Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 30 రివ్యూ... రీతూ - పవన్ తప్పు, మిగతా వాళ్ళకు గుణపాఠం... కంటెస్టెంట్స్‌కు వైల్డ్ కార్డ్స్ డేంజర్... హిస్టరీలో వరస్ట్ గేమ్
Bigg Boss 9 Telugu Today Episode - Day 30 Review: ఈ వారం హౌస్ మేట్స్ అందరినీ నామినేట్ చేసిన బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో ఫౌల్ గేమ్ అంటూ ప్లేయర్స్ అందరిపై గుస్సా అయ్యారు. అందరికీ గుణపాఠం నేర్పారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలై అప్పుడే నెల రోజులు పూర్తవుతుంది. 5వ వారం నామినేషన్లలో ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ రామూ రాథోడ్ తప్ప అందరూ ఉన్నారు. తాజాగా 30వ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నేటి ఎపిసోడ్ ఫుల్ ఫన్ తో పాటు ఎమోషనల్, ఫైర్ తో కొనసాగింది. 7 ఎగ్స్ తిన్నందుకు పనిష్మెంట్ గా టెనెంట్ గా మారిన సంజన అంట్లు తోముతూ బాధ పడింది. ఓనర్స్ అందరూ కలిసి సంజనను ఓ ఆట ఆడుకున్నారు.
వరుస పెట్టి కుళాయిలు తిప్పేసిన కంటెస్టెంట్స్
మీరందరూ తినిపిస్తుంటే "మా అమ్మ, బిడ్డ గుర్తొస్తుంది" అంటూ కన్నీరు పెట్టుకుంది. మరోవైపు సుమన్ శెట్టి కూడా ఇంట్లో వాళ్లను తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. తర్వాత తనూజ, శ్రీజ... ఇలా కంటెస్టెంట్స్ వరుస పెట్టి ఏడ్చారు. దీంతో ఈ మూడ్ మారడానికి "హౌస్ నుంచి బయటకు వెళ్ళాక ఫస్ట్ ఎవరిని కలుస్తారు?" అనే ప్రశ్నతో కాసేపు ఫన్ చేశారు. తనూజ భరణిని ఒక స్పెషల్ పర్సన్ తో కలుస్తానని చెప్పింది. సుమన్ శెట్టి... ఫ్లోరా పేరు చెప్పగా, ఫ్లోరా మాత్రం సంజన, సుమన్, శ్రేష్ఠి పేర్లు, ఇమ్మాన్యుయేల్ సంజనను కలుస్తానని, రామూ అందరినీ, భరణి మాత్రం దివ్య, తనూజ ఇద్దరినీ కలుస్తానని చెప్పాడు. కాసేపటికే టాస్క్ మొదలైంది.
వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టార్మ్ వచ్చేస్తోంది
టాస్క్ మొదలు పెట్టేముందు బిగ్ బాస్ బిగ్ బాంబు వేశారు. "కెప్టెన్, ఇమ్మాన్యుయేల్ తప్ప మిగిలిన వారందరూ డేంజర్ లో ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టార్మ్ మిమ్మల్ని కుదిపేస్తోంది. వాళ్ళు మీ స్థానాలను సొంతం చేసుకుంటారు. ఈ వారం ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్లు ఇప్పటి నుంచి ఇచ్చే టాస్క్ లలో ఆడి, మంచి పాయింట్స్ తెచ్చుకుంటేనే హౌస్ లో కొనసాగుతారు" అని చెప్పారు బిగ్ బాస్. అలాగే టెనెంట్స్, ఓనర్స్ అనే తేడా లేకుండా ఇద్దరిద్దరుగా జంటలుగా విడిపోమన్నారు. రీతూ - డెమోన్, భరణి -దివ్య, సంజన - ఫ్లోరా, సుమన్ శెట్టి - శ్రీజ, తనూజ - కళ్యాణ్ లు జంటలుగా విడిపోయారు.
ఇందులో ముందుగా "పట్టువదలకు" అనే టాస్క్ ఇచ్చారు. ఇసుకను నింపే ఈ టాస్క్ లో మొదటి స్థానం సాధించిన జంటకు 100, సెకండ్ ప్లేస్ జంటకు 80, థర్డ్ జంటకు 60... ఇలా పాయింట్స్ లభిస్తాయని చెప్పారు. ఇందులో ఫస్ట్ ప్లేస్ లో డెమోన్, సెకండ్ భరణి, మూడవ ప్లేస్ లో కళ్యాణ్, నాలుగవ ప్లేస్ లో సంజన, ఐదవ ప్లేస్ లో సుమన్ నిలిచారు. ఈ విషయంలో తనూజ, ఇమ్మాన్యుయేల్, శ్రీజ, భరణి మధ్య వివాదం నెలకొంది. తర్వాత కాసేపు ర్యాంకుల గురించి ఫన్ జరగ్గా... తర్వాత ఒకొక్కరు మరో జంట స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నారు.
బిగ్ బాస్ ఆగ్రహం... ఆందోళనలో కంటెస్టెంట్స్
"సెకండ్ టాస్క్ లో బెలూన్లు ఊది, బాక్స్ లో వేయాలి. ఆ బాక్స్ లో నీడిల్ మాస్క్ పెట్టుకుని ఉన్న టీమ్ మేట్స్ ఊదుతూ, 5 నిమిషాలు బెలూన్ ను పగలకుండా, బయట పడకుండా చూడాలి. ఒకవేళ బెలూన్ పగిలితే ఒక లైఫ్ పోతుంది" అని చెప్పారు బిగ్ బాస్. దీనికి కూడా ఇమ్మాన్యుయేల్, రామూ.రాథోడ్ సంచాలక్ గా వ్యవహరించారు. ఈ టాస్క్ లో అందరూ ఫౌల్ గేమ్ ఆడారు. ఒక్క సంజన ఫ్లోరా తప్ప. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "మీకు గుణపాఠం నేర్పడానికి ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ల పాయింట్స్ సగానికి పైగా తగ్గిస్తున్నా" అంటూ ఏకంగా టాస్క్ నే రద్దు చేశారు. దీంతో "గెలిచినా ఓడిపోయాను" అంటూ సంజన కుళాయి తిప్పేసింది.





















