మిడ్​వీక్ ఎలిమినేషన్?

బిగ్​బాస్ 8వ సీజన్​లో 14వ వారం నామినేషన్స్ లిస్ట్..

Published by: Geddam Vijaya Madhuri

పృథ్వీ

సెకండ్ ఎలిమినేషన్​లో భాగంగా పృథ్వీ ఆదివారం ఇంటి నుంచి బయటకొచ్చేశాడు. అన్​ఫైర్ ఎలిమినేషన్​ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్​లు వస్తున్నాయి.

అవినాష్

టికెట్ టూ ఫినాలేతో అవినాష్ టాప్ 5కి చేరుకున్నాడు. ఈ వారం అతను నామినేషన్స్​లో లేడు.

రోహిణి

ఇంటికి చివరి మెగాచీఫ్​గా ఉన్న రోహిణి ఈ వారం నామినేషన్స్​లో ఉంది. ఇప్పటివరకు ఈమె నామినేషన్స్​లోకి అంతగా రాలేదు కాబట్టి ఓట్లు తక్కువ వచ్చే అవకాశముంది.

గౌతమ్ కృష్ణ

గౌతమ్ బిగ్​బాస్ హోజ్​లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి నామినేషన్స్​లోనే ఉన్నాడు. ఇతను కప్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు బిగ్​బాస్ ఫ్యాన్స్.

నబీల్

నబీల్ కూడా టాప్ 5 కంటెస్టెంట్స్​లో ఒకడు. కానీ కొన్నిసార్లు తన బిహేవియర్​తో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇతను కూడా నామినేషన్స్​లో ఉన్నాడు.

ప్రేరణ

తన మాటలు మార్చుకోకపోతే కచ్చితంగా ప్రేరణ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుందని టేస్టీ తేజ చెప్పాడు. ఈ వీక్ నామినేషన్స్​లో ఉన్న ఈ భామ.. ఇప్పటికైనా తన బిహేవియర్ మార్చుకుని టాప్ 5కి వెళ్తుందో లేదో చూడాలి.

నిఖిల్

నిఖిల్ రన్నర్​ అయినా విన్నర్​గా అయినా వస్తాడంటున్నారు బిగ్​బాస్ ప్రేక్షకులు. టాస్క్​ల్లో అతను టాప్ అయినా.. కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోవట్లేదనే టాక్​ కూడా ఉంది. నామినేషన్స్​లో నిఖిల్ కూడా ఉన్నాడు.

విష్ణుప్రియ

పృథ్వీ వెళ్లిపోయాక విష్ణుప్రియ గేమ్ ఎలా ఆడుతుందో చూడాలంటున్నారు ఆమె అభిమానులు. ఈ వారం నామినేషన్స్​లో విష్ణుప్రియ కూడా ఉంది.

మిడ్​ వీక్ ఎలిమినేషన్

అయితే ఈవారం మిడ్​ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తుంది. రోహిణి కూడా నామినేషన్స్​లో ఉంది కాబట్టి.. ఆమె బయటకు వచ్చేస్తుంది అంటున్నారు.