అన్వేషించండి

IND vs SA 1st T20I Match Time: నేడు తొలి టీ20.. భారత్‌ను ఢీకొడుతున్న దక్షిణాఫ్రికా- మ్యాచ్ టైం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

India vs South Africa 1st T20 | టెస్టులో ఓడినా దక్షిణాఫ్రికాపై భారత్ ODI సిరీస్ గెలిచింది. నేడు కటక్ వేదికగా టీ20 సిరీస్ మొదలవుతుంది. భారత్ టీ20లో ప్రపంచ ఛాంపియన్ కావడంతో సఫారీలు చెమటోడ్చక తప్పదు.

IND vs SA 1st T20I Cricket Match Time: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ నేడు ప్రారంభం అవుతుంది. నేటి నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. కటక్‌లోని బారాబతి స్టేడియం తొలి టీ20 మ్యాచ్ కు వేదికగా మారింది.  రెండు జట్లకు ఈ సిరీస్ చాలా ముఖ్యమైనది. వాస్తవానికి, T20 ప్రపంచ కప్ దగ్గర పడుతోంది. దాంతో ఈ సిరీస్ ఆయా జట్లో ప్లేయింగ్ కాంబినేషన్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కనుక ఈరోజు మొదటి మ్యాచ్ ఎప్పుడు, ఏ సమయంలో, ఎక్కడ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. మీరు ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఎక్కడ చూడవచ్చు ఇక్కడ పూర్తి వివరాలు మీకోసం.

మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడ?

మొదటి T20I: మంగళవారం, డిసెంబర్ 9

వేదిక: బారాబతి స్టేడియం, కటక్

టాస్: మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు

మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7:00 గంటలకు

లైవ్ ఎక్కడ చూడాలి?

టీవీ: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది

ఆన్‌లైన్: JioHotstar యాప్, జియో హాట్ స్టార్ వెబ్‌సైట్

టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్

టెస్ట్ సిరీస్‌ను 0-2తో దక్షిణాఫ్రికాకు కోల్పోయిన తర్వాత, ఇండియా ODI సిరీస్‌ను 2-1తో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్ విషయంలో పర్లేదు కానీ, బౌలింగ్ విషయంలో కొంత సమస్య అనిపిస్తుంది. ఇది భారత జట్టుకు ఇష్టమైన ఫార్మాట్. ఇక్కడ భారత్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, నంబర్-1 జట్టుగా దూసుకెళ్తోంది. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్, హార్దిక్ పాండ్యా తిరిగి రావడం, గిల్ కోలుకోవడం, జస్ప్రీత్ బుమ్రా-వరుణ్ చక్రవర్తిలు జట్టును బలోపేతం చేశారు. వికెట్ కీపర్ స్థానంలో జితేశ్ శర్మకు సంజు శాంసన్ కంటే ఎక్కువ అవకాశం లభించే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికా సైతం రెడీ

ODI సిరీస్‌ను కోల్పోయినా దక్షిణాఫ్రికా అనేక సందర్భాల్లో సత్తా చాటింది. T20 క్రికెట్‌లో ఈ జట్టు మరింత ప్రమాదకరంగా మారుతుంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్‌తో పాటు క్వింటన్ డి కాక్ తిరిగి రావడం టాప్ ఆర్డర్‌కు బలాన్నిస్తుంది. మిడిల్ ఆర్డర్‌లో డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. మార్కో జాన్సన్, జార్జ్ లిండే, డోనోవన్ ఫెరీరా వంటి ఆల్ రౌండర్లు జట్టుకు సమతుల్యతను ఇస్తారు. బౌలింగ్‌లో లుంగి ఎంగిడి, ఎన్రిచ్ నార్జేలు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. 

భారత జట్టు ఆటగాళ్లు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

దక్షిణాఫ్రికా జట్టు

ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జార్జీ, డేవిడ్ మిల్లర్, జార్జ్ లిండే, రీజా హెండ్రిక్స్, కార్బిన్ బాష్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), డోనోవన్ ఫెరీరా (వికెట్ కీపర్), మార్కో జాన్సన్, ట్రిస్టన్ స్టబ్స్, ఓట్నీల్ బార్ట్‌మన్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, క్వెనా మఫాకా, ఎన్రిచ్ నార్ట్జే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
Bandla Ganesh : బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
Advertisement

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
Bandla Ganesh : బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
Hyderabad Crime News: ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
Telangana Govt Employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
Pawan Kalyan:
"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ
Bha Bha Ba OTT: ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget