Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 36 రివ్యూ... అమ్మాయిల పిచ్చోడు లాగిపెట్టి కొడతా... కళ్యాణ్ పరువు మొత్తం తీసేసిన రమ్య, మాధురి... ఫైర్ స్టార్మ్ అంటే ఇదా బిగ్ బాస్?
Bigg Boss 9 Telugu Today Episode - Day 36 Review : 36వ ఎపిసోడ్లో ఫైర్ స్టార్మ్ గా ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరూ ఒక్కొక్క కంటెస్టెంట్ను టార్గెట్ చేశారు

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 36 రోజు ఫైర్ స్టార్మ్ గా అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్స్ కు బిగ్ బాస్ వెల్కమ్ పలికారు. "మీ స్నేహం లేదా వైరం ఎవరితో అనేది మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ హౌస్ లో నమ్మకం చాలా ముఖ్యం. గెలిచే వరకు మీ ఆశలు, ఆశయాలను అస్సలు వదులుకోకండి. ఈ యుద్ధాన్ని మళ్ళీ మొదలు పెడదాం" అంటూ ఎనర్జీ నింపారు బిగ్ బాస్.
తనూజ వర్సెస్ దివ్య... భరణిని ఇరుకున పెట్టిన వైల్డ్ కార్డ్స్
"ఎలిమినేషన్ రౌండ్ లో మేము బెలూన్ కట్ చేయాల్సి వచ్చింది. మీరు ఆ ప్లేస్ లో దివ్య - తనూజ ఉంటే ఏం చేస్తారు?" అని అడిగారు అయేషా, రమ్య. "ఫేక్ ట్యాగ్ ఊరికే ఇవ్వం కదా" అంటూ భరణిని ఇరుకులో పెట్టారు. ఇక ఇప్పటి నుంచి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు కాకుండా అందరూ ఒకే హౌస్ లో ఉండాలని బిగ్ బాస్ సూచించారు. పడుకునే ముందు మాధురికి వంట బాధ్యతలు అప్పగించింది దివ్య. ఆ తర్వాత భరణితో కూర్చుని "నేను గేమ్ కోసం మిమ్మల్ని వాడుకుంటున్న అనేది నచ్చట్లేదు" అంటూ కుళాయి తిప్పింది.
నెక్స్ట్ డే ఉదయాన్నే ఇమ్మాన్యుయేల్ అయేషాతో "అందరూ మేకప్ వేస్తేనే బాగుంటారు. మీరు మేకప్ లేకుండా కూడా ఎంత క్యూట్ గా ఉన్నారు" అంటూ తనూజకు కోపం తెప్పించేలా పులిహోర కలిపారు. "కోడలా కోడలా నా కొడుకుని కొట్టాలా అనే కొత్త సీజన్ మొదలెడదాం. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రాకతో మాకు కూడా టైమ్ వచ్చింది" అంటూ సంజన ఆమెను మరింత ఉడికించింది. మరోవైపు రీతూ బట్టలు ఉతుకుతుంటే "వైల్డ్ కార్డ్స్ వచ్చాక అసలు రూపాలు బయట పడుతున్నాయి" అంటూ సెటైర్ వేశాడు ఇమ్ము. అంతేనా... అయేషా, రమ్య చీరలు కట్టడంతో "అందమా అందమా" అంటూ పాటందుకున్నాడు. "బిగ్ బాస్ నేను అడిగినందుకు... ఇది వైల్డ్ కార్డ్స్ అంటే... " అంటూ గాల్లో తేలిపోయాడు.
ఇదేం పంచాయతీ మాధురి?
వంట లేట్ అవుతోంది అంటూ అసలు రచ్చ ఇప్పుడు మొదలైంది. మాధురితో "బ్రేక్ఫాస్ట్ త్వరగా చేయాలి. ఇంత లేట్ అయితే ఇబ్బంది" అని చెప్పాడు కళ్యాణ్. "నేను రెడీ అయ్యి ఇక్కడే అరగంట కూర్చున్నాను అప్పుడేం చేశారు మీరు? ఏం కూర్చోకపోతే మాట్లాడరా" అంటూ అనవసరంగా నోరు పారేసుకుంది మాధురి. దీంతో కెప్టెన్ కళ్యాణ్ కూడా "మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది" అంటూ ఫైర్ అయ్యాడు. తర్వాత దివ్య క్లారిటీ ఇవ్వడంతో అయిపోయింది గొడవ అనుకునేలోపే, తనూజ దగ్గరకు వెళ్ళి చెప్పి మళ్ళీ మొదలెట్టింది మాధురి. కళ్యాణ్ సారీ చెప్పినా తగ్గలేదు ఆవిడ. దీంతో దివ్య - మాధురి మధ్య ఈ విషయంలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. కానీ విచిత్రంగా గొడవ మొదలెట్టిన మాధురే కన్నీళ్లు పెట్టుకుంది. మళ్ళీ కళ్యాణ్ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
వరస్ట్ వైల్డ్ కార్డ్స్
గొడవలో సపోర్ట్ చేయలేదని భరణిపై అలిగింది దివ్య. కళ్యాణ్, దివ్య - భరణి మధ్య మళ్ళీ కిచెన్ గొడవ డిస్కషన్ జరిగింది. "శ్రీజా బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు కళ్యాణ్. అమ్మాయిల పిచ్చోడు. ఫస్ట్ రోజు ఆ అమ్మాయి చేతులు పెట్టుకుని ఇలా ఇలా చేస్తున్నాడు. ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? తనూజ లీనియన్స్ ఇచ్చింది కాబట్టే అలా చేస్తున్నాడు. నాతో అలా చేస్తే లాగి పెట్టి కొడతా. కిందేసి తొక్కేస్తా. ఒకరలా చేశారంటే మనం కూడా ఏదో ఒకటి ఇచ్చే ఉంటాం కదా. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు" అంటూ రమ్య, దివ్వెల మాధురి ఇద్దరూ కలిసి కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేశారు. అంతలోనే ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడింది.
6వ వారం నామినేషన్ ను బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టారు. "బాల్ ఆఫ్ ఫైర్" టాస్క్ లో వైల్డ్ కార్డ్స్ బాల్ ను పట్టుకుని, తమకు నచ్చిన కంటెస్టెంట్ కు ఇవ్వాలి. వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ ఇద్దరిలో ఒకరిని మళ్ళీ వైల్డ్ కార్డ్ నామినేట్ చేస్తుంది. ఈ పద్ధతిలోనే నిఖిల్ తనూజకు ఇవ్వగా... ఆమె సుమన్ శెట్టి, రాముని నామినేట్ చేసింది. అందులో నిఖిల్ సుమన్ ను నామినేట్ చేశాడు. రమ్య రాముకి బాల్ ఇవ్వగా, రీతూ - పవన్ ను నామినేట్ చేశాడు. రీతూని సేవ్ చేసి డెమోన్ ను రమ్య నామినేట్ చేసింది.





















