Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 27 రివ్యూ... వైల్డ్‌గా వీకెండ్ ఎపిసోడ్... గుడ్డు దొంగ పరువు పాయే... లాస్ట్ మినిట్ సర్ఫ్రైజింగ్ ట్విస్ట్... చుక్కలు చూపించిన నాగ్
Bigg Boss 9 Telugu Today Episode - Day 27 Review : 4వ వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ ఒక్కొక్కరికీ స్టార్స్ ఇచ్చి మరీ వాళ్ళ ఆటతీరును కడిగిపారేశారు. నేటి ఎపిసోడ్ విశేషాలు ఇవే.

బిగ్ బాస్ లో స్టార్టింగ్ వీక్ మొదలైన ఎగ్ గొడవ ఇంకా కంటిన్యూ అవుతోంది. సంజన చిలిపితనం అంటూ చేస్తున్న దొంగతనాలు చిరాకు పెడుతున్నాయి. రీసెంట్ గా ఆమె ఏకంగా 8 ఎగ్స్ తిని హౌస్ లో గందరగోళం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త కెప్టెన్ రామూ సీరియస్ పనిష్మెంట్ ఉంటుందని వార్నింగ్ ఇవ్వడంతో తనంతట తానుగా ఒప్పుకుంది సంజన. తరువాత బిర్యానీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీనికి హరీష్ సంచాలక్ గా వ్యవహరించారు. పవన్ టీమ్, ఇమ్మాన్యుయేల్ టీం ఇందులో పాల్గొనగా, చివరికి డెమోన్ టీం విన్ అయ్యింది. బిర్యానీ విషయంలో కూడా పెద్ద రాద్ధాంతమే చేశారు. డామినేట్ చేశారంటూ సంజన అలిగి, బిర్యానీ తినలేదు. దీంతో సంజన, భరణి మధ్య రచ్చ జరిగింది. "కళ్ళతోనే భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. నేను భయపడను అంటే సిగ్గులేదా? అంటూ పెద్ద మాటలు మాట్లాడాడు" అంటూ సంజన బోరున ఏడ్చేసింది. నెక్స్ట్ బాత్రూంలో హరీష్ - ఫ్లోరా మధ్య మరో గొడవ జరిగింది.
చుక్కలు చూపించిన నాగార్జున
కెప్టెన్ ను అభినందిస్తూ ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు నాగ్. ముందుగా హౌస్ లో ఏం జరిగినా అక్కడే కూర్చుంటారు అంటూ హరీష్ పై కౌంటర్ వేశారు. నెక్స్ట్ స్టార్స్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. 4 వీక్స్ నుంచి అదరగొట్టిన వాళ్లకు గోల్డెన్ స్టార్, నో ఇంపాక్ట్ అనే ప్లేయర్స్ కు బ్లాక్ స్టార్, ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న ప్లేయర్స్ కు సిల్వర్ స్టార్ ఇవ్వాలని నాగార్జున చెప్పారు. ఉన్న ఒకే ఒక్క గోల్డెన్ స్టార్ ను ఇమ్మాన్యుయేల్ కి ఇచ్చారు. అయితే కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని నాగ్ క్లియర్ చేశారు. ఇదంతా శ్రీజ తప్పేనని సిల్వర్ స్టార్ ను ఇచ్చి తేల్చేశారు. "హనుమంతుడికి తన శక్తి తెలియదన్నట్టు నీ శక్తి నీకు తెలియట్లేదు" అంటూ సుమన్ శెట్టికి సిల్వర్, "బంధాల వల్ల వీక్ అవుతున్నావు", ఫుడ్ మానిటర్ మార్పు విషయాలను గుర్తు చేస్తూ తనూజకు సిల్వర్ ఇచ్చారు. అలాగే పోపు గొడవలో తనూజాదే తప్పని కుండబద్ధలు కొట్టారు. రాంగ్ పర్సన్ కు ఫుడ్ మానిటర్ ఇచ్చారంటూ డెమోన్ కు కౌంటర్ ఇచ్చారు.
ఇక "స్ట్రాటజీ మిస్ అవుతోంది" అంటూ రీతూకి, దివ్యకి, డెమోన్ పవన్ కి, "నువ్వు వస్తుంటే అవతలి వారి గుండెల్లో దడదడ" అంటూ రామూకి సిల్వర్ స్టార్ ఇచ్చారు. అలాగే సంజనను టెనెంట్ గా మార్చి, "ఎక్కడి నుంచి వచ్చావో చూపించు" అంటూ రామూతో సంజనకు పనిష్మెంట్ ఇప్పించారు. "ఇది కదా కళ్యాణ్ అనే ఫీలింగ్ ఈ వారం ఇచ్చావు. జెన్యూన్ గా మోసపోయావు. కండబలంతో పాటు బుద్ధి బలం వాడు" అంటూ సిల్వర్ ఇచ్చారు. నెక్స్ట్ "భుజాలపై ఎక్కువ బాండింగ్ బరువు వేసుకుంటున్నావు. ఒరిజినల్ భరణి కావాలి" అంటూ భరణికి సిల్వర్ ఇచ్చారు.
చివరి నిమిషంలో సడన్ ట్విస్ట్
"షాడో" అవుతున్నావు అంటూ ఫ్లోరాకి, "వచ్చిన అపార్చునిటీని వాడుకోవట్లేదు. ఎక్స్పెక్టషన్స్ ను రీచ్ అవ్వలేదు" అంటూ హరీష్ కు బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. "నోటి దగ్గరున్న ఫుడ్ ను లాక్కుంటోంది, శాడిజం, సైకోయిజం" అంటూ సంజన మెడలో "దొంగలున్నారు జాగ్రత్త" అనే బోర్డును వేయించి, సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఇక బ్లాక్ స్టార్ వచ్చిన హరీష్ - ఫ్లోరాలలో ఇంట్లో అవసరం లేని వ్యక్తి ఎవరో చెప్పాలంటూ హౌస్ మేట్స్ చేతిలోనే డెసిషన్ ను పెట్టారు. అందరూ కలిసి ఫ్లోరా హౌస్ లో ఉండకూడదు అని తేల్చడంతో నెక్స్ట్ 2 వీక్స్ కి ఆమెని డైరెక్ట్ గా నామినేట్ చేశారు నాగ్.
Also Read: బిగ్‌బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్... మాస్క్ మ్యాన్ ఔట్... ఆయన సంపాదన ఎంతో తెలుసా?






















