Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 33 రివ్యూ... వరస్ట్ ప్లేయర్ to కెప్టెన్సీ బ్యాండ్ వరకు కళ్యాణ్... దివ్యకు తనూజ వెన్నుపోటు... ఇమ్మూను బకరాను చేసిన హీరోయిన్
Bigg Boss 9 Telugu Today Episode - Day 33 Review : బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 34లో డేంజర్ జోన్ లో ఉన్న ప్లేయర్స్ కు మరో ఛాన్స్ ఇచ్చారు. ఇందులో తనూజ విన్ అవ్వగా, మరో టాస్క్ లో కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు.

నిన్నటి వరకూ జరిగిన ఇమ్యూనిటీ టాస్క్ లో భరణి - దివ్య, కళ్యాణ్ సేవ్ అయిన సంగతి తెలిసిందే. అయితే కళ్యాణ్ తో కలిసి ఆడిన తనూజ చేసిన త్యాగం గురించి ఈరోజు ఎపిసోడ్ లో చర్చ నడిచింది. ఇమ్మాన్యుయేల్ తో తనూజ మాట్లాడుతూ "అతనికి సేవ్ అయ్యే ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాను" అని చెప్పింది. దీంతో దివ్య, ఇమ్మూ "అతను నీతో టీం అయ్యిందే అందుకు, అంత ఈజీగా ఎందుకు ఛాన్స్ వదిలేశావు?" అంటూ పుల్లలు పెట్టే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ డే ఉదయాన్నే "ట్రస్ట్ బ్రేక్ చేసింది తనూజ అంటూ" రీతూతో డిస్కషన్ పెట్టింది సంజన.
సుమన్ శెట్టికి అన్యాయం
"ఫైర్ స్టార్మ్ నుంచి సేవ్ అవ్వడానికి చివరి ఛాన్స్" అంటూ బిగ్ బాస్ 'ఫైట్ ఫర్ సర్వైవల్' అనే టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో నీటితో నిండిన పూల్స్ పెట్టి, అందులో టీంమేట్స్ పడుకోమన్నారు. డేంజర్ జోన్ నుంచి సేవ్ చేయాలనుకున్న వాళ్ల టబ్ లో నుంచి నీళ్లను, ఇతరుల టబ్ లో సేఫ్ జోన్ లో ఉన్నవాళ్ళు పోయొచ్చు. ఈ టాస్క్ కు ఫ్లోరా సంచాలక్ గా వ్యవహరించారు. అయితే తనూజ "వాటర్ ఫోబియా" అంటూ భరణి దగ్గర కన్నీరు పెట్టుకుంది. ఇమ్మాన్యుయేల్ సంజనకు సపోర్ట్ చేస్తా అన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరి సపోర్ట్ అడిగారు. ముందుగా "సుమన్ శెట్టి సపోర్ట్ తీసుకున్నాడు" అంటూ ఫ్లోరా అతన్ని గేమ్ నుంచి తీసేసింది. సుమన్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.
బిగ్ బాస్ వార్నింగ్
"గేమ్ ఏంటో ఐడియా ఉందా? మీరు ఎవరిని సేవ్ చేయాలి అనుకుంటున్నారో... వాళ్ళ టబ్ నుంచి నీటిని తీసి వేరేవాళ్ళ టబ్ లో వేయాలి" అంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను హెచ్చరించారు. ఆ టైంలో డెమోన్ టబ్ లో నీళ్ళు ఎక్కువగా ఉండడంతో అతన్ని ఎలిమినేట్ చేశారు. తనూజ ఈ టాస్క్ లో సేవ్ అయ్యింది. ఈ టాస్క్ తో దివ్య - తనూజ మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది. కానీ రీతూ కంగ్రాట్స్ చెప్పలేదు అంటూ.నాన్నకి కంప్లైంట్ చేసింది తనూజ.
Also Read: బిగ్‌బాస్ డే 31 రివ్యూ - శ్రీజపై దివ్య పర్సనల్ గ్రడ్జ్... వరస్ట్ ప్లేయర్ కళ్యాణ్... ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే!
కెప్టెన్సీ టాస్క్... ఇమ్మాన్యుయేల్ బలి
"కనుక్కోండి చూద్దాం" అనే కెప్టెన్సీ టాస్క్ కి సంజన సంచాలక్. సేఫ్ జోన్ లో ఉన్నవారు కంటెస్టెంట్స్. పోటీదారులు అందరూ కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చోవాలి. బజర్ మోగినప్పుడల్లా సంచాలక్ ఒకరి భుజాన్ని తట్టాలి. ఆ పోటీదారు చైర్ లో కూర్చున్న ఒకరి లైట్ ను ఆఫ్ చేసి, మళ్ళీ కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చోవాలి. లైట్ ఆఫ్ అయిన సభ్యులు తమ లైట్ ఆఫ్ చేసింది ఎవరో కనిపెట్టాలి. లేదంటే రేస్ నుంచి ఔట్. ఈ టాస్క్ లో చివరకు తనూజ, కళ్యాణ్ నిలవగా... ఆ ఇద్దరిలో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత ఉందో రీజన్స్ తో సహా చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. అందరూ కలిసి కళ్యాణ్ ను కెప్టెన్ గా ఎంచుకున్నారు. దీంతో తనూజ గేమ్ అయ్యాక దివ్య దగ్గరకు వెళ్ళి, తాను చేసిన పనికి సారీ చెప్పింది. కానీ దివ్య మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. "నాకెవ్వరి సపోర్ట్ వద్దు" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మరోవైపు "కొడుకును బకరా చేసింది" అంటూ సంజనపై కామెంట్స్ చేసాడు ఇమ్మాన్యుయేల్. కళ్యాణ్ పై భరణి, ఇమ్మాన్యుయేల్, దివ్య గట్టిగా గ్రడ్జ్ పెట్టేసుకున్నారు.





















