Varanasi: రాజమౌళి విలన్ రహస్యం.. ముగ్గురు రాక్షసుల భయంకర రూపం! రణకుంభ పాట వెనుక అసలు అర్థం తెలిస్తే వణికిపోతారు?
Rana Kumbha Lyrics Meaning: ప్రళయం, అంధకారం, అగ్ని, సముద్ర గర్జన, యుద్ధభూమి..ఇలాంటి పదాలన్నీ రణ కుంభ సాంగ్ లో వినిపిస్తాయ్. ఈ పాటలో పదాలను పురాణాలకు లింక్ చేసి అర్థం తెలుసుకుంటే వణుకుపుడుతుంది

Rana Kumbha Song Lyric and Meaning: మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమార్ , ప్రియాంకచోప్రాతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీకి సంబంధించిన ప్రతి అప్టేట్ వెనుక పురాణాలకు సంబంధించిన లింక్ ఉంది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో..విలన్ పాత్ర అంతకు మించి అనిపిస్తుంది. ఈ మధ్య వారణాసి మూవీ నుంచి రణకుంభ అనే విలన్ ఇంట్రడక్షన్ సాంగ్ రిలీజ్ చేశారు. వినడానికే పవర్ ఫుల్ గా ఉన్న ఆ పాట అర్థం తెలిస్తే వణికిపోతారు.
ముగ్గురు ఘోర రాక్షసుల సమ్మిళితరూపమే కుంభ...ఇది భయంకరమైన రాక్షస స్తుతి..
రణ కుంభ పాట లిరిక్స్!
ప్రళయం ప్రళయం దుష్కృత వలయం
ప్రభలం ప్రచలం దుర్ధమ నిలయం
అసనిప్పాతహ జశ్రప్రకరం, తిమిర లోక సమవాకారం
గర్జించే పర్జన్యం, ఘోరాతి ఘోర దౌర్జన్యం
అనవతరం ఆతని వేట, ప్రమాదాలతొ సయ్యాట
భీభత్సం అతని ప్రతాపం, భీతావహ సమర పతాకం
ఆగ్నేయం ఆగ్రహ నేత్రం, అంగాంగం సంగర క్షేత్రం
అశురమ్ జలధ్ధీకరమ్, సకల జగన్నాశకం సంక్షోభం
ఇది కేవలం సాధారణ విలన్ థీమ్ సాంగ్ కాదు.. మహిషాసుర – అంధకాసుర – కుంభాసుర త్రయంతో... కొంతవరకు కాలకేయులతోనూ, రాక్షస సంహార పురాణ ఘట్టాలతోనూ లింక్ అయి ఉన్న భయానక రాక్షస స్తుతి.
ప్రళయం ప్రళయం దుష్కృత వలయం
ప్రళయ స్వరూపుడు, పాపాల చుట్టూ వలయం వేసేవాడు
మహిషాసురుడు దేవతలందర్నీ ఓడించి స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు త్రిమూర్తుల, దేవతల కోపాగ్ని నుంచి ఉద్భవించింది దుర్గాదేవి. ఇక్కడ విలన్‌ని “ప్రళయ స్వరూపుడు” అని చెప్పడం వెనుకున్న అర్థం...తను దేవతలకే ప్రళయం తెచ్చిన మహిషాసురుడిలాంటివాడని సూచన.
ప్రభలం ప్రచలం దుర్ధమ నిలయం
ప్రభలమైన (అజేయమైన), ప్రచలమైన (అపారమైన), దుర్ధర్షమైన (ఎవరూ ఎదిరించలేని) నివాసం కలవాడు అని అర్థం.
మహిషాసురుడు “మహిషపురి” అనే అజేయ నగరాన్ని కలిగి ఉండేవాడు. అంధకాసురుడు కూడా వరాల వల్ల దుర్ధర్షుడైపోయాడు.
అసనిప్పాతహ జశ్రప్రకరం, తిమిర లోక సమవాకారం
రైన్ ఆఫ్ థండర్ (పిడుగు పడే వర్షం)లా నిరంతరం గర్జించేవాడు, అంధకార లోకం సమాన ఆకారం కలవాడు.
“తిమిర లోకం” అంటే అంధకార లోకం అంటే శివుడి కోపాగ్ని నుంచి జన్మించిన అంధకాసురుడు నివసించే ప్రదేశం. అతడి గర్జన పిడుగులాంటిది అని పురాణాల్లో ఉంది
గర్జించే పర్జన్యం, ఘోరతి ఘోర దౌర్జన్యం
మేఘంలా గర్జించేవాడు, అత్యంత ఘోరమైన దుర్మార్గుడు అని అర్థం
మహిషాసురుడి సైన్యంలో అసిలోమ, బాష్కల, పర్జన్య అనే రాక్షసులుండేవారు... ఇక్కడ పర్జన్య మేఘ గర్జనతో పోల్చారు.
అనవతరం ఆతని వేట, ప్రమాదలతొ సయ్యాట
అతని వేట అనివార్యం, ప్రమాదాలతోనే ఆట ఆడతాడని దీని అర్థం
అంధకాసురుడు పార్వతీదేవిని బలవంతంగా అపహరించేందుకు ప్రయత్నం చేశాడు. అదే ఆ రాక్షసుడి అంతానికి కారణమైంది.
భీభత్సం అతని ప్రతాపం, భీతావహ సమర పతాకం
ప్రతాపమే భయంకరం, యుద్ధ జెండా భయానకం అని అర్థం
మహిషాసురుడి యుద్ధ ధ్వజంలో గర్జించే సింహం ఉండేది. కుంభాసురుడి ధ్వజంలో కుంభం (కుండ) ఉంటుందని పురాణ గాథల్లో ఉంది.
ఆగ్నేయం ఆగ్రహ నేత్రం, అంగాంగం సంగర క్షేత్రం
అగ్ని లాంటి కోపం నిండిన కన్ను, అంగాంగమంతా యుద్ధభూమి అని అర్థం
అంధకాసురుడు శివుడి త్రినేత్రం నుంచి పుట్టినవాడు కాబట్టి తన కన్నులు అగ్నిమయం. శివుడు భస్మం చేసినప్పుడు అతని శరీరమంతా రక్తసిక్తమై యుద్ధభూమిగా మారింది
అశురమ్ జలధ్ధీకరమ్, సకల జగన్నాశకం సంక్షోభం
రాక్షసుడు, సముద్రంలా గర్జించేవాడు అని అర్థం
కుంభాసురుడు & అంధకాసురుడు ఇద్దరూ సముద్రం నుంచి జన్మించినట్టు కథనాలు ఉన్నాయి. మహిషాసురుడు కూడా సముద్ర మంథన సమయంలో బలమైన వరాలు పొందాడని పురాణాల్లో ప్రస్తావన ఉంది.
పురాణ సారాంశం ప్రకారం..ఈ పాటలో విలన్ ఒక్కడు కాదు..ముగ్గురు ఘోరమైన రాక్షసుల సమ్మిళిత రూపం.
1. మహిషాసురుడు (అజేయ బలం, సింహధ్వజం, దేవతలపై ఆక్రమణ)
2. అంధకాసురుడు (చీకటి స్వరూపుడు, శివకోపోత్పన్నుడు, పార్వతీ అపహరణ)
3. కుంభాసురుడు (కుంభకర్ణుడి సోదరుడు కాకుండా, కొన్ని దక్షిణ భారత పురాణాల్లో కుంభాసురుడు అనే శివద్రోహి రాక్షసుడుంటాడు – శివుడు కైలాసంలోనే సంహరించాడు)
ఈ ముగ్గురి లక్షణాలను కలపి ఒక్క విలన్ పాత్రను డిజైన్ చేశారు రాజమౌళి. పరమేశ్వరుడు + ఆది పరాశక్తి ఇద్దరినీ ఎదుర్కొనే స్థాయి ఉన్న రాక్షసుడిలా చూపించారు. అందుకే పాటలో... ప్రళయం, అంధకారం, అగ్ని, సముద్ర గర్జన, యుద్ధభూమి...అన్నీ కలిపి లిరిక్స్ రాసుకొచ్చారు.
రాజమౌళి పురాణాలను ఎంత లోతుగా డీకోడ్ చేసి వారణాసి ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారో ఇవన్నీ నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది
గమనిక: పురాణ గ్రంధాల నుంచి సేకరించి రాసిన వివరాలు ఇవి. ఇందులో ప్రతి పదానికి వేర్వేరు అర్థాలు ఉండొచ్చు. కుంభ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పేందుకు అందించిన కథనం ఇది. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















