అన్వేషించండి

Bigg Boss 9 Telugu Elimination This Week: బిగ్‌బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్... మాస్క్ మ్యాన్ ఔట్... ఆయన సంపాదన ఎంతో తెలుసా?

Bigg Boss 9 Telugu 4th Week Elimination: బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం మాస్క్ మ్యాన్ బయటకు వెళ్ళక తప్పలేదు. ఓటింగ్ తారుమారవ్వడంతో సేఫ్ జోన్ లో ఉన్నాడనుకున్న హరీష్ ఈ వారం నామినేషన్లలో ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాలిటీ షో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనే ఇంట్రెస్టింగ్ థీమ్ తో మొదలైంది. కానీ హౌస్ లో మాత్రం కామనర్స్ కే గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటిదాకా మొత్తం వారానికి ఒకరు చొప్పున ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కానీ అందులో ఒకరు మాత్రమే సెలబ్రిటీ ఉన్నారు. మిగతా ఇద్దరూ ప్రియా శెట్టి, మర్యాద మనీష్ కామనర్స్. ఇక ఇప్పుడు నాలుగవ వారం నామినేషన్ లో కూడా మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఈసారి ఏకంగా మాస్క్ మ్యాన్ (Mask Man Haritha Harish)ను బయటకు పంపించారు.

కామనర్స్ కు కలిసిరాని కాలం... ఊహించని ఎలిమినేషన్ 
4వ వారం నామినేషన్లలో రీతూ చౌదరి, సంజన, ఫ్లోరా షైనీ, శ్రీజ దమ్ము, దివ్య నికిత, హరిత హరీష్ ఉన్నారు. ఈ లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీలు రీతూ, సంజన, ఫ్లోరా, రీతూలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతివారం ఫ్లోరా నామినేషన్ లోకి రావడం, సేవ్ కావడం జరుగుతూనే ఉంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ లో శ్రీజ, దివ్య, హరీష్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో శ్రీజ అంటే తీవ్రమైన నెగెటివిటీ ఉండగా, ప్రియా వెళ్ళిపోయాక అది కాస్త తగ్గింది. పైగా ఈవారం విజృంభించి ఆడిన కళ్యాణ్ పడాలతో ఆమెకు మంచి బాండింగ్ ఉండడంతో, అతని ఫ్యాన్స్ ఓటింగ్ కూడా కలిసి వచ్చింది. అలా ఓటింగ్ తారుమారు అవ్వడంతో ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పదనుకున్న శ్రీజ సేఫ్ అయ్యింది. చివరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య, హరీష్ ఓటింగ్ పరంగా వెనకబడి ఉన్నారు. వీళ్లిద్దరిలో హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

Also Readబిగ్‌బాస్ డే 25 రివ్యూ... ఇమ్మూ, భరణి, తనూజ మధ్య బిగ్ బాస్ చిచ్చు... సొంత టీంకి సంజన అన్యాయం... ఒక్కో టాస్కులో ఒక్కో ట్విస్టు

మాస్క్ మ్యాన్ సంపాదన ఎంత ? 
మాస్క్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు కామనర్ హరిత హరీష్. అగ్ని పరీక్షను దాటుకుని, ఇప్పటి దాకా బిగ్ బాస్ లో కొనసాగాడు. అయితే ఈ నాలుగు వారాల ప్రయాణంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒకానొక టైమ్ లో మితిమీరిన కోపంతో మాట జారాడు. "ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడావ్" అంటూ నాగార్జున కౌంటర్ ఇచ్చినా, ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన... తాను అన్నమాట ఆడవాళ్లను తక్కువ చేయాలనే ఉద్దేశంతో అన్నది కాదని అన్నాడు. పైగా ఇలాంటి ముఖ్యమైన సిట్యువేషన్ లో తనకు సపోర్ట్ చేయనందుకు హౌస్ మేట్స్ పై అలిగి, నిరహార దీక్షకు సైతం దిగాడు. తనలోని హ్యూమర్ సైడ్ ను చూపించమంటూ భార్య నుంచి వచ్చిన మెసేజ్ తో అన్నీ పక్కన పెట్టేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఈ వారం చేతికి గాయం కావడంతో హరీష్ హౌస్ లో పెద్దగా కనిపించలేదు. అదే ఆయనకు బిగ్గెస్ట్ మైనస్ గా మారింది. ఈ 4 వారాల్లో ఆడియన్స్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ ను ఇవ్వలేకపోయారు. దీంతో ఈవారం బిగ్ బాస్ ఆయనకు టాటా బైబై చెప్పేశారు. హౌస్ లో ఉన్నప్పుడు ఆయన వారానికి 60 వేలు చొప్పున నాలుగు వారాల్లో రూ. 2.40 లక్షలు సంపాదించినట్టు సమాచారం.

Also Readబిగ్‌బాస్ డే 26 రివ్యూ... కెప్టెన్సీ టాస్క్‌లో కన్ఫ్యూజన్, కళ్యాణ్‌కు వెన్నుపోటు... హౌస్‌లోకి అనుకోని అతిథి... ఏడ్చిన ఇమ్మాన్యుయేల్

టాప్ హెడ్ లైన్స్

Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
Bigg Boss 10 Telugu: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget