Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 28 రివ్యూ... హౌస్‌లో దారుణాలు, ప్రూఫ్‌తో బయటపెట్టిన నాగ్... అబ్బాయిలకు ఐస్ పెట్టిన అమ్మాయిలు... అల్లుడికి బ్లాక్ మాస్క్ ఇచ్చిన హరిత హరీష్
Bigg Boss 9 Telugu Today Episode - Day 28 Review : సండే ఫన్ అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఈరోజు కాస్త డిఫరెంట్ గానే ఎంటర్టైన్ చేశారు. సేఫ్ గేమర్స్ నుంచి ఎలిమినేషన్ దాకా ఈరోజు ఏం జరిగిందంటే ?

బిగ్ బాస్ 9 తెలుగు డే 28 ఎపిసోడ్ 29ను నాగార్జున ఎలిమినేషన్ టెన్షన్ తో మొదలు పెట్టారు. "మన డెస్టినీ రాసి పెట్టే ఉందని అంటారు. మీలో ఎవరు సేఫ్, ఎవరు కాదనే విషయాన్ని మీ చేతిరాత డిసైడ్ చేస్తుంది" అంటూ నామినేషన్ లో ఉన్న దివ్య నికిత, హరీష్, శ్రీజ, రీతూ, ఫ్లోరా, సంజనకు బోర్డు, డస్టర్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఫ్లోరా, సంజన సేఫ్ అయ్యారు.
రామూ, సుమన్ శెట్టి సేఫ్ గేమ్ కు ఎండ్ కార్డ్
"ఎవ్వరూ అప్సెట్ కావొద్దని సేఫ్ గేమ్ ఆడుతున్నారు. హౌస్ లో ఉన్న నలుగురి నెగెటివ్స్ చెప్పు" అంటూ నాగార్జున రాముని ఇరుకున పెట్టారు. ముందుగా "శ్రీజ సాగదీస్తుంది, జడ్జ్ చేస్తుంది" అంటూ చెప్పాడు రామూ. దీంతో సంజనకు అసిస్టెంట్ గా ఉండొద్దు అంటూ శ్రీజ హితబోధ చేస్తున్న వీడియోను నాగార్జున రివీల్ చేశారు. "ఇందులో శ్రీజ తప్పు చేసిందా లేదా" అని అడిగారు. "కరెక్ట్ చేసిందని" చెప్పాడు రామూ. తర్వాత "సంజన చేసిన ఎగ్ దొంగతనం హర్ట్ చేసింది, ఏదైనా చెప్పినా అర్థం చేసుకోదు, మాటలు వదిలేస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు రామూ. వీడియోను ప్లే చేసి, సంజన అన్న కామెంట్స్ ను అపార్థం చేసుకున్నావు అని క్లారిటీ ఇచ్చారు నాగ్. "ఫ్లోరా మంచిదే. కానీ ఎవరైనా తప్పు చేశారు అని తెలిసినా వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంది. హరీష్ అవతలి వ్యక్తి మాట్లాడేది రిసీవ్ చేసుకోరు" అని చెప్పాడు. నెక్స్ట్ "భరణి ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదని, రీతూకి అన్నయ్య కంటే ఫ్రెండ్ ఎక్కువయ్యాడని, కళ్యాణ్ లాస్ట్ వీక్ కంటే బెటర్, కళ్యాణ్ అంటే భయం వేస్తోంది, ఊరికే ఎమోషనల్ అవుతుంది. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తుంది తనూజల గురించి చెప్పాడు సుమన్ శెట్టి.
కళ్యాణ్ వర్సెస్ డెమోన్... బుద్ధిబలం ఏది?
"స్ట్రాటజీ లేకపోవడం వల్ల ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సక్సెస్ కాలేకపోతున్నారు" అంటూ రీతూ, సంజనకు షీల్డ్ టాస్క్ పెట్టారు నాగ్. ఇందులో రీతూ విన్ అయ్యింది. "ఎంటర్టైన్మెంట్ తక్కువైంది. మీకు అలవాటు అవ్వడానికి ఈ టాస్క్. హౌస్ లో ఉన్న వాళ్లను ఇమిటేట్ చేయాలి" అని దివ్య, శ్రీజలకు చెప్పారు నాగ్. శ్రీజ సుమన్ శెట్టిని, డెమోన్ ను ఇమిటేట్ చేసింది. తర్వాత రీతూ - డెమోన్, భరణిలను దివ్య ఇమిటేట్ చేసింది.
Also Read: బిగ్‌బాస్ డే 27 రివ్యూ... వైల్డ్‌గా వీకెండ్ ఎపిసోడ్... గుడ్డు దొంగ పరువు పాయే... లాస్ట్ మినిట్ సర్ఫ్రైజింగ్ ట్విస్ట్... చుక్కలు చూపించిన నాగ్
భరణి, తనూజల్లో ఒకరికి సంబంధించిన ఫేవరెట్ వస్తువులు మరొకరు తెచ్చి డిస్ట్రాయ్ చేయాలని సూచించారు నాగ్. వెంటనే భరణి సుత్తి తీసుకుని... తనూజ మాయిశ్చరైజర్, పెర్ఫ్యూమ్, లిప్స్టిక్ ను పగలగొట్టాడు. ఇక భరణికి సంబంధించిన వస్తువుల్లో విటమిన్ టాబ్లెట్స్, క్రీమ్, ఇయర్ బడ్స్ ను పారేసింది. పోపు విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు. కానీ నాగ్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం "ఇమ్మాన్యుయేల్ నడుము గిల్లింది ఎవరూ?" అంటూ నాగ్ ఫుల్ ఫన్ మోడ్ లోకి వెళ్ళారు. తనూజ అది చేసింది తానేనని ఒప్పుకుంది. ఆట బాగా ఆడుతున్నారు కానీ బుర్ర వాడట్లేదు అంటూ 3 రౌండ్స్ డెమోన్ - కళ్యాణ్ లకు టాస్క్ లు ఇచ్చారు నాగ్. కానీ ఇద్దరూ 2 సింపుల్ టాస్క్ లు ఓడిపోయారు. చివరగా మేజ్ రన్ టాస్క్ లో మాత్రం డెమోన్ గెలిచాడు.
కళ్యాణ్ కష్టం వృథా
చివరగా లగ్జరీ ఫుడ్ ఐటమ్స్ గెలుచుకుని అబ్బాయిలు అమ్మాయిలకు గిఫ్ట్ ఇస్తారు అంటూ "ఐస్ ఫర్ ఐస్" అనే టాస్క్ పెట్టారు నాగ్. ఇందులో ఓడిపోయిన భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ లకి డ్రెస్ లో ఐస్ వేశారు అమ్మాయిలు. కళ్యాణ్ విన్ అయ్యి కాఫీ గిఫ్ట్ గా ఇచ్చాడు. కానీ ఆమె సంజన కోసం త్యాగం చేయడంతో వర్కవుట్ కాలేదు. డెమోన్ విన్ అయ్యి చికెన్ ను శ్రీజకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్ విన్ అయ్యి రీతూకి పెరుగును గిఫ్ట్ గా ఇచ్చాడు. గెలిచిన టెనెంట్ కోసం ఓడిపోయిన ఓనర్స్ పన్నీర్, దోశ బ్యాటర్, చాక్లెట్స్ ను ఇచ్చారు.
చివరగా హరీష్ అండ్ దివ్య మిగలగా, హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన హరీష్ తన జర్నీని చూసుకుని 'థ్యాంక్స్' తప్ప ఇంకేమి చెప్పలేదు. హౌస్ లో ఉన్నవాళ్లలో "అందరినీ మన్యుపులేట్ చేస్తున్నాడు" అంటూ భరణినీ, "నాకూ ఆయనకు తేడా వచ్చినప్పుడు ట్రూ వెర్షన్ బయటకు వచ్చింది. కానీ హౌస్ లో మిగతా వాళ్ళతో కలిసి మెలిసి పోదామన్నట్టు ఉంటాడు ఇమ్మాన్యుయేల్, డెమోన్ బయట ఎలా ఉన్నాడో ఇక్కడ అలాగే ఉన్నాడు" అంటూ బ్లాక్ మాస్క్ ఇచ్చాడు. శ్రీజ, కళ్యాణ్, తనూజలకు వైట్ మాస్క్ ఇచ్చాడు. చివరగా ఒక్కరోజు తనూజ 3 కాఫీలు తాగే ఛాన్స్ ఇచ్చారు నాగ్.
Also Read: బిగ్‌బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్... మాస్క్ మ్యాన్ ఔట్... ఆయన సంపాదన ఎంతో తెలుసా?





















