అన్వేషించండి

Low Sales Cars: భారత మార్కెట్లో అంతగా అమ్మకాల‌కు నోచుకోని 8 కార్లు - కానీ ఫీచర్లు, పర్ఫార్మెన్స్‌ మాత్రం టాప్‌!

మంచి ఫీచర్లు ఉన్నా అమ్మకాల్లో వెనుకబడిన 8 కార్లు మన కళ్ల ముందే తిరుగుతున్నాయి. ఫీచర్లు, పనితీరు, కంఫర్ట్‌లో బలంగా ఉన్నా, ఎందుకో జనం దృష్టి వీటిపై అంతగా పడక అమ్మకాల్లో వెనుకబడ్డాయి.

Underrated Cars India 2025: భారతదేశంలో, కార్ల మార్కెట్‌ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సెగ్మెంట్‌లో వందలాది మోడల్స్‌ ఉన్నా… వాటిలో కొన్ని మాత్రం తమ స్థాయికి తగ్గ అమ్మకాలను అందుకోలేకపోతున్నాయి. ఫీచర్లు బాగున్నా, డిజైన్‌ యూనిక్‌గా ఉన్నా, డ్రైవ్‌ క్వాలిటీ మంచిగా ఉన్నా... బ్రాండ్‌ ఇమేజ్‌, మార్కెటింగ్‌, ప్లానింగ్‌ వంటి కారణాలతో ఈ కార్లు ప్రజల్లో సరైన గుర్తింపును సంపాదించలేకపోతున్నాయి. 

అమ్మకాల కంటే మెరిట్ ఎక్కువగా ఉన్న 8 కార్లు:

1. Citroen Aircross X – నెలకు కేవలం 100 యూనిట్లు
మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో Hyundai Creta దాదాపు నెలకు 15,000 యూనిట్లు అమ్ముతుంటే… Citroen Aircross X మాత్రం 100 యూనిట్లకే పరిమితం అవుతోంది. బ్రాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ తక్కువగా ఉండటం, పాత వెర్షన్‌లో కీలక ఫీచర్లు లేకపోవడం ప్రధాన కారణాలు. అయినా... క్లాసీ ఇంటీరియర్‌, డిఫ్యూజ్ అంబియంట్ లైటింగ్‌, పూర్తిగా తీసివేయగలిగే మూడో వరుస సీట్లు ఈ కారును ప్రత్యేకంగా నిలబెడతాయి.

2. Jeep Meridian – నెలకు 110 యూనిట్లు
Jeep పేరెంట్‌ కంపెనీ అయిన Stellantis’, భారత మార్కెట్‌పై పెట్టుబడి తగ్గించడం, అప్‌డేట్లు ఇవ్వకపోవడం వల్ల ఈ మోడల్‌ అమ్మకాలు పడిపోయాయి. పెట్రోల్‌ ఆప్షన్‌ లేకపోవడం కూడా ఒక లోపం. అయినా... హైవేపై రైడ్ క్వాలిటీ, ఆఫ్‌రోడ్ కెపాబిలిటీ విషయంలో మెరిడియన్‌ తన క్లాస్‌లో టాప్‌.

3. Citroen Basalt X – దాదాపు 200 యూనిట్లు
సిట్రోయెన్ బ్రాండ్‌ ఇమేజ్‌ సమస్యలతో పాటు పాత మోడల్‌లో ఫీచర్లు తక్కువగా ఉండటం అమ్మకాలను ప్రభావితం చేసింది. అయినా... Basalt X లో ఉన్న స్మూత్‌ 1.2 టర్బో ఇంజిన్‌, ఈజీ డ్రైవ్‌, మంచి సస్పెన్షన్‌ ఈ కారును గొప్పగా నిలబెడతాయి.

4. Audi A4 – జర్మన్ ప్రత్యర్థులే బెటర్
BMW 3 Series, Benz C-Class లాంటి మోడల్స్‌ కొత్త టెక్నాలజీతో వస్తుండటంతో A4 కొంచెం పాతగా కనిపిస్తుంది. కానీ... ప్రైస్‌ బెనిఫిట్‌, హై-ప్రొఫైల్ టైర్ల కారణంగా మంచి రైడ్ క్వాలిటీ, ఆడి బిల్డ్‌ క్వాలిటీ - ఇవన్నీ A4 ను డబ్బుకు పూర్తి విలువైన కారుగా నిలబెడతాయి.

5. Maruti Suzuki Invicto – నెలకు 250 యూనిట్లు
Toyota Hycross హైబ్రిడ్‌ దాదాపు 20 రెట్లు ఎక్కువ అమ్ముడవుతుంటే, Invicto మాత్రం తక్కువగానే ఉంది. మారుతి "ప్రీమియం" ఇమేజ్‌ లేదని కొంతమంది భావించడం అమ్మకాలకు అడ్డుగా మారింది. అయినా... హైబ్రిడ్‌ టెక్నాలజీ, మంచి మైలేజ్‌, మారుతి సర్వీస్ నెట్‌వర్క్‌ దీని బలాలు.

6. Hyundai Creta Electric – సుమారు 800 యూనిట్లు
BE 6 వంటి రైవల్స్‌తో పోలిస్తే Creta EV స్టైలింగ్‌ అంత యూనిక్‌గా లేదు. కానీ, 400 కి.మీ. రియల్ రేంజ్‌, మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌, ఫన్-టు-డ్రైవ్ స్వభావం EV మార్కెట్లో దీనిని బలమైన ఆప్షన్‌గా నిలబెడతాయి.

7. Nissan Magnite – నెలకు 1,860 యూనిట్లు
నిస్సాన్‌ బ్రాండ్‌ ప్రెజెన్స్‌ తక్కువగా ఉండటం, పోర్ట్‌ఫోలియో చిన్నది కావడం వల్ల అమ్మకాలు పెరగడం లేదు. అయినా Magnite లో SUV లుక్‌, మంచి కేబిన్ స్పేస్‌, టర్బో ఇంజిన్‌, CVT స్మూత్ డ్రైవ్ కారణంగా దీనికి మరింత అమ్మకాలు రావాల్సిందే.

8. Maruti Suzuki Ignis – నెలకు 2,770 యూనిట్లు
ఈ యూరోపియన్‌ డిజైన్‌ కారు భారత మార్కెట్‌లో అందరికీ నచ్చడం లేదు. అయినా, స్మూత్‌ సస్పెన్షన్‌, సరసమైన ధర, సైజ్‌ చిన్నగా ఉన్నా SUV తరహా లుక్‌ ఇగ్నిస్‌కు ప్రత్యేకతను ఇస్తాయి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget