Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 37 రివ్యూ... దువ్వాడ మాధురి ఎవర్ని నామినేట్ చేసిందో తెల్సా? బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఫినాలేకు... తనూజాను టార్గెట్ చేసిన అయేషా!
Bigg Boss 9 Telugu Today Episode - Day 37 Review : ఈ వారం నామినేషన్స్ లో వైల్డ్ కార్డ్స్ పెట్టిన రచ్చ అంతా ఇంతా కాదు. బయట నుంచే ఎవరెవరిని టార్గెట్ చేయాలో పక్కా ప్లాన్ వేసుకొచ్చారు వైల్డ్ కార్డ్స్.

బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత అసలు రచ్చ మొదలైంది. నిన్న సగం నామినేషన్ ప్రక్రియతోనే ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడగా, నేడు అక్కడి నుంచే కంటిన్యూ అయ్యింది. ఈసారి బాల్ ను దివ్వెల మాధురి పట్టేసి, రీతూ చౌదరికి ఇచ్చింది. ఆమె "టైమ్ వచ్చినప్పుడు సపోర్ట్ గా ఉంటానని మాటిచ్చి మాట తప్పాడు" అంటూ భరణిని, "ఈరోజు టైమ్ కి ఫుడ్ రాలేదు" అంటూ దివ్యను నామినేట్ చేసింది. అందులో మాధురి మాత్రం దివ్యనే నామినేట్ చేసింది. వీళ్లిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ హీట్ గట్టిగానే నడిచింది. అంతా అయ్యాక "ఈ సీరియల్లో నేనే విలన్. నేనొచ్చాక మీకు తనూజ దూరం అయ్యింది అంటున్నారు. ఏంటిది మాకు?" పూల్ టాస్క్ లో నడుములు పడిపోయేలా హెల్ప్ చేశా. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది దివ్య.
బిగ్ బాస్ హౌస్ నుంచి వాకౌట్ చేస్తా
ఇక భరణి "నేను కొడితే దెబ్బ ఎలా ఉంటుందో జనాలకు తెలిసే టైం వచ్చింది. సినిమా చూస్తూ ఉండు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను రీతూని నామినేట్ చేయలే. నన్ను టార్గెట్ చేసినవాళ్లు వెళ్లిపోతున్నారు. వాళ్లలో నేను ఎవ్వరినీ టార్గెట్ చేయలేదు" అంటూ భరణి ఆగ్రహంతో ఊగిపోయాడు. నెక్స్ట్ గౌరవ్ బాల్ తీసుకుని సంజనాకు ఇచ్చాడు. ఆమె "నాకు హెల్త్ బాలేదు. మీకు కనిపించలేదా? మీ హ్యుమానిటీ ఎక్కడికి పోయింది? సంచాలక్ గా ఫెయిల్" అంటూ రాముని, "మీకెందుకు నా గురించి" అంటూ భరణిని నామినేట్ చేసింది. వెంటనే భరణి లేచి ఏం జరిగిందో వెల్లడించాడు. "హ్యుమానిటీ టాక్ వచ్చింది కాబట్టి చెప్తున్న. మీకోసం నా బాక్స్ త్యాగం చేశాను. మీరు గుండాలు అనడం కరెక్ట్ కాదు" అంటూ ఫైర్ అయ్యాడు భరణి. "నేను సంజనాను వెంటనే బయటకు పంపు అనే మాట అని ఉంటే వాక్ ఔట్ చేస్తా" అంటూ శపథం చేశాడు. గౌరవ్ వచ్చి భరణిని నామినేట్ చేశాడు.
తనూజకు ఇచ్చిపడేసిన అయేషా
గౌరవ్ మళ్ళీ బాల్ పట్టుకున్నాడు. కానీ అయేషా బాల్ ఇవ్వమని ఫైర్ అవ్వడంతో ఆమెకే ఇచ్చేశాడు. అయేషా బాల్ ను సుమన్ శెట్టి ఇచ్చింది. "మనిద్దరం ఓ టీమ్ గా ఉందామని చెప్పి, చివరకి స్టాండ్ తీసుకోలేదు. పైగా ఎమోషనల్ అవుతావు" అంటూ తనూజను, సెకండ్ సంజనాను నామినేట్ చేశాడు. అయేషా వచ్చి "మీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్ ఫెయిర్ జరుగుతోంది. మీకు ఉన్న బాండింగ్ వల్ల ఫేవరిజం జరుగుతోంది. మీవల్ల భరణి గేమ్ పాడు అవుతోంది అని నాకు అనిపిస్తోంది. ఆల్రెడీ స్టార్ మాలో మంచి సీరియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అది అక్కర్లేదు. అరుస్తారు లేదా ఏడుస్తారు. ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఈ సీజన్ అంతా ఫైనల్ వరకు వస్తాం అన్నట్టు గా ఉంది" అంటూ ఇచ్చి పడేసింది అయేషా.
Also Read: బిగ్ బాస్ హౌస్‌ను షేక్ చేస్తున్న దివ్వెల మాధురి... అల్లాడిపోతున్న సభ్యులు!
షాక్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్
తనూజ కూడా ఆమెకు స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది. ఇది జరగానికి కొన్ని నిమిషాల ముందే అయేషా కూడా బాల్ కోసం సపోర్ట్ అడిగి తనూజకు దొరికిపోయింది. అయితే "నా ఫస్ట్ టార్గెట్ నువ్వే" అని కుండబద్దలు కొట్టి తనూజను నామినేట్ చేసింది అయేషా. భరణి లేచి "నా గేమ్ కోసం నేను ఆడాను. ఎవరి కోసం నేను గేమ్ పాడు చేసుకోలేదు. మీరు చెప్పింది నేను దృష్టిలో పెట్టుకుంటాను" అంటూ క్లారిటీ ఇచ్చాడు. కెప్టెన్ గా పవర్ ను ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు కళ్యాణ్. ఫైర్ స్టార్మ్ అంతా కలిసి డెమోన్, భరణి, తనూజ, సుమన్ శెట్టి, దివ్య నికిత, రామూ రాథోడ్ లను నామినేట్ చేశారు. ఈ కథంతా అయ్యాక "తనూజ సీరియల్ క్యారెక్టర్ లో ఉంది" అంటూ సంజన మాధురితో చెప్పేసింది. మరోవైపు ఇమ్మాన్యుయేల్ సూపర్ గా చెప్పావు అంటూ అయేషాతో తనూజ గురించి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా అయేషా తనూజ గురించి ఆర్గ్యుమెంట్ చేశాక ఇమ్మూ చప్పట్లు కొట్టి షాక్ ఇచ్చాడు.





















