Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 45 రివ్యూ... ఇమ్మూపై దువ్వాడ మాధురి దౌర్జన్యం... మళ్ళీ నోరు జారిన సంజన... హౌస్‌లో ఏం జరిగిందంటే?
Bigg Boss 9 Telugu Today Episode - Day 45 Review : బిగ్ బాస్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి 'వాంటెడ్ పేట' టాస్క్ ను ప్లాన్ చేశారు. కానీ కంటెస్టెంట్స్ కన్ఫ్యూజన్ తో వినోదాన్ని అటకెక్కించారు.

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 'వాంటెడ్ పేట' టాస్క్ నడుస్తోంది. హౌస్ మేట్స్ అందరూ కరుడుగట్టిన నేరస్థులు అంటూ ఆడియన్స్ ను ఎంటరైన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ 'గోలిసోడా' టాస్క్ లోనే సంజన టీం డబ్బులు తనూజా - సుమన్ దొంగతనం చేయడంతో రచ్చ మొదలైంది. "నేను కొంతమందిని నమ్ముతాను. అలాంటి వాళ్ళు చీట్ చేస్తే నాకు మాచెడ్డ చిరాకు. నువ్వు అనే మాటలు నేను తీసుకోను" అంటూ తనూజాపై ఫైర్ అయ్యింది మాధురి. "నువ్వు తీసేటప్పుడు నేను చూశాను. కానీ ఒకే టీం అనుకుని నోరు మూసుకున్నా" అంటూ రీతూ తనూజాతో గొడవ పడింది.
దివ్య, కళ్యాణ్, దువ్వాడ మాధురి వర్సెస్ సంజన
"దొంగల టాస్క్ లో దొంగతనం చేస్తే అన్ ఫెయిర్ అంటారా? అదే మీరు చేస్తే ఫన్. మేము చేస్తే అన్యాయం... నన్ను గేమ్ నుంచి తీసే రైట్ మీకు లేదు" అంటూ సంజనకు ఇచ్చిపడేసింది దివ్య. ఆమెను తీసేసి గేమ్ ఆడదాము అని దువ్వాడ మాధురిని అడిగినా ఒప్పుకోలేదు. పైగా తన టీంలో ఉన్నవాళ్ళందరికీ డబ్బులు సమానంగా పంచింది.
"గుడ్డు దొంగతనాన్ని, దీన్ని ఎలా పోలుస్తాము?" అంటూ దువ్వాడ మాధురితో గొడవ పడింది సంజన. అలాగే "మేము సెలబ్రిటీలు... బాహుబలి క్లైమాక్స్ లో లాగా గోళ్ళతో రక్కుతూ గొడవ పడలేము" అంటూ కళ్యాణ్ క్లాస్ కాదని నోరు జారింది. దీంతో "ఫస్ట్ నుంచి ఎవరు చెప్పించుకుని చెప్పించుకుని మెడలో బోర్డు వేయించుకున్నారో అందరికీ తెలుసు" అంటూ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఎట్టకేలకు తనూజాను తనవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేసింది సంజన. కానీ వర్కవుట్ కాలేదు.
పానీ పూరీ, కాఫీ అమ్ముకున్న గ్యాంగ్ స్టర్స్
"ఈ వాంటెడ్ పేటలో సంజన సైలెన్సర్ పానీ పూరి, మాస్ మాధురి టీ స్టాల్ పెట్టుకుని... ఇతర గ్యాంగ్ స్టార్స్ నుంచి సమాచారం పొందొచ్చు" అని తెలిపారు బిగ్ బాస్. "డబ్బులు దొంగించారు. ఇది అన్యాయం బిగ్ బాస్" అంటూ వాపోయింది సంజన. కానీ "ఇది రెండు గ్యాంగ్స్ మధ్య ఉన్న సమస్య. మీరే తేల్చుకోండి" అంటూ చేతులు ఎత్తేశాడు బిగ్ బాస్. పానీ పూరి చూసి మాధురి టీం నుంచి సంజన టీంకి మారి రీతూ పార్టీ చేంజ్ చేసింది. అలాగే ఇమ్మాన్యుయేల్, సాయిలను స్వయంగా మాధురి బ్లూ టీంలోకి గెంటేసింది.
Also Read: బిగ్‌బాస్ డే44 రివ్యూ... మాస్ మాధురితో పెట్టుకుంటే మడతడిపోద్ది... హౌస్‌లో కరుడు గట్టిన నేరస్థులు
తీరా టాస్క్ అయ్యాక "తినేసి వస్తానని వెళ్ళావు కదా? నా టీంలోకి రా" అని అడిగింది మాధురి. "నేను వెళ్ళనంటే నువ్వే తీసేశావు. ఇప్పుడు పరిస్థితి వచ్చేలా లేదు" అని ఇమ్ము అనగానే... మాధురి - సుమన్ కలిసి ఇమ్మూకి బలవంతంగా రెడ్ కర్చీఫ్ కట్టి, తమవైపు లాగేసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ సుమన్, సాయి, డెమోన్ హాయిగా గుర్రు పెట్టి పడుకోగా, బిగ్ బాస్ కుక్కల అరుపులతో నిద్ర లేపారు. 'ధమాకా కింగ్స్' అంటూ డబ్బు సంపాదించడానికి మరో టాస్క్ పెట్టారు. ఈ పోటీలో ఒక్కో గ్యాంగ్ నుంచి 5 మంది కంటెస్టెంట్స్ పాల్గొనాలి. ఈ పోటీలో మాధురి టీం గెలిచింది. ఓడిపోయిన టీం మాధురిని ఇల్లంతా ఎత్తుకుని తిరుగుతూ ఊరేగించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో టాస్కులు సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఆడకుండా యమా బోర్ కొట్టించారు.
Also Read: భరణి ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే... 6 వారాల్లో నాన్న జేబులో పడింది ఎంతంటే?





















