Bigg Boss 9 Telugu: శ్రీజ దమ్ము కంటే ఫ్లోరాకే భారీ రెమ్యూనరేషన్... బిగ్ బాస్ హౌస్ నుంచి దిమ్మతిరిగే సంపాదనతో బయటకొచ్చిన లక్కీ లక్స్ పాప
Asha Saini Remuneration - Bigg Boss 9 Telugu: లక్స్ పాప ఫ్లోరా సైనీతో పాటు శ్రీజ దమ్మును కూడా డబుల్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించారు. మరి వీరిద్దరిలో ఎవరి రెమ్యునరేషన్ ఎంత?

Srija Dammu Remuneration - Bigg Boss 9 Telugu: సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ అంటూ బిగ్ బాస్ సీజన్ 9ను కొత్త థీమ్ తో మొదలు పెట్టారు. కానీ వరుసగా కామనర్స్ ఎలిమినేట్ అవుతుండడంతో ప్రస్తుతం హౌస్ లో సెలబ్రిటీలే ఎక్కువగా ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగ్గా, ఫ్లోరా సైనీ - శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యారు. కానీ గేమ్ అదరగొడుతున్న శ్రీజను వైల్డ్ కార్డు ఎంట్రీలు బయటకు పంపి షాక్ ఇచ్చారు. మరి వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ దక్కింది? అనేది తెలుసుకుందాం.
శ్రీజ దమ్ము రెమ్యూనరేషన్
అగ్ని పరీక్షను దాటుకుని బిగ్ బాస్ 9 హౌస్ లోకి అడుగు పెట్టిన పవర్ ఫుల్ కంటెస్టెంట్స్ లో శ్రీజ దమ్ము ఒకరు. మొదటి రెండు వారాలు ఆమెపై తీవ్రమైన నెగెటివిటీ వచ్చిని. అన్నింటికీ ఆమె నోరేసుకుని పడిపోవడం ఆడియన్స్ కు నచ్చలేదు. కానీ నెమ్మదిగా మారుతూ వచ్చింది శ్రీజ. ఏదైనా వివాదం వచ్చిందంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ తాట తీసేది. సన్నగా ఉన్నా కరెంట్ తీగలాగా... టాస్క్ లలో కూడా సత్తా చాటింది. కానీ 5వ వారమే వైల్డ్ కార్డు ఎంట్రీల నిర్ణయంతో ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. దీంతో ఒకప్పుడు ఆమె ఎలిమినేట్ అయితే బాగుండునని కోరుకున్న ఆడియన్సే ఇప్పుడు "శ్రీజది అన్ ఫెయిర్ ఎలిమినేషన్" అంటూ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరి ఈ నెగెటివిటీ నేపథ్యంలో శ్రీజ రీఎంట్రీ ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా, 5 వారాలకు గానూ బిగ్ బాస్ హౌస్ లో శ్రీజ రూ.3 నుంచి రూ. 3.5 లక్షల వరకు సంపాదించింది. కామనర్స్ అందరిలాగే ఆమెకు కూడా వారానికి 60-70 వేల రెమ్యూనరేషన్ అందినట్టు సమాచారం.
లక్స్ పాప పారితోషికం ఎంతంటే?
ఈ వీకెండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఎలిమినేట్ అయ్యింది లక్స్ పాప. అప్పుడెప్పుడో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సడన్ గా బిగ్ బాస్ స్టేజ్ పై పేరు మార్చుకుని కన్పించడంతో తెలుగు ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు. కానీ మొదట్లోనే సంజనతో గొడవేసుకుని రచ్చ రచ్చ చేసింది. తరువాత వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారనుకోండి. కానీ సంజనకు బానిసలా వ్యవహరిస్తోంది అని హౌస్ మేట్స్ కంప్లైంట్ చేసే దాకా ఆ ఫ్రెండ్షిప్ వెళ్ళింది. అంతేకాదు బిగ్ బాస్ చరిత్రలోనే మొట్ట మొదటిసారి 'మోస్ట్ బోరింగ్ పర్సన్, మోస్ట్ అన్ డిజర్వ్డ్' పర్సన్ గా పేరు తెచ్చుకుంది ఫ్లోరానే. ఆటలేం పెద్దగా ఆడకపోయినా, మంచిది అనే పేరు మాత్రం తెచ్చుకుంది. మొదట్లోనే ఎలిమినేట్ అవుతుందన్న ఆవిడ లక్కుతో 5 వారాల పాటు హౌస్ లో కొనసాగింది. ఇక ఆడపులిలా పోరాడిన శ్రీజ కంటే ఫ్లోరా సైనీనే ఈ షో ద్వారా ఎక్కువ సంపాదించింది. ఫ్లోరాకు ఒక్కో రోజుకు రూ. 30,000 రెమ్యూనరేషన్ అని సమాచారం. ఈ లెక్క ప్రకారం ఆమె ఏకంగా 5 వారాల్లో రూ. 10.5 లక్షలు తన ఖాతాలో వేసుకున్నట్టే. శ్రీజకంటే ఫ్లోరాదే రెండు రెట్లు ఎక్కువ సంపాదన.





















