Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 40 రివ్యూ... దువ్వాడ మాధురికి చేజారిన కెప్టెన్సీ... గుక్కపెట్టి ఏడ్చిన అయేషా... ఈ వారం ఇద్దరు కెప్టెన్లు... సుమన్ శెట్టి మెంటల్ మాస్
Bigg Boss 9 Telugu Today Episode - Day 40 Review : నేటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యి హైలెట్ గా నిలిచాడు. కెప్టెన్సీ పరీక్షను రెండుసార్లు దాటుకుని రెండవ కెప్టెన్ గా సత్తా చాటాడు గౌరవ్.

బిగ్ బాస్ సీజన్ 9 డే 40 ఎపిసోడ్ 41లో కెప్టెన్సీ కోసం యుద్ధం సాగింది. "ఈ బిగ్ బాస్ ఇంట్లో ఫస్ట్ టైం ఇద్దరూ కెప్టెన్లు ఉండబోతున్నారు. మీ భాగస్వామిని జాగ్రత్తగా ఎంచుకోండి. మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయంపైనే మీ గెలుపోటములు ఉంటాయి" అని క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్. అయేషా - దువ్వాడ మాధురి, గౌరవ్ - సుమన్, శ్రీనివాస్ సాయి - రమ్యలు 3 జంటలుగా కెప్టెన్సీ కోసం బరిలోకి దిగారు. ఇంకా టాస్క్ మొదలుకాక ముందే రమ్యతో "నీ విషయంలో నేను హర్ట్ అయ్యాను" అంటూ కంటెండర్ జంట విషయం చెప్పింది దువ్వాడ మాధురి.
సుమన్ శెట్టి ప్రమాణ స్వీకారం - కెప్టెన్సీలో బిగ్ ట్విస్ట్
ఇక ముందుగా "విడిపించు గెలుపొందు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. "ప్రతీ జట్టులో ఒకరు బాక్స్ లో ఉంటే, మరొకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న మరో బాక్స్ లో కోడ్ ను తీసుకుని తమ పార్టనర్.ను విడిపించాలి" అన్నది టాస్క్. ఇందులో గౌరవ్ గుప్తా - సుమన్ శెట్టి టీం విన్ అయ్యారు. కానీ "మిస్టేక్ చేశాను. నాకున్న సైట్ వల్లే టాస్క్ లాస్ అయ్యాను" అంటూ గుక్కపెట్టి ఏడ్చింది అయేషా. మరోవైపు మాధురి ఏడుస్తూ కూర్చుంది. ఈ టాస్క్ లో విన్ అయిన సుమన్ శెట్టి - గౌరవ్ లకు కెప్టెన్ బ్యాండ్ తొడగమని గత వారం కెప్టెన్ కళ్యాణ్ ను ఆదేశించారు బిగ్ బాస్. "అధ్యక్షా సుమన్ శెట్టి అనే నేను నీతిగా, నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నా" అంటూ సుమన్ శెట్టి అప్పుడే ప్రమాణస్వీకారం కూడా చేశాడు.
"నిఖిల్ మీ దగ్గరున్న కంటెండర్ పవర్ ను ఉపయోగించి, ఇప్పుడున్న ఇద్దరు కెప్టెన్ లలో ఒకరిని ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్ లో మీరు గెలిస్తే, వాళ్ళను రీప్లేస్ చేయొచ్చు" అని చెప్పారు బిగ్ బాస్. దీంతో నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తాను ఛాలెంజ్ చేశాడు. అందరిదీ ఒక గోల అయితే ఇంటి దొంగలది ఇంకో గోల. రమ్య బిగ్ బాస్ ను కోరి తెచ్చుకున్న చాకోలెట్ ఐస్ క్రీంను సంజన, రీతూ, దివ్య దొంగచాటుగా తినేశారు.
భరణి బాండింగ్ బ్రేక్... లీక్ చేసిన ఇమ్మాన్యుయేల్
నెక్స్ట్ డే ఉదయాన్నే "నేనేమన్నా పని మనిషైనా? అందరికీ హెల్ప్ అవసరమే. మీ గ్రూప్ మీ ఇష్టం. నేనైతే నిన్ను నా బట్టలు ఉతుకు అని అడగను. మీ గ్యాంగ్ సూపర్" అంటూ కళ్యాణ్ కు ఇచ్చి పడేసింది అయేషా. "ఐరన్ చేయడం ప్యాంపరింగా" అని కళ్యాణ్ అంటే... "అవును. మీరేం చేయాలనుకుంటే అది చేయండి" అంటూ కళ్యాణ్ వివరణ ఇచ్చేలోగా వెళ్లిపోయింది.
మరోవైపు ఇమ్మాన్యుయేల్ - సంజన గుసగుసలు మొదలు పెట్టారు. సంజనతో "మొన్నటిదాకా కూతురు కూతురు అని, ఇప్పుడు అలా పిలవొద్దు అంటే కష్టం. నేను ఫ్లోలో మీ కూతురు అన్నాను. నువ్వు గుచ్చి గుచ్చి అన్నావు అనగానే ఒక నిమిషం టైం ఇవ్వమన్నాడు. నేను ఇవ్వను ఆలోచించుకోవాలి అని చెప్పాను. ఒకవేళ ఇంట్లో ఎవ్వరి వల్ల కాదు. నీ వల్లే హెల్ప్ అవుతుంది. అంటే నాకు హెల్ప్ చేస్తావా? అని అడిగాడు. మైండ్ బ్లాక్ అయ్యింది నాకు. 16 మంది ఒకవైపు, నువ్వు ఒక్కడివే ఒకవైపు ఉండి, న్యాయం నీవైపే ఉంటే నేను నీతోనే నిలబడతా అని చెప్పాను" అంటూ సీక్రెట్ ను కక్కేశాడు ఇమ్మాన్యుయేల్.
అయేషా - రీతూ... నెవర్ ఎండింగ్ గొడవలు
"నీట్ గా పెట్టుకో" అంటూ స్టార్ట్ చేసింది అయేషా. "భరణి భరణి అంటున్నావు ఎందుకు? ఆయన కడుగుతారా అంట్లు" అంటూ రీతూ చౌదరికి కౌంటర్ వేసింది. "నేను గొడవ పెట్టుకోవడానికి మాట్లాడట్లేదు. నువ్వు ఆ పక్కన అంటే అక్కడ ఉన్నదేమో, అది భరణి గారు చేస్తారేమో అని.అన్నాను" అంటూ.వివరణ ఇచ్చింది. కానీ అయేషా పడనివ్వలేదు. దీంతో రీతూ బాత్రూంలో ఏడ్చింది రీతూ. డెమోన్ పవన్ ప్రాబ్లం ఏంటో కనుక్కోవడానికి వెళ్లి, అయేషా దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. "నువ్వు ఆమెకే సపోర్ట్ చేస్తావ్" అంటూ ఫైర్ అయ్యింది అయేషా. "ముగ్గురం మాట్లాడుకుందాం పద" అని రమ్యతో రీతూ అనేసరికి సుమన్ ఏం జరుగుతుందోనని భయపడ్డాడు.
"గెలుపు కొరకు చివరి వరకు" అంటూ మరోసారి నిఖిల్ గౌరవ్ మధ్య కెప్టెన్సీ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. తనూజా సంచాలక్ గా వ్యవహరించిన ఈ టాస్క్ లో నిఖిల్ విన్ కాగా... ఈ వారం సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా కెప్టెన్లుగా నిలిచారు. సాయి, ఇమ్మాన్యుయెల్ నిఖిల్ కు సపోర్ట్ చేస్తే, కళ్యాణ్, అయేషా, దివ్య గౌరవ్ కు సపోర్ట్ చేశారు. టాస్క్ పూర్తి కాగానే "షాకింగ్ న్యూస్... 70% మీకే సపోర్ట్. కానీ వాళ్ళ పేర్లు రాలేదు. వచ్చి ఉంటే బ్యాగ్స్ అన్నీ అటే పడేవి. ఫైర్ స్టార్మ్ తప్ప ఇంకెవరినీ నమ్మకు" అంటూ నిఖిల్ కు షాక్ ఇచ్చాడు సాయి.





















