Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌లో ఈసారి డబుల్ ఎలిమినేషన్... డేంజర్ జోన్‌లో ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్... వాళ్ళను రీప్లేస్ చేసే వైల్డ్ కార్డ్స్ వీళ్లేనా?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ వారం డబుల్ ఎలిమినేషన్, వైల్డ్ కార్డు ఎంట్రీల ట్విస్ట్ కూడా ఉండబోతోంది. స్వయంగా ఈ విషయాన్ని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. మరి డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు ?

బిగ్ బాస్ సీజన్ 9లో ఈవారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉండగా, అందులో రామూ రాథోడ్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఇమ్మాన్యుయేల్ ఇమ్యూనిటీని గెలుచుకున్నారు. దీంతో మిగిలిన వారంతా 5వ వారం నామినేషన్లలో ఉన్నారు. మరోవైపు బిగ్ బాస్ ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని, సరిగ్గా గేమ్ ఆడనివారిని వాళ్ళు రీప్లేస్ చేస్తారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్
ఓటింగ్ పరంగా మొదటి ప్లేస్ లో తనూజ, రెండవ స్థానంలో కళ్యాణ్ పదాల, మూడవ ప్లేస్ లో సుమన్ శెట్టి, 4వ స్థానంలో దమ్ము శ్రీజ, 5వ స్థానంలో సంజన, 6వ స్థానంలో భరణి, 7వ స్థానంలో డెమోన్, 8వ స్థానంలో రీతూ, 9వ స్థానంలో దివ్య, 10వ ప్లేస్ లో ఫ్లోరా ఉన్నారు. అంటే ప్రస్తుతానికి లీస్ట్ లో ఉన్నది రీతూ, దివ్య, ఫ్లోరా ఉన్నారన్నమాట. ఖచ్చితంగా ఈ ముగ్గురిలో ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రీతూ చౌదరి, దివ్య నిఖితలలో ఎవరో ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఓటింగ్ కు ఇంకా వీకెండ్ వరకు టైమ్ ఉంది. కాబట్టి ఈ లెక్కలు మారే ఛాన్స్ ఉంది. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో హౌస్ నుంచి బయటకు వెళ్లేది ఎవరు అనేది చూడాలి.
ఆ ఫైర్ స్టార్మ్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
బిగ్ బాస్ 9లో సెకండ్ రౌండ్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా ఏడుగురు రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ లో రమ్య పికిల్స్, ప్రభాస్ శ్రీను, దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్,అఖిల్ రాజ్ ఉన్నారు. మరో లేడి కంటెస్టెంట్ తో పాటు పాపులర్ సీరియల్ నటి సుహాసిని కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే అందరినీ ఒకేసారి హౌస్ లోకి పంపిస్తారా? లేదంటే ఇన్స్టాల్మెంట్ రూపంలో పంపుతారా? అనే అనుమానాలు రేకెత్తాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, ఆ ఇద్దరి ప్లేస్ లోకి ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీలు అడుగు పెడతారని తెలుస్తోంది. ఆ ఇద్దరు మరెవరో కాదు పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి అనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
కానీ మరోవైపు బిగ్ బాస్ ప్రస్తుతం హౌస్ లో ఉన్న టెనెంట్స్ - ఓనర్స్ ను కలిపేశారు. పైగా టెనెంట్స్ రూమ్ ను లాక్ చేశారు. అందులో బెడ్స్ తీసేసి ఓన్లీ పరుపులు మాత్రమే వేశారు. దీన్ని బట్టి చూస్తే వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు అందరూ ఒకేసారి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కన్పిస్తోంది. అసలు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటనేది ముందు ముందు ఎపిసోడ్లలో తేలనుంది.





















