Bigg Boss 9 Telugu: లక్స్ పాపను పంపించేశారు... ఇమ్మూ చేతుల్లోనే పవర్ అంతా... పవర్ అస్త్రా రీతూ చౌదరి కోసమా?
Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ వారం ఎండింగ్ లో వైల్డ్ కార్డు ఎంటరీలతో పాటుగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే ?

బిగ్ బాస్ సీజన్ 9లో 5వ వారం ఆట ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ నామినేట్ చేస్తూ ఒక్కొక్కరికీ ఇమ్యూనిటీ టాస్కుల ద్వారా చుక్కలు చూపించారు. అప్పటికే కెప్టెన్ గా ఉన్న రామూ రాథోడ్ తో పాటు గోల్డెన్ స్టార్ గెలుచుకున్న ఇమ్మాన్యుయేల్ సేఫ్ జోన్ లో ఉండగా, మిగతా హౌస్ మెంట్స్ అందరినీ డేంజర్ జోన్ లోకి నెట్టేశారు బిగ్ బాస్. అయితే ఆయా టాస్కుల్లో విన్ అయ్యి టాప్ లో నిలిచినా భరణి - దివ్య టీంతో పాటు, తనూజ, కొత్త కెప్టెన్ కళ్యాణ్ కూడా సేవ్ అయ్యారు. దీంతో మిగిలిన వారంతా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఇంకేముంది ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు, డబులు ఎలిమినేషన్ అంటూ వస్తున్న వార్తలు వీకెండ్ ఎపిసోడ్ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఫ్లోరాకు కలిసిరాని లక్కు
అయితే ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నవారిలో లీస్ట్ ఓటింగ్ లో ఉన్నది రీతూ, ఫ్లోరా, దివ్య నికిత. అయితే దివ్య ఇమ్యూనిటీ టాస్కులు ఆడి గెలిచిన కారణంగా సేఫ్ జోన్ లో పడింది. కానీ రీతూ, ఫ్లోరాతో పాటు మిగిలిన వాళ్లంతా ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వాళ్లలో ఈ వారం ఫ్లోరా హౌస్ నుంచి బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి నెలకొంది. అలాగే బిగ్ బాస్ చరిత్రలోనే మోస్ట్ బోరింగ్, వరస్ట్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ గా ఫ్లోరా నిలిచారు. గత నాలుగు వారాలుగా పెద్దగా ఆడకపోయినా, మంచిది అనే ట్యాగ్ తెచ్చుకున్న ఆవిడకు ప్యూర్ గా లక్ కలిసొచ్చింది అనే చెప్పాలి. కానీ గతవారం వరస్ట్ కంటెంట్ గా పేరు తెచ్చుకుని నెక్స్ట్ 2 వీక్స్ కి డైరెక్ట్ గా నామినేట్ అయ్యింది. అలా నామినేట్ అయిన మొదటి వారమే ఆమెను బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు.
పవర్ అస్త్రాను బయటకు తీసిన బిగ్ బాస్
డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతానికి రీతూకే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్ చేతుల్లో పవర్ అస్త్రాను పెట్టి ఏం చేయబోతున్నారు ? అన్నదానిపై రీతూ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ బిగ్ బాస్ ఆ పవర్ తో ఒకరిని ఎలిమినేట్ చేయమన్నా లేదా సేవ్ చేయమన్నా ఇమ్మాన్యుయేల్ రీతూనే సేవ్ చేసే అవకాశం కన్పిస్తోంది. ఈ ప్లాన్ తోనే బిగ్ బాస్ ఆ పవర్ అస్త్రాను బయటకు తీశాడా ? అన్పిస్తోంది. ఇమ్మూ 'అమ్మా' అంటూ ప్రేమగా పిలుచుకుంటున్న సంజన కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. కానీ ఆమె కోసం ఇదివరకే కెప్టెన్సీని త్యాగం చేశాడు. కాబట్టి ఈసారి ఛాన్స్ తీసుకోకపోవచ్చు. అదే గనుక జరిగితే సంజన ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఆమె నిన్ననే "బేబీ పుట్టిన కొన్ని నెలలకే ఇలాంటి ఫిజికల్ టాస్కులు ఆడలేను. ఇంటికి పంపించేయండి" అంటూ ఏడ్చిన సంగతి తెలిసిందే. లేదా అందరికంటే తక్కువ బాండింగ్ ఉన్న శ్రీజను ఇమ్మూ బయటకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి బిగ్ బాస్ ఫ్లోరాతో పాటు ఇంకెవరిపై ఎవిక్షన్ అనే ఆ బిగ్ బాంబు వేస్తాడో చూడాలి.





















