అన్వేషించండి

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 34 రివ్యూ... కళ్యాణ్ కెప్టెన్సీ వెనుక కుట్ర, కంటెస్టెంట్స్‌ను చెడుగుడు ఆడేసిన నాగ్... సంచాలక్‌కు స్ట్రాటజీ ఏంటమ్మా?

Bigg Boss 9 Telugu Today Episode - Day 33 Review : బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 34లో నాగార్జున బ్లాక్, గోల్డెన్ స్టార్స్ ఇచ్చి, అందరి కళ్ళూ తెరిపించారు. బ్లాక్ స్టార్ ఇచ్చిన వాళ్ళు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు.

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఐదవ వారం ఎండింగ్ కు వచ్చేసింది. డే 34, శుక్రవారం ఉదయమే "నీకు నచ్చిన వాళ్ళతోనే క్లోజ్ గా ఉండు, గేమ్ ఆడు. కానీ అందరినీ గుడ్డిగా నమ్మకు. నీకెవరు హెల్ప్ చేశారో వాళ్లను మాత్రం మర్చిపోవద్దు" అంటూ హితబోధ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే "సంజన నీకు సపోర్ట్ చేయలేదు" అని క్లారిటీ ఇచ్చారు. ఇమ్మాన్యుయేల్ దగ్గరకు వెళ్ళి "మనమమీ చిన్న పిల్లలం కాదు అలగడానికి" అంటూ దివ్య గురించి మాట్లాడుకున్నారు. "నాకు మా నాన్న తప్ప సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు ? అనేసింది. లిటరల్ గా నేను చచ్చిపోయాను. మనకైతే షర్ట్ లు విప్పి కొట్టుకున్నా కూర్చుని సాల్వ్ చేసుకునే మెచ్యూరిటీ ఉంది" అన్నాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత పూరి టాస్క్ ఇవ్వగా, హౌస్ మేట్స్ రెండు టీంలుగా విడిపోయి ఆడారు. ఇందులో ఇమ్మాన్యుయేల్ - పవన్ - ఫ్లోరా టీం ఓడిపోయింది. తనూజ - రాము - రీతూ టీం విన్ అయ్యింది.

ఇది కదా కావాల్సింది 
ముందుగా నాగార్జున కొత్త కెప్టెన్ కళ్యాణ్ ను "అసలు ఉంటావో లేదో పరిస్థితి నుంచి కెప్టెన్ అయ్యావు. ఇమ్యూనిటీ కూడా వచ్చింది. సూపర్" అంటూ ఫుల్ ఎలివేషన్ తో తనూజ చేత గోల్డెన్ స్టార్ ఇప్పించారు కళ్యాణ్ కు. తనూజను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి కెప్టెన్సీ టాస్క్ వీడియోను చూపించారు. డెమోన్ హెల్ప్ తో కళ్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడు అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇది ఎవరికీ చెప్పొద్దు అని అన్నారు. తనూజ కి గోల్డెన్ స్టార్ ఇస్తూ "బెడ్ టాస్క్ లో నువ్వు ఆడింది కరెక్టా? భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ సేవ్ చేస్తారని అనుకున్నావా?" అని సూటిగా ప్రశ్నించారు నాగ్. ఫ్యూచర్ లో రిగ్రెట్ కాకుండా ఆడాలని సలహా ఇచ్చారు. అలాగే "నాన్న దివ్యకి దగ్గరవుతున్నాడని కోపం వచ్చిందా?" అని అడగ్గా... అలాంటిదేమీ లేదని చెప్పింది.

భరణికి ఇచ్చిపడేసిన నాగ్ 
దివ్య అద్భుతంగా ఆడావు అంటూ గోల్డెన్ స్టార్ ఇచ్చారు. బెడ్ టాస్క్ లో భరణి గేమ్ గురించి ప్రశ్నించారు నాగ్. "శ్రీజ పరిస్థితిలో తనూజ - దివ్య ఉంటే..." అని అడగ్గా, "తనూజాకి భరణి సపోర్ట్ ఉంటుంది" అని కుండా బద్దలు కొట్టింది దివ్య. భరణికి గోల్డెన్ స్టార్ ఇచ్చి "బెడ్ టాస్క్ లో నువ్వు ఆడింది ఫెయిరా?" అని అడిగారు నాగ్. దీంతో భరణి తాను రెండు తప్పులు చేశానని ఒప్పుకున్నారు. "డెమోన్ ఉంటే రీతూ తప్ప అందరూ పడిపోతారు. అందుకే స్వార్థంతో అలా చేశాను" అని చెప్పాడు భరణి. "ఎక్కడో ఉండాల్సిన నువ్వు మా దృష్టిలో పడిపోయావు" అంటూ భరణికి స్ట్రాంగ్ గా క్లాస్ పీకారు. అలాగే "ఆటగాళ్ళు కదా స్ట్రాటజీ ఉండాలి. నీకెందుకు " అంటూ ఫ్లోరాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. "బెస్ట్ కెప్టెన్ ఈ సీజన్లో" అంటూ రాముని అభినందించారు. "నువ్వు సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు" అంటూ ఇమ్మాన్యుయేల్ కూడా కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చారు.

Also Readబిగ్‌బాస్ డే 32 రివ్యూ... దివ్య వల్ల చెల్లిని, పిల్లను పట్టించుకోని భరణి... టాస్కులలో దుమ్మురేపిన తనూజ - కళ్యాణ్... రీతూ బ్లండర్ మిస్టేక్

ఇమ్మూకి పవర్ అస్త్ర
సంజన - ఫ్లోరా, రీతూ -డెమోన్, శ్రీజ - సుమన్ శెట్టిలకు బ్లాక్ స్టార్ ఇచ్చారు. "మోస్ట్ పవర్ ఫుల్ ప్లేయర్" అని శ్రీజపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే సుమన్, డెమోన్ లకు అన్యాయం జరిగిందని నాగ్ వెల్లడించారు. రీతూ టార్గెట్ చేస్తుందని శ్రీజా కంప్లైంట్ చేసింది.

గోల్డెన్ స్టార్స్ తీసుకున్న ఇమ్మాన్యుయేల్, భరణి, తనూజ, దివ్య, రామూ, కళ్యాణ్ లకు "పవర్ అస్త్ర" అనే టాస్క్ పెట్టారు. ఒక్కొక్కరూ ఎవరికి ఆ పవర్ దక్కకూడదు అనుకుంటున్నారో వాళ్ల కీని విరిచేయమన్నారు. రాము కీ తనూజ, కళ్యాణ్ కీని దివ్య, తనూజ కీని భరణి, దివ్య కీని ఇమ్ము,కళ్యాణ్ భరణి కీని బ్రేక్ చేశాడు. చివరగా ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్రను గెలిచాడు. దాన్ని ఎలా వాడాలో టైమ్ వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్తారు. శ్రీజ, సుమన్ శెట్టి, సంజన, డెమోన్ డేంజర్ జోన్ లో, రీతూ, ఫ్లోరా ఎవిక్షన్ కు దగ్గర్లో ఉన్నారు. ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆదివారం ఉండనుంది.

Also Readబిగ్‌బాస్ డే 33 రివ్యూ... వరస్ట్ ప్లేయర్ to కెప్టెన్సీ బ్యాండ్ వరకు కళ్యాణ్... దివ్యకు తనూజ వెన్నుపోటు... ఇమ్మూను బకరాను చేసిన హీరోయిన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget