Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 26 రివ్యూ... కెప్టెన్సీ టాస్క్‌లో కన్ఫ్యూజన్, కళ్యాణ్‌కు వెన్నుపోటు... హౌస్‌లోకి అనుకోని అతిథి... ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
Bigg Boss 9 Telugu Today Episode - Day 26 Review : కెప్టెన్సీ కంటెండర్ కోసం ఈ వారమంతా అలుపెరగకుండా పోరాడిన కళ్యాణ్ పడాల కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. నేటి ఎపిసోడ్ లో జరిగిన విశేషాలు ఏంటంటే ?

బిగ్ బాస్ సీజన్ 9 డే 26 ఎపిసోడ్ 27లో కళ్యాణ్ కు అన్యాయం జరగడమే కాకుండా, హౌస్ లోకి అనుకోని అతిథి రాక అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎపిసోడ్ మొదట్లోనే ప్రోటీన్ ను శ్రీజతో షేర్ చేసుకున్నాడని తనూజ భరణిపై అలిగింది. మళ్ళీ ఎగ్ రచ్చ కోసం మాస్టర్ ప్లాన్ వేసింది సంజన. హౌస్ మేట్స్ అందరి ఎగ్స్ సంజన ఒక్కత్తే సీక్రెట్ గా తినేసింది. మొత్తానికి హౌస్ లో అనుకున్నంత రచ్చ జరగలేదు. కానీ ఫుడ్ మానిటర్ గా ఉన్న సంజన 8 ఎగ్స్ తినేసిందని అందరికీ అర్థం అయ్యింది.
రెయిన్ టాస్క్ లో రచ్చ
కెప్టెన్సీ కంటెండర్ రేసులో ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, రాము, రీతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ఒకరు కంటెండర్ అవ్వాలంటే... బజర్ మోగగానే ఒక కంటెస్టెంట్ రెయిన్ డ్యాన్స్ చేస్తారు. కంటెండర్లు మాత్రం బ్లూ లైన్ లోకి బిగ్ బాస్ ఇచ్చిన ప్రాపర్టీని తీసుకెళ్లి పెట్టాలి. ఒకవేళ ఫెయిల్ అయితే, కంటెండర్లలో నుంచి ఒకరిని రేసులో నుంచి పక్కకు తప్పిస్తారు. దీనికి తనూజ సంచాలక్ గా వ్యవహరించింది.
మొదట్లోనే డెమాన్ పవన్ వెళ్లి, ఎప్పటిలాగే ఫేవరెటిజం చూపిస్తూ రీతూకు సపోర్ట్ గా కళ్యాణ్ ను టాస్క్ నుంచి తప్పించాడు. దీంతో ఈ వారం గట్టిగా కష్టపడిన కళ్యాణ్ బోరున విలపించాడు. శ్రీజ వచ్చి "ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు" అంటూ ఇమ్మాన్యుయేల్ ను అవుట్ చేసింది. చివరగా రామూ, రీతూ ఉండగా... వారిద్దరిలో రీతూని అవుట్ చేసి, రామూని కెప్టెన్ ను చేశాడు భరణి. అలా బిగ్ బాస్ 9లో 4వ కెప్టెన్ గా రామూ జెండా ఎగరేశాడు. కానీ కళ్యాణ్ కు మాత్రం తీరని అన్యాయం జరిగింది. టాస్క్ పూర్తయ్యాక తనూజ, శ్రీజ, డెమోన్, రీతూ అతన్ని సముదాయించడానికి చూశారు. కానీ రీతూ - డెమోన్ ఏదో చెప్పబోతే కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా "వాడిని బ్రదర్ అనుకున్నా, అన్నీ టాస్కులలో సపోర్ట్ చేశాను. రెండుసార్లు కెప్టెన్సీ టాస్కులలో ఫుల్ సపోర్ట్ ఇచ్చాను. అలాంటిది నన్ను తీసేయాలని మొదట్లోనే ఎలా అనుకుంటారు? " అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. అంతేకాదు రీతూ మోసం చేసిందని మండిపడ్డాడు. దీంతో రీతూ "అందరి ముందు నన్ను అలా ఎలా అంటావ్ ?" తిరిగి ప్రశ్నించింది.
హౌస్ లోకి "రాంబో ఇన్ లవ్" టీం
అంతలో హౌస్ లోకి అనుకోని ఒక అతిథిగా 'రాంబో ఇన్ లవ్' అనే సిరీస్ హీరో హీరోయిన్లు అడుగు పెట్టారు. సిరీస్ గురించి ముచ్చటించిన తరువాత, హౌస్ మేట్స్ కు టాస్క్ పెట్టారు. అందరికీ రెడ్ రోస్ ఇచ్చి, ఒక్కొక్కరూ తమ లవ్ స్టోరీ లేదా క్రష్ గురించి చెప్పాలని కోరారు. "3 ఇయర్స్ బాగా కెరీర్ లో బాగా కష్టపడ్డాను. ఒకరోజు ఇన్స్టా లో పేజ్ మొత్తం మెసేజ్ పెట్టింది పొగుడుతూ. ఆమె డాక్టర్ అని తెలిసింది. ఆమె ఎంబిబిఎస్ చదువుతున్న రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. ఫోటో కూడా చూడలేదు. అయినా ఇంట్లో చెప్పేశాను. ఊరికెలుతూ 4 గంటల జర్నీలోనే తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యా. ఎంత తిట్టినా, ఏం చేసినా నా కోసం కెరీర్ ను ఆపేసుకుంది. ఆమె కోసమే ఈ గేమ్ ఆడుతున్నా. కప్పు తీసుకెళ్లి దాని చేతిలో పెడతాను. హౌస్ లో ఇంతగా నవ్విస్తాను కానీ అప్పుడప్పుడు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను. ఐ లవ్ యూ" అంటూ ఎమోషనల్ అయ్యాడు. కానీ ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచాడు.
Also Read: బిగ్‌బాస్ డే 24 రివ్యూ... అన్యాయం జరిగిన చోటే కామన్ మ్యాన్ సత్తా... తనూజ ఫస్ట్ లవ్




















