అన్వేషించండి

Volkswagen Golf GTI - మన రోడ్ల మీద నిజ జీవిత డ్రైవింగ్‌లో ఎలా ఉంది? ఇదిగో ఫుల్‌ రివ్యూ

Volkswagen Golf GTI నిజ జీవిత డ్రైవ్‌లో ఎలా పని చేస్తుందో తెలుసా? పనితీరు, కంఫర్ట్‌, ట్రాఫిక్‌, రోడ్‌ హ్యాండ్లింగ్‌... ఇవన్నీ ఈ వివరమైన రివ్యూలో మీ కోసం.

Volkswagen Golf GTI Review: భారతీయ కార్‌ ప్రేమికులు సంవత్సరాలుగా ఎదురు చూసిన హాట్‌ హ్యాచ్‌బ్యాక్‌ ఏదైనా ఉందంటే, అది Volkswagen Golf GTI. ట్రాక్‌పై దీని పనితీరు గురించి ఇప్పటికే చాలా విన్నాం. కానీ మన రోజువారీ రోడ్ల మీద – ట్రాఫిక్‌, స్పీడ్‌ బ్రేకర్లు, గుంతలు, అసమానమైన రోడ్లు – ఈ కారు ఎలా మేనేజ్‌ చేస్తుందో అనేది చాలామందికి తెలియని విషయం. అందుకే, వోక్స్‌వ్యాగన్‌ గోల్ఫ్ GTIని నిజ జీవితానికి దగ్గరలో ఉన్న మన రోడ్ల మీద ఆటో ఎక్స్‌పర్ట్‌లు పరీక్షించి చూశారు.

పనితీరు: రేస్‌ ట్రాక్‌ స్థాయి పవర్‌ మన రోడ్లపైనా!
గోల్ఫ్‌ GTIలో ఉన్న 2.0-లీటర్ TSI ఇంజిన్‌ 265hp శక్తిని, 370Nm టార్క్‌ను ఇస్తుంది. కేవలం 5.73 సెకన్లలో గంటకు 0-100km వేగాన్ని అందుకోవడం చిన్న విషయం కాదు. మినీ కూపర్‌ S కంటే వేగంగా ఉండడం దీని ప్రత్యేకత. క్వార్టర్ మైల్‌ టైమ్‌ 13.78 సెకన్లు రావడం గోల్ఫ్‌ GTI అసలైన దూకుడును చూపిస్తుంది.

రన్నింగ్‌లో కూడా ఇది అద్భుతమే - 20-80km/h స్ప్రింట్‌ను 3.3 సెకన్లు, 40-100km/h 3.78 సెకన్లలో పూర్తి చేస్తుంది. బ్రేకింగ్‌ పనితీరు కూడా విశ్వసనీయమే, 80km/h నుంచి కేవలం 26 మీటర్లలోనే నిలబడింది.

హ్యాండ్లింగ్‌ & కంఫర్ట్‌: స్పోర్ట్‌ DNA, కానీ మన రోడ్లకు సరిపోయే విధంగా
ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ కార్లలో సాధారణంగా కనిపించే అండర్‌స్టీర్‌ను e-diff బాగా నియంత్రిస్తుంది. కార్నర్‌లలో గ్రిప్పీ ఫీలింగ్‌ GTIని మరింత స్పోర్టీవ్‌గా మారుస్తుంది. స్పోర్ట్‌ మోడ్‌లో ఎగ్జాస్ట్‌ సౌండ్‌ (ఆడియో సిస్టమ్‌ ద్వారా వచ్చేదైనా) డ్రైవింగ్‌ థ్రిల్‌ను రెట్టింపు చేస్తుంది.

స్టీరింగ్‌ లైట్‌గా, షార్ప్‌గా ఉండటం వల్ల ట్రాఫిక్‌లోనూ సులభంగా నడిపించవచ్చు. హై స్పీడ్‌లో స్టీరింగ్‌ గ్రిప్‌ బాగుపడటంతో హ్యాండ్లింగ్‌ మీద నమ్మకం పెరుగుతుంది. బాడీ రోల్‌ (మలుపుల్లో కారు ఒకవైపు వంగిపోవడం) దాదాపు కనిపించనట్టే ఉంటుంది.

రోజువారీ డ్రైవ్‌లో ఎలా ఉంది?
గోల్ఫ్‌ GTI పొడవు 4.3 మీటర్లు ఉన్నా, హ్యాచ్‌బ్యాక్‌ కావడంతో చిన్నదిగా అనిపించడం ఒక పెద్ద అదనపు ప్రయోజనం. క్యాబిన్‌ నుంచి విజిబిలిటీ చక్కగా ఉండటంతో ఇరుకు గల్లీల్లో, రద్దీ రోడ్లలోనూ సులభంగా తీసుకెళ్లవచ్చు.

అయితే ఒక చిన్న మైనస్‌ - క్రీప్‌ ఫంక్షన్‌ కొంచెం ఎక్కువగా పని చేస్తుంది. అలాగే యాక్సిలేటర్‌ షార్ప్‌గా స్పందించడం మొదట కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. కానీ అలవాటు పడిపోయిన తర్వాత ఇది కూడా ట్రాఫిక్‌లో ఓ బూస్ట్‌ లాగానే అనిపిస్తుంది.

మన రోడ్లపై గ్రౌండ్‌ క్లియరెన్స్‌ సరిపోతుందా?
136mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉన్నప్పటికీ, పెద్ద స్పీడ్‌ బ్రేకర్ల దగ్గర జాగ్రత్తగా తీసుకుంటే స్క్రాపింగ్‌ సమస్య ఉండదు. పెద్ద సైజ్‌లో ఉన్న స్పీడ్‌ బ్రేకర్లను కూడా గోల్ఫ్‌ GTI బాగానే క్లియర్‌ చేసింది. తక్కువ స్పీడ్‌లో డ్రైవ్‌ కొంచెం సస్పెన్షన్‌ కొంచం పట్టుకుపోయినట్లు అనిపించినా, స్పీడ్‌ పెరిగిన తర్వాత సాఫ్ట్‌గా మారుతుంది. ముంబైలోని గతుకుల రోడ్లపై కూడా ఆశ్చర్యపరిచే రైడ్‌ క్వాలిటీ అందించింది.

ఇంటీరియర్‌ & స్పేస్‌: చిన్న కారు, పెద్ద యుటిలిటీ
క్యాబిన్‌లో స్టోరేజ్‌ స్పేస్‌ చాలా ఉంది - పెద్ద బాటిళ్లకు డోర్‌ పాకెట్లు, రెండు మొబైల్‌ ట్రేలు, కప్‌ హోల్డర్లు, ఆర్మ్‌రెస్ట్‌ లోపల స్టోరేజ్‌. స్పోర్టీ టార్టన్‌ సీట్లు, ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌, మెటల్‌ పెడల్స్‌ స్పోర్ట్‌ ఫీలింగ్‌ను పెంచుతాయి. రియర్‌ సీట్‌ స్పేస్‌ కూడా కంపాక్ట్‌ SUV స్థాయిలోనే ఉంది. ఇద్దరికి ఇది చాలానే కంఫర్ట్‌ ఇస్తుంది. 380 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఒక చిన్న ఫ్యామిలీకి వీకెండ్‌ ట్రిప్‌ కోసం సరిపోతుంది.

ఫీచర్లు & సేఫ్టీ
12.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ క్లస్టర్‌, మ్యాట్రిక్స్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, హీట్‌డ్‌ సీట్లు, 3-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే.. విదేశాల్లో లభించే DCC, పవర్‌ సీట్‌లు, వెంట్‌లేటెడ్‌ సీట్‌లు భారత్‌లో ఇవ్వలేదు.

7 ఎయిర్‌బ్యాగ్స్‌, లేన్‌ కీప్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ వంటి ADAS సేఫ్టీ టెక్‌ కూడా ఉంది.

ధర
రూ.50 లక్షలకు పైగా ఎక్స్‌-షోరూమ్‌ ధర ఉండటం వల్ల ఇది ప్రీమియం హాట్‌ హ్యాచ్‌. కానీ, డబ్బు గురించి ఆలోచించకుండా మంచి ఫీల్‌ కోసం కొనాల్సిన కారు ఇది. ఫన్‌, స్పోర్టీ, ఎమోషనల్‌ డ్రైవింగ్‌ అనుభవం కోరుకునేవారికి ఇది బెస్ట్‌ ఛాయిస్‌.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget