బిగ్​బాస్​ 9 తెలుగు సీజన్​లోకి ఆశా షైనీ వెళ్లింది. ఆమె గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

ఆశా షైనీ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన పేరే. కానీ 'లక్స్ పాప' అంటే చాలా త్వరగా గుర్తొస్తుంది.

ఆమె అసలు పేరు ఫ్లోరా సైనీ. ఆ తర్వాత స్క్రీన్ కోసం మయూరి అని, ఆశా షైనీ అని మార్చుకుంది. మళ్లీ ఫ్లోరా సైనీగానే మారింది.

తెలుగులో నరసింహ నాయుడు, నువ్వునాకు నచ్చావ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

నటిగా 1999 నుంచి కెరీర్ ప్రారంభించింది. మధ్యలో గ్యాప్ తీసుకున్నా.. నటిగా ఇప్పటికీ కెరీర్ కొనసాగిస్తుంది.

ఈమె వయసు 46 సంవత్సరాలు. ఇప్పటికీ సింగిల్​గానే ఉంది. రిలేషన్స్ గురించి అప్పుడప్పుడు ఇన్​స్టాలో పోస్ట్​లు పెడుతుంది.

చంఢీఘర్​లో పుట్టిన ఈ భామ ప్రేమ కోసం అనే సినిమాతో తెలుగు నుంచి కెరీర్ ప్రారంభించింది.

అనంతరం హిందీ, కన్నడ, తమిళం, పంజాబీ సినిమాల్లో నటించింది. కొన్ని సిరీస్​లో కూడా చేసింది.

2023 నుంచి ఖాళీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం ఇన్​స్టాగ్రామ్​లో యాక్టివ్​గా ఉంటుంది.

బిగ్​బాస్​లో మరి ఈమె ఏ విధంగా నెట్టుకొస్తుందో రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.