Bigg Boss 9 Telugu Controversial Contestants: కాంట్రవర్సీ క్వీన్స్‌కే ఎక్కువ ఎలివేషన్... ఆ ముగ్గురికి స్టార్ హీరోల సపోర్ట్... ఒక్కొక్కరి వివాదం వెనుక కన్నీటి గాథలు
Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 తెలుగు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో ఇద్దరికి మాత్రమే ఏవీల ద్వారా స్పెషల్ ఎలివేషన్ ఇచ్చారు. ముగ్గురికి స్టార్ హీరోల సపోర్ట్ ప్లాన్ చేశారు బిగ్ బాస్. వాళ్ళు ఎవరెవరంటే

ఎన్నో అంచనాల మధ్య బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఆదివారం ఎపిసోడ్లో ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీలు అడుగు పెట్టారు. అయితే వీరిలో ఇద్దరికి మాత్రమే స్పెషల్ ఎలివేషన్ ఇచ్చారు బిగ్ బాస్. స్పెషల్ పవర్స్ మాత్రం అందరీకీ ఇచ్చారు. అలాగే ఏవీల ద్వారా రియల్ స్టోరీలను, వివాదాలను, వివాదాల వెనకున్న వారి విషాద గాథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కి స్పెషల్ ట్రీట్మెంట్
ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు రమ్య మోక్ష, దివ్వెల మాధురి. ఆడియన్స్ వీళ్ళ బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకేనేమో ఈ కాంట్రవర్సీ క్వీన్ లకు స్పెషల్ ఏవీలతో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్. ముందుగా మొదటి వైల్డ్ కార్డు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్షను పరిచయం చేశారు. ఏవీలో "రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్సో నేనూ అంతే ఫేమస్. మాదొక కుట్టి ఫ్యామిలీ. రమ్య - అలేఖ్య - సుమ ముగ్గురం 3 రోజెస్ మేము. ఫిట్నెస్ వీడియోల ద్వారా ఫాలోయింగ్ తో పాటు క్రేజ్ కూడా పెరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాక పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాము. తక్కువ సమయంలోనే ఆ బిజినెస్ బాగా పెరిగింది. ఓ రోజు కొడైకెనాల్ షూటింగ్ కు వెళ్ళాను. తరువాత రోజు ఉదయాన్నే మా నాన్న సడన్ గా చనిపోయారు. ఆ బాధలో ఉండగానే, నెక్స్ట్ వారామే వివాదం నెలకొంది. అది దాడి చేయడం దాకా వెళ్ళింది. మా అక్క డిప్రెషన్ తో నెగెటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళను తిట్టడంతో వివాదం పెద్దదై, బిజినెస్ ను క్లోజ్ చేయాల్సి వచ్చింది. మా నాన్నే చనిపోయారు. దారుణమైన ట్రోలింగ్, దాడి జరిగింది. ఇన్ని దారుణాలు చూశాము" అంటూ తన రియల్ స్టోరీని నాగ్ ముందు వెల్లడించింది.
నెక్స్ట్ చెప్పుకోవాల్సింది దివ్వెల మాధురి గురించి. ఉత్తరాంధ్ర మాజీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో దివ్వెల మాధురి రిలేషన్ ఎన్ని వివాదాలు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇంటర్ టైంలోనే మా నాన్న నాకు పెళ్లి చేశాడు. ముక్కుసూటిగా ఉంటాను అందుకే ఫైర్ బ్రాండ్ అంటారు. ఆరాధ్య, అఖిల, అర్హ ముగ్గురు అందమైన పిల్లలు నాకు. నా భర్తతో కలిసి ఉండడానికి చాలా సార్లు ప్రయత్నించాను. కుటుంబపరంగా సమస్యలతో ఒంటరినైప్పుడు, అదే సమయంలో కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న దువ్వాడ శ్రీనివాస్ గారు పరిచయం అవ్వడంతో ఒకరికొకరం సపోర్ట్ గా నిలిచాము. 4 ఏళ్లుగా ఇద్దరం తోడూ నీడగా ఉంటున్నాము. ఈ నాలుగేళ్లుగా నేను నరకం చూశాను. సోషల్ మీడియాలో నా వ్యక్తిత్వ హేళన, ఆడపిల్లలు అని కూడా చూడకుండా నా పిల్లలను ఈ వివాదంలోకి లాగడం వంటివి చేశారు. మేము ఇద్దరం తల్లిదండ్రులుగా మా ఐదుగురు పిల్లలను మంచి స్థాయిలో నిలబెట్టడానికే ఈ జీవితాలను అంకితం చేస్తాము" అంటూ దివ్వెల మాధురి గురించి స్పెషల్ ఏవీ ద్వారా ఆమె జీవితంలో ఏం జరిగిందో వెల్లడించారు. వీళ్ళు ఇద్దరికి మాత్రమే ఇలా ఏవీలు వేయడం గమనార్హం.
ఆ ముగ్గురికి ముగ్గురు స్టార్స్ సపోర్ట్
తాజాగా వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఆరుగురిలో ఈ ఇద్దరు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖాలు. మిగిలిన నలుగురిలోనూ మాజీ తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా కాస్త ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగలిగింది. ఆమె తమిళ బిగ్ బాస్ లో తన లవ్ స్టోరీని చెప్పి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. "హౌస్ లో ఉన్నప్పుడు వాడు ప్రేమిస్తున్నాడు అనుకుని నా గేమ్ మొత్తాన్ని చెడగొట్టుకున్నాను. కానీ 65 రోజుల తరువాత బయటకెళ్ళి చూస్తే, వాడు నన్ను మాత్రమే కాకుండా హౌస్ లో ఉన్న మరో అమ్మాయిని గోకుతున్నాడు" అంటూ ఓపెన్ అయ్యింది.
సౌత్ లో ఉన్న బిగ్ బాస్ హోస్ట్ లు అందరూ ఒక్కొక్క వైల్డ్ కార్డుకు ఒక్కో పవర్ ఇచ్చారు. కన్నడ బిగ్ బాస్ నుంచి హోస్ట్ కిచ్చ సుదీప్ మాధురికి ఎలిమినేషన్ నుంచి ఎవరినైనా సేవ్ చేసే పవర్ ఇవ్వగా, నిఖిల్ నాయర్ కు మలయాళం బిగ్ బాస్ హోస్ట్ మోహన్ లాల్ డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే పవర్ ఇచ్చారు. అయేషాకు తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి డైరెక్ట్ నామినేషన్ పవర్ ఇవ్వడం విశేషం. అలా వీళ్లకు ముగ్గురు స్టార్స్ సపోర్ట్ లభించినట్టుగా అయ్యింది.





















