Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 32 రివ్యూ... దివ్య వల్ల చెల్లిని, పిల్లను పట్టించుకోని భరణి... టాస్కులలో దుమ్మురేపిన తనూజ - కళ్యాణ్... రీతూ బ్లండర్ మిస్టేక్
Bigg Boss 9 Telugu Today Episode - Day 32 Review : 32వ ఎపిసోడ్ లో నిరుత్సాహ పరిచిన తనూజ - కళ్యాణ్ టీం నేటి ఎపిసోడ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో లీడర్ బోర్డులో టాప్ లోకి వచ్చి, సర్ప్రైజ్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కష్టమైన టాస్కులతో హౌస్ మేట్స్ కు చుక్కలు చూపిస్తున్నారు బిగ్ బాస్. ఉన్న 10 మందిని 5 జంటలుగా విడగొట్టి, ఈ వారం పెర్ఫార్మెన్స్ తో మెప్పించకపోతే ఎలిమినేషన్ తప్పదు, అలాగే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఫైర్ స్టార్మ్ రాబోతోందని బిగ్ బాస్ హెచ్చరించారు. దీంతో కంటెస్టెంట్స్ ప్రాణాలు పెట్టి పోరాడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన టాస్క్ లలో తనూజ - కళ్యాణ్, శ్రీజ సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నారు.
నిన్నటి వరస్ట్ ప్లేయరే నేటి బెస్ట్ ప్లేయర్
"టాస్కులు ఆడి అలసిపోయిన కంటెస్టెంట్స్ ఫుల్ ఎంటర్టెన్ చేస్తూ, ఎంజాయ్ చేయండి" అంటూ 'నాచోర్ నాచోరే' అనే టాస్కును ఇచ్చారు. సాంగ్ ఆగిపోగానే బిగ్ బాస్ చెప్పిన రంగు హోల్ నుంచి బయటకు రావాలి. ఇందులో ముందుగా కళ్యాణ్ టీం విన్ అయ్యింది. ఆ టైమ్ లో సంచాలక్ లు పాజ్ చెప్పడం వల్లే ఆగాము, ఆ గ్యాప్ లో కళ్యాణ్ ఆగకుండా వెళ్లిపోయాడని శ్రీజ, డెమోన్, రీతూ సంచాలకులతో గొడవ వేసుకున్నారు. రెండవ ప్లేస్ లో దివ్య, మూడవ స్థానంలో డెమోన్, నాలుగవ స్థానంలో సుమన్ శెట్టి నిలవగా, చివరి స్థానంలో సంజన టీం ఉంది. దీంతో బిగ్ బాస్ సంజన టీంకి పాయింట్స్ ఇవ్వలేదు.
సంజన - ఫ్లోరా టీం బలి
ఈ టాస్క్ లో ఆడిన తర్వాత భరణి - దివ్య టీంకి 280, డెమోన్ - రీతు టీంకి 250, కళ్యాణ్ - తనూజ టీంకి 210, సంజన- ఫ్లోరా టీంకి 180, సుమన్ శెట్టి - శ్రీజ దమ్ము టీంకి 130 పాయింట్లు వచ్చాయి. ఈ సందర్భంగా లీస్ట్ లో ఉన్న రెండు టీమ్స్ లో ఓ జంటను ఈ రేసు నుంచి తొలగించామని చెప్పి మొదటి స్థానంలో ఉన్న భరణి టీంకు స్పెషల్ పవర్ ను ఇచ్చారు బిగ్ బాస్. దివ్య - భరణి డిస్కస్ చేసుకుని సంజన టీంను తొలగించారు. సుమన్ బలవ్వకూడదు అని భరణి ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెండు టీంలుగా చీలిన హౌస్
దీంతో సంజన "ఇంత కష్టపడ్డాము. అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాడు. ఇక్కడ ఎవరు మనవాళ్ళో కాదో, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు. కర్మ తప్పదు. మేము గివ్ అప్ ఇవ్వము. మళ్ళీ ట్రై చేస్తాము" అంటూ ఘాటుగా సమాధానం.చెప్పింది. ఆ బాధతో "ఈ ఫిజికల్ టాస్క్ లు ఆడలేను. ఇంటికి వెళ్లిపోతాను" అంటూ కుళాయి తిప్పేసింది. అంతేకాదు ఎప్పటిలాగే "దివ్య అతన్ని బుట్టలో వేసుకుంది. ఆమె వచ్చాక చెల్లిని, కూతురిని కూడా తొక్కి చూడట్లేదు" అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. అలాగే తనూజ కూడా భరణి - దివ్యలపై మండిపడింది. దీంతో భరణి - దివ్య- రీతూ - డెమోన్ - సుమన్ ఓ టీం, మిగతా వాళ్ళు మరో టీం... ఇలా రెండుగా చీలింది హౌస్.
పిరమిడ్ కట్టు పాయింట్స్ పట్టు
ఈ టాస్క్ లో కదిలే ప్లాట్ ఫామ్ పై 6 లేయర్లుగా పిరమిడ్ ను నిర్మించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో కూడా కళ్యాణ్ - తనూజ విన్ అయ్యి దుమ్మురేపారు. తర్వాత భరణి, శ్రీజ టీమ్స్ విన్ అయ్యాయి. డెమోన్ టీమ్ ఓడిపోయారు. ఫస్ట్ రావాలనుకుని రీతూ చేసిన పొరపాటుతో బొక్కబోర్లా పడ్డారు. ఈ టాస్క్ ఆడాక భరణి 340, తనూజ 310, డెమోన్ 270, సుమన్ శెట్టి 190 పాయింట్లతో లీడర్ బోర్డులో ఉన్నారు. ఇంతటితో టాస్కులు అన్నీ ముగిశాయి. బోర్డులో టాప్ లో ఉన్న భరణి - దివ్య డేంజర్ జోన్ నుంచి బయటపడినట్టు బిగ్ బాస్ వెల్లడించారు. ఇక రెండవ స్థానంలో ఉన్న కళ్యాణ్ - తనూజలలో ఒకరు మాత్రం సేవ్ అయ్యే అవకాశాన్ని ఇచ్చారు. కళ్యాణ్ కే ఆ ఛాన్స్ ఇచ్చేసింది తనూజ. మిగిలిన వాళ్ళంతా డేంజర్ జోన్ లోనే ఉన్నారు.





















