(Source: ECI | ABP NEWS)
Bigg Boss 9 Telugu: వైల్డ్ కార్డు లిస్ట్ అంతా తూచ్... బిగ్ బాస్‌నే ఆటాడించిన లేడీ సింగంతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో కూడా... కొత్త లిస్ట్ ఇదిగో
Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ వారం వైల్డ్ కార్డుల ఎంట్రీ గ్రాండ్ గా జరగబోతోంది. అయితే ఈ లిస్ట్ లో గతంలో వినిపించిన పేర్లు కాకుండా కొత్త పేర్లు బయటకు వచ్చాయి. ఆ కంటెస్టెంట్లు ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 9లో రెండవసారి వైల్డ్ కార్డుల ఎంట్రీ ఉండబోతోంది. ఇప్పటికే హౌస్ లో అగ్నిపరీక్ష నుంచి కామనr వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చి, సక్సెస్ ఫుల్ గా హౌస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే మరోసారి బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ పేరుతో వైల్డ్ కార్డుల ఎంట్రీతో షో అదిరిపోనుండి. నేపథ్యంలోనే ఈ లిస్ట్ లో రోజుకి పేరు వినిపిస్తోంది. కానీ తాజాగా బయటికొచ్చిన లిస్ట్ చూశాక, అదంతా తూచ్ అని చెప్పక తప్పదు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల కొత్త లిస్ట్ ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. డబుల్ ఎలిమినేషన్ తో పాటే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయి.
ఆ ఫైర్ స్టార్మ్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
నిన్నటిదాకా బిగ్ బాస్ 9 సెకండ్ రౌండ్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా ఏడుగురు సెలబ్రిటీల పేర్లు విన్పించాయి. అందులో దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్, రమ్య పికిల్స్, ప్రభాస్ శ్రీను, అఖిల్ రాజ్, సీరియల్ నటి సుహాసినిల పేర్లు వచ్చాయి. పైగా వీళ్లకు సంబంధించిన ఏవీల షూటింగ్ కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు. కానీ సడన్ గా లిస్ట్ మొత్తం మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్, శ్రీనివాస, దివ్వెల మాధురి, రమ్య పికిల్స్ ఉన్నారు.
ఈ లిస్ట్ లో ముందుగా ఆయేషా గురించి చెప్పుకోవాలి. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6లో 60 రోజులు ఉండి, 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. హోస్ట్ కమల్ హాసన్ నే తప్పుగా పోట్రెయిట్ చేస్తున్నారు అంటూ వేలెత్తి చూపించిన కంటెస్టెంట్ ఆవిడ. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో పెద్ద గొడవల వల్ల తీవ్రంగా ట్రోల్ అయిన నటిగా పేరు తెచ్చుకుంది. పైగా తెలుగు మాట్లాడే తమిళ అమ్మాయి. 'సావిత్రమ్మ గారి అబ్బాయి' అనే సీరియల్ తో పాటు పలు తెలుగు సీరియల్స్ లో నటించింది. 'కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్' అనే షోలో కూడా పాల్గొంది. ఇంస్టాగ్రామ్ లో ఆమెకు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
2.0 ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నెక్స్ట్ లిస్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస సాయి. 'గోల్కొండ హైస్కూల్' సినిమాలో బాల నటుడిగా కన్పించిన శ్రీనివాస 'శుభలేఖలు, వినరా సోదర వీర కుమార' సినిమాలలో హీరోగా నటించాడు. కానీ చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ అయితే లేదు. 'గీతా ఎల్ఎల్బి' సీరియల్ హీరో గౌరవ్ గుప్తా మరో స్ట్రాంగ్ వైల్డ్ కార్డు ఎంట్రీ. 'గృహలక్ష్మి, పలుకే బంగారమాయెనే' సీరియల్స్ లో నటించి, యూత్ ఐకాన్ 2022 అవార్డు అందుకున్న మరో సీరియల్ హీరో నిఖిల్ నాయర్ హౌస్ లో గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ యాక్టర్ పేరుకే మలయాళీ, కానీ తెలుగులో కూడా బాగా మాట్లాడతాడు. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి గురించి తెలియని తెలుగు పేక్షకులు ఉండరన్న మాట. కాగా ఈ వైల్డ్ కార్డుల గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ ఆదివారం స్ట్రీమింగ్ కానుంది.





















