, స్లాబ్, గోడల నిర్మాణాలు పూర్తి అయితే రూ.2 లక్షలను, ఇంటి నిర్మాణపు పూర్తి అయిన తరువాత మరో లక్ష రూపాయలను విడుదల చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా పేద‌వాళ్ల ఇంటికోసం ఐదు ల‌క్ష‌ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌ని  మంత్రి చెప్పారు.  

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక ఎత్తు అయితే, పట్టణ ప్రాంతాల్లో మరో ఎత్తు అని, ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ అని దీనిని దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

Frequently Asked Questions

పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎందుకు అమలు చేస్తున్నారు?

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అయిన నేపథ్యంలో, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈ పథకాన్ని విస్తరిస్తున్నారు.

పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంత స్థలం అవసరం?

పట్టణ ప్రాంతాల్లోని ఇరుకు స్థలాల్లో నివసించే వారికి కూడా పక్కా ఇళ్లు కల్పించేలా, జి ప్లస్ 1 పద్ధతిలో కనీసం 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది?

ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారులకు దశలవారీగా అందజేస్తారు.

పట్టణాల్లో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి?

జి+1 విధానంలో 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు గదులు, 35.5 చదరపు అడుగుల్లో వంటగది, ప్రతి ఇంటికి ప్రత్యేక టాయిలెట్, బాత్ రూమ్ తో పాటు ఆర్‌సిసి స్లాబ్ తో నిర్మాణం ఉండాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Advertisement

వీడియోలు

India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
Embed widget