Divvela Madhuri Interview: దువ్వాడతో పరిచయం నుంచి కాంట్రవర్సీ, బిగ్ బాస్ ఎంట్రీ వరకూ... ఏబీపీతో దివ్వెల మాధురి చిట్ చాట్
Bigg Boss 9 Telugu Wildcard Contestant Divvela Madhuri : బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగు పెట్టింది దివ్వెల మాధురి. ఏబీపీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాధురి జీవితం గురించి ఆమె మాటల్లోనే

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి సెకండ్ టైమ్ వైల్డ్ కార్డుల ఎంట్రీ జరిగింది. ఆదివారం వైల్డ్ కార్డుల ఎంట్రీ గ్రాండ్ గా జరగ్గా, అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ దివ్వెల మాధురి కూడా ఉన్నారు. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే ఆవిడ ఏబీపీ తెలుగుకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ కోసం.
ఉత్తరాంధ్ర మాజీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో లవ్ స్టోరీ కారణంగా దివ్వెల మాధురి వార్తల్లో నిలిచింది. ఈ వివాదాలు, తరువాత జరిగిన ఇంటర్వ్యూల వల్ల తెలుగు స్టేట్స్ పరిచయం అక్కరలేని పేరుగా మారింది దివ్వెల మాధురి. ముందే పెళ్ళయి, ఇద్దరు పిల్లలున్నారు దువ్వాడ శ్రీనివాస్ కు. మాధురితో రిలేషన్షిప్ లో ఉండడంతో శ్రీనివాస్ కు తన భార్యకు మధ్య వివాదం నెలకొంది. మరోవైపు మాధురికి కూడా ముందుగానే పెళ్ళయి, పిల్లలున్నారు. ఇలా కుటుంబ తగాదాలు మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు మాధురి. మరోవైపు సారీ బిజినెస్ లో కూడా దూసుకెళ్తున్నారు. ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న విషయాలపై ఓ లుక్కేద్దాం.
1. బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీగా అడుగు పెట్టడం గురించి ఎలా ఫీల్ అవుతున్నారు?
ఇది ప్రో మూమెంట్. ఇలాంటి అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది నన్ను వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది.
2. ఈ షోలో ఎక్కువ మంది ట్యాలెంట్ తో వచ్చేవాళ్ళు ఉంటారు. మీకు ఏ ట్యాలెంట్ తో ఈ ఆఫర్ ఇచ్చింది ?
ప్రతీ వుమెన్ మల్టీ టాలెంటెడ్. మహిళలు చేయగలిగే పనులు ఎవరూ చేయలేరు. ఒక మహిళగా ప్రతీ ఒక్క మహిళా సెలబ్రిటీనే. అదే కోవలో నాకు కూడా ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను.
3. సోషల్ మీడియాలో మీపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. వాటిని తట్టుకుని ఎలా నిలబడ్డారు?
గత నాలుగేళ్లుగా నేను చాలా ట్రోలింగ్, అవమానాలు, డిప్రెషన్ కి గురయ్యాను. ఓ వర్గం అయితే నన్ను డీగ్రేడ్ చేయాలని ట్రై చేసింది. మనకు మనం నచ్చితే చాలు అని నమ్ముతాను నేను. అలాగే శ్రీనివాస్ సపోర్ట్ కూడా ఉంది. తనొక పాజిటివ్ ఎనర్జీ కాబట్టి మరింత పాజిటివ్ అయ్యింది.
4. మాధురి పరిచయం అయ్యాక దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ గండం వచ్చింది అని కామెంట్స్ వచ్చాయి ?
అవన్నీ ఫేక్ న్యూస్. నేను పరిచయం అయ్యాకే శ్రీనివాస్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎలెక్షన్స్ లో కూడా దగ్గరుండి ప్రచారం చేశాను. ఇదంతా అధిష్టానంకు తెలుసు. నావల్ల టికెట్ పోయింది అనేది అబద్దం. జిల్లాలో జరుగుతున్న రాజకీయ కుట్ర ఇది. ఆయనొక ఫైర్ బ్రాండ్ కాబట్టి తొక్కేయాలని చూశారు. కమ్యూనిటీ కుట్రలో భాగంగా పార్టీలో నుంచి సస్పెండ్ చేసేలా చేశారు.
5. దువ్వాడ శ్రీనివాస్ పరిచయం అయ్యాక అన్ని చోట్లా ఇద్దరూ కలిసే కన్పించారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అన్ని రోజులు విడివిడిగా ఎలా ఉంటారు?
అదే బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడు. శ్రీనివాస్ అస్సలు నన్ను వదిలి ఉండలేరు. ఈ నాలుగేళ్ళు ఒకరిని విడిచి ఒకరం ఉండలేదు. కానీ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని శ్రీనివాస్ సపోర్ట్ చేయడంతో వెళ్తున్నాను.
6. బిగ్ బాస్ కు వెళ్ళేవారిపై ట్రోల్స్ జరగడంతో పాటు వివిధ వివాదాలు ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కొంటారు ?
అవన్నీ దాటుకునే వచ్చాను. సూసైడల్ సిచ్యుయేషన్ నుంచి ఈ స్థాయికి వచ్చాను. ఇంకేమీ నన్ను బాధ పెట్టలేవు. ట్రోలింగ్ కు క్రుంగిపోకుండా, అన్నింటినీ దాటుకుని ముందుకెళ్లాలి అనే మనస్తత్వం నాది. 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ అవకాశం గురించి నా ఫ్రెండ్స్, ఫాలోవర్స్, ఫ్యాన్స్ నాకంటే ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు.





















