Bigg Boss 9 Telugu : 'బిగ్ బాస్ 2.0' లోడింగ్... వైల్డ్ కార్డ్ ఎంట్రీల లేటెస్ట్ అప్డేట్... ఆ ఒక్క లేడీ కంటెస్టెంట్ తప్ప ఈ 5 మంది సెలబ్రిటీలు కన్ఫర్మ్
Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లోకి సెకండ్ రౌండ్ వైల్డ్ కార్డుల ఎంట్రీలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ లిస్ట్ లో ఏకంగా 5 మంది సెలబ్రిటీలు కన్ఫర్మ్ అవ్వగా, ఇద్దరు మాత్రం సస్పెన్స్ లో ఉన్నట్టు సమాచారం.

బిగ్ బాస్ సీజన్ 9 సరికొత్త ఫార్మాట్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ అంటూనే పట్టుమని మూడు వారాలు కూడా కాకముందే దివ్య నిఖితను మరో వైల్డ్ కార్డ్ కామనర్ గా హౌస్ లోకి పంపించారు. అలాగే ఏమాత్రం అంచనాలను అనుకోని వారిని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తున్నారు. నాలుగు వారాల్లో ఏకంగా ముగ్గురు కామనర్స్, ఒక సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. అయితే ఈసారి మాత్రం మొత్తం సెలబ్రిటీలనే హౌస్ లోకి పంపబోతున్నట్టు సమాచారం.
వైల్డ్ కార్డు ఎంట్రీలుగా ఆ ఐదుగురు
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో మొట్టమొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగు పెట్టిన దివ్య నిఖిత అదరగొడుతోంది. అతి తక్కువ సమయంలోనే ఆమె అందరి మనసులు గెలుచుకుంది. మాటలే కాదు టాస్కుల ద్వారా కూడా తాను చేతల్లోనూ సూపర్ అని ప్రూవ్ చేసుకుంటోంది. ఇదిలా కొనసాగుతుండగా, ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు అక్టోబర్ 11న వైల్డ్ కార్డుల ఎంట్రీల లాంచ్ 'బిగ్ బాస్ 2.0' పేరుతో గ్రాండ్ గా జరగబోతోందని తెలుస్తోంది. అయితే సెకండ్ రౌండ్ వైల్డ్ కార్డుల లిస్ట్ గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు విన్పిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం నిఖిల్ నాయర్ అనే సీరియల్ యాక్టర్, పికిల్స్ కాంట్రవర్సితో పాపులర్ అయిన రమ్య, దివ్వెల మాధురి, అఖిల్ రాజ్ అనే మరో యాక్టర్, ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను త్వరలో గ్రాండ్ గా బిగ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఏవీల షూట్ జరుగుతున్నట్టు సమాచారం.
సస్పెన్స్ లో ఇద్దరు కంటెస్టెంట్స్
బిగ్ బాస్ 9 తెలుగులో వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి ప్రస్తావన వస్తున్నప్పుడల్లా విన్పిస్తున్న పేరు సుహాసిని. 'చంటిగాడు' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత సీరియల్స్ హీరోయిన్ గా స్థిరపడింది. "దేవత, అపరంజి, అనుబంధాలు, అష్టాచెమ్మ" వంటి సీరియల్స్ లో నటించి విశేష ప్రేక్షకరణను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆమె బిగ్ బాస్ ఎంట్రీ కోసమే బుల్లితెర ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె ఈ రియాలిటీ షో కోసం ఇంకా సైన్ చేయలేదని తెలుస్తోంది. దీంతో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీగా అసలు హౌస్ లోకి వెళ్తుందా లేదా? అన్న కన్ఫ్యూజన్ నెలకొంది. ఇకపోతే సుహాసినితో పాటు మరో లేడీ కంటెస్టెంట్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అయితే ఆ అమ్మాయి ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి వీరిద్దరి సస్పెన్స్ కు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. అలాగే ఇప్పటికే తల్లీకొడుకులు, సిస్టర్ బ్రదర్, తండ్రీ కూతుర్లు, క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ హౌస్ లో సెటిల్ అయిపోయిన కంటెస్టెంట్స్ తో వైల్డ్ కార్డు ఎంట్రీల లెక్కలు ఎలా ఉండబోతున్నాయనేది మరో ఇంట్రెస్టింగ్ విషయం.




















