'ఫ్యామిలీ మ్యాన్ 3' ని వెనక్కు నెట్టేసిన 'స్ట్రేంజర్ థింగ్స్ 5' ! డిసెంబర్ మొదటివారంలో OTT ప్లాట్‌ఫారమ్‌లలో టాప్ 5 సిరీస్ లు ఇవే!
Top 5 OTT Shows : OTTలో చాలా సిరీస్‌లు వచ్చాయి. వీక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో వ్యూయర్‌షిప్‌లో ఎవరు ముందున్నారో తెలుసుకుందాం.

భారతదేశంలో OTT పట్ల ప్రేక్షకుల ఆసక్తి బాగా పెరుగుతోంది. ఒకప్పుడు శుక్రవారం రాగానే థియేటర్లలో ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఆసక్తిగా చూసేవారు. ఇప్పుడు OTTలు నిత్యం అప్టేట్స్ ఇస్తూ మరింత ఆసక్తి క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. థియేటర్లలో కొత్త సినిమాల్లా... OTTలో కూడా రెగ్యులర్ గా అద్భుతమైన సిరీస్‌లు , షోలు విడుదలవుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి 7 వరకు OTT ప్లాట్‌ఫారమ్‌లలో తమ హవా చూపించిన టాప్ 5 సిరీస్‌ల గురించి తెలుసుకోండి. వీటిలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ని వెనక్కు నెట్టేసింది స్ట్రేంజర్ థింగ్స్ 5. మొదటి స్థానంలో ఉండాల్సిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రెండో స్థానానికి చేరుకోగా.. స్టేంజర్ థింగ్స్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. డిసెంబర్ మొదటివారంలో ఎక్కువ మంది OTT లవర్స్ ని మెప్పించిన సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ 5. ఇంకా టాప్ 5 లో ఏ ఏ సిరీస్ లు ఉన్నాయంటే....
OTTలో ఈ సిరీస్‌లకు అత్యధిక వీక్షణలు వచ్చాయి
1. స్ట్రేంజర్ థింగ్స్ 5
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది స్ట్రేంజర్ థింగ్స్ 5. ఈ యాక్షన్ ప్యాక్డ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది . ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం, గత వారంలో ఈ షోకి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
2. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ఈ స్పై సిరీస్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.. ఎట్టకేలకు కొత్త సీజన్ నాలుగు సంవత్సరాల తర్వాత విడుదలైంది. ప్రైమ్ వీడియోలో, ప్రేక్షకులు ఇతర సీజన్‌ల వలె కొత్త సీజన్‌ను కూడా ఇష్టపడ్డారు. ఆర్మాక్స్ మీడియా ప్రకారం, డిసెంబర్ 1 నుంచి 7 వరకు దీనిని 4.2 మిలియన్ల మంది వీక్షించారు.
3. ఔకాత్ కే బహర్
ఎల్విష్ యాదవ్ నటించిన ఈ సిరీస్ MX ప్లేయర్‌లో నవంబర్ 19 నుంచి ప్రసారం అవుతోంది. ఎల్విష్ యాదవ్ నటన అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. వీక్షణల పరంగా, ఎల్విష్ యాదవ్ నటించిన ఈ సిరీస్ మూడవ స్థానంలో నిలిచింది. ఆర్మాక్స్ మీడియా ప్రకారం, దీనికి 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
4. ఢిల్లీ క్రైమ్ సీజన్ 3
షెఫాలి షా నటించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. నవంబర్ 13న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది ఈసారి హుమా ఖురేషి కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎప్పటిలాగే, షెఫాలి షా వర్టికా చతుర్వేది పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆర్మాక్స్ మీడియా ప్రకారం, గత వారంలో ఈ సిరీస్‌కు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
5. మహాభారత్: ఏ ధర్మయుద్ధం
ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్న ఈ సిరీస్‌లో ఏ నటుడూ లేడు. అక్టోబర్ 25 నుంచి మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి మేకర్స్ దీన్ని రూపొందించారు . గత వారంలో ఆర్మాక్స్ మీడియా ప్రకారం దీనికి 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
రాజమౌళి 'వారణాసి' సినిమాలో మహేష్ పాత్రపై క్లారిటీ! ఈ పాటలోనే ఉందంతా!
రాజమౌళి విలన్ రహస్యం.. ముగ్గురు రాక్షసుల భయంకర రూపం! రణకుంభ పాట వెనుక అసలు అర్థం తెలిస్తే వణికిపోతారు?





















