MG కార్లపై ఈ నెలలో భారీ ఆఫర్లు: ZS EV, Comet, Hector, Astor - మొత్తం MG లైనప్‌పై రికార్డు స్థాయి డిస్కౌంట్లు!
MG Motor India, డిసెంబర్ నెలలో, Glosterపై రూ 4 లక్షలు, ZS EVపై రూ 1.25 లక్షలు, Cometపై రూ 1 లక్ష వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో MG పూర్తి లైనప్‌కి వర్తించే ఆఫర్ల వివరాలు ఇవిగో.

MG Cars Year End 2025 Discounts: జనవరి నుంచి సాధారణంగా కార్ల ధరలు పెరగడం మార్కెట్లో కామన్‌గా జరిగే విషయం. అందుకే, చాలా బ్రాండ్లు సంవత్సరం చివరిలో/ డిసెంబర్‌లో భారీ ఆఫర్లు ప్రకటించి స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈసారి JSW–MG Motor India వినియోగదారులకు నిజంగానే సంతోషం కలిగించే స్థాయి వరకు ధరలు తగ్గించింది. ఇండియాలో అమ్మే MG మొత్తం లైనప్‌పై వర్తించే ఈ Midnight Carnival ఆఫర్లు, ఇప్పుడు కార్ కొనాలనుకునే వారి కోసం మంచి అవకాశంగా మారాయి.
MG Gloster – రూ 4 లక్షల భారీ డిస్కౌంట్
ప్రీమియం SUV విభాగంలో వినిపించే పేరు MG Gloster. ఈ పేరు చెప్తే చాలామందికి స్టైల్, సైజ్, ఫీచర్లు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇది Toyota Fortuner, Skoda Kodiaq వంటి మోడళ్లతో పోటీ పడుతోంది. డిసెంబర్‌లో Glosterపై మొత్తం రూ 4 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. Sharp, Savvy, Savvy 6-Seater వేరియంట్లన్నింటికీ ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
2.0 లీటర్ శక్తిమంతమైన డీజిల్ ఇంజిన్‌తో Gloster 4x2లో 161hp/374Nm, 4x4లో 216hp/479Nm పవర్ ఇస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రోడ్డు మీద దీని డ్రైవింగ్ కంఫర్ట్ అదిరిపోయేలా ఉంటుంది. ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరలు రూ 38.33 లక్షల నుంచి రూ 42.49 లక్షల వరకు ఉన్నాయి.
MG ZS EV – రూ 1.25 లక్షల వరకు ఆఫర్లు
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ZS EV మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి రూ 1.25 లక్షల వరకు డిస్కౌంట్లు ఉండడంతో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. 50.3kWh బ్యాటరీ, 177hp మోటార్, ARAI ప్రకారం 461km రేంజ్ - ఇవన్నీ ఈ EVని ప్రాక్టికల్ ఆప్షన్‌గా నిలబెట్టాయి.
ధరలు రూ 17.99 లక్షల నుంచి రూ 20.50 లక్షల వరకు ఉన్నాయి. దీనిలో... Executive, Excite Pro, Exclusive Plus, Essence వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
MG Comet – రూ 1 లక్ష వరకు ఆఫర్లు
అర్బన్ సిటీలో చిన్న, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ కావాలంటే చాలా మంది Comet ను ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు రూ 1 లక్ష వరకు ఆఫర్లు ఉండడంతో మరింత బడ్జెట్-ఫ్రెండ్లీగా మారింది. 17.3kWh బ్యాటరీ, 42hp మోటార్, ఒకసారి చార్జ్ చేస్తే 230km వరకు రేంజ్ వంటివన్నీ రోజువారీ ప్రయాణాలకు చక్కగా సరిపోతాయి. ధరలు రూ 7.50–10 లక్షల మధ్య ఉన్నాయి.
MG Hector / Hector Plus – రూ 90,000 వరకు ఆఫర్లు
Tata Harrier, Safari తో పోటీ పడే MG Hector ప్రస్తుతం రూ 90,000 వరకు లాభాలు అందిస్తోంది. Style నుంచి Savvy Pro వరకు మొత్తం ఆరు వేరియంట్లు ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (CVT లేదా మాన్యువల్) లేదా 2.0 లీటర్ డీజిల్ (మాన్యువల్) ఆప్షన్లు దీనిలో లభిస్తాయి. ధరలు రూ 14.00–21.34 లక్షల మధ్య ఉన్నాయి.
MG Windsor – రూ 50,000 వరకు ఆఫర్లు
MG Windsor EVపై ఈసారి రూ 50,000 వరకు డిస్కౌంట్లు అందుతున్నాయి. 38kWh (322km రేంజ్), 52.9kWh (449km రేంజ్) రెండు బ్యాటరీ ఆప్షన్లు దీనిలో ఉన్నాయి. ఇది Nexon EV, XUV400 తో పోటీలో ఉంటుంది.
MG Astor – రూ 50,000 ఆఫర్లు
Hyundai Creta, Maruti Victoriis తో పోటీ పడే Astor పై కూడా రూ 50,000 వరకు లాభాలు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 8-స్టెప్ CVT ఆప్షన్లు లభ్యం. ధరలు రూ 9.65–15.36 లక్షల మధ్య ఉన్నాయి.
డిసెంబర్‌లో MG Motor ప్రకటించిన ఈ ఆఫర్లు నిజంగా ఆకర్షణీయమైనవి. గ్లోస్టర్ వంటి ప్రీమియం SUV నుంచి కాంపాక్ట్ కామెట్ వరకు, ZS EV నుంచి హెక్టర్ వరకు... ప్రతి వేరియంట్‌లోను మంచి ప్రయోజనం కనిపిస్తోంది. కొత్త కార్ కొనాలనుకునే వారికి ఇది మంచి టైమ్.
నగరాన్ని బట్టి ఈ ఆఫర్లు కొంచెం మారవచ్చనని MG ఇప్పటికే చెప్పింది. అందుకే మీ సమీప డీలర్‌షిప్‌లో వివరాలు చెక్ చేసుకుంటే మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















