Bigg Boss 9 Telugu: భరణి ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే... 6 వారాల్లో నాన్న జేబులో పడింది ఎంతంటే?
Bigg Boss 9 Telugu : ఈ వారం భరణి హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న ఆయన బిగ్ బాస్ హౌస్ లో 6 వారాలకు గానూ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనేది తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి పెద్దగా పరిచయం లేని ముఖాలతో స్టార్ట్ అయ్యింది. హౌస్ లో అంతో ఇంతో తెలిసిన కంటెస్టెంట్స్ లిస్ట్ లో సీనియర్ యాక్టర్ భరణి ఒకరు. టీవీ, సినిమాల్లో ఒకప్పుడు నెగెటివ్ రోల్స్ లో నటించిన ఆయన తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు. చాలాకాలం గ్యాప్ తరువాత 'బిగ్ బాస్ సీజన్ 9'తో రీఎంట్రీ ఇచ్చి, కెరీర్ ను గాడిన పెట్టుకోవాలని ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఆయన టాప్ 5లో ఉంటాడని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఆడియన్స్ కి షాక్ ఇస్తూ, భరణిని 6వ వారమే హౌస్ నుంచి బయటకు సాగనంపారు.
డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు
ఈ వారం నామినేషన్లలో డెమోన్ పవన్, భరణి, తనూజ, సుమన్ శెట్టి, దివ్య నికిత, రామూ రాథోడ్ ఉన్నారు. వీళ్ళలో డెమోన్, రామూ, భరణి డేంజర్ జోన్ లో ఉండగా, ఆశ్చర్యకరంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణినే ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు తనూజాతో తండ్రీ - కూతురు, దివ్యతో అన్నా - చెల్లి బాండింగ్ నడిపించారు భరణి. టాస్క్ లలో ఇరగదీసినప్పటికీ బంధాల భరణి అనే ముద్ర పడిపోయింది. పైగా వీళ్ళ బంధాల వల్ల ఈసారి బిగ్ బాస్ అనే కొత్త సీరియల్ ను చూస్తున్నామా? అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోయారు ఆడియన్స్.
ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బేసింది
"బాండింగ్స్ పక్కన పెట్టు, గేమ్ ఆడు" అంటూ నాగార్జున ప్రతి వీకెండ్ లో హెచ్చరించారు. అయినా ఓవర్ కాన్ఫిడెన్స్ తో తీరును ఏమాత్రం మార్చుకోలేదు. పైగా ఈ వారం నామినేషన్లలో "నేను దెబ్బ కొడితే ఎలా ఉంటుందో చూపిస్తా. సినిమా చూపిస్తా" అంటూ సినిమా రేంజ్ లో డైలాగులు చెప్పారు. కానీ చివరకు బిగ్ బాస్ దెబ్బకు ఆయనే బలయ్యాడు. అంతేకాదు వైల్డ్ కార్డు ఎంట్రీల తరువాత ఆయన అసలు హౌస్ లో ఉన్నారా లేరా ? అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇదే ఫైర్ ముందు నుంచీ ఉండి ఉంటే భరణి సేవ్ అయ్యే ఛాన్స్ ఉండేదేమో. ఇక తనూజ ఎపిసోడ్ ముందు నుంచే ట్యాప్ తిప్పేసింది. కన్ఫెషన్ రూమ్ లో నాగ్ దగ్గర "నాన్న ఈరోజు ఎలిమినేట్ అవుతారేమో అన్పిస్తోంది" అంటూ ఓపెన్ అయ్యింది. ఆమె అనుకున్నదే జరిగింది. దీంతో తనూజ గుక్కపెట్టి ఏడ్చింది. ఆమెతో పాటే భరణితో మంచి బాండింగ్ ఉన్న వాళ్ళంతా బాధ, షాక్ తో ఆయనకు గుడ్ బై చెప్పేశారు. భరణి రీఎంట్రీ ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్
బిగ్ బాస్ సీజన్ 9లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా నిలిచారు భరణి. ఆయన రోజుకి రూ. 50,000, ఒక్కో వారానికి రూ. 3,50,000 రెమ్యునరేషన్ ను తన జేబులో వేసుకున్నట్టు సమాచారం. ఈ లెక్క ప్రకారం ఆయన హౌస్ లో ఉన్న 6 వారాలకుగానూ రూ. 21,00,000 అందుకున్నట్టు తెలుస్తోంది.





















