Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 39 రివ్యూ... హౌస్‌లో దువ్వాడ మాధురి రూల్స్... అతడిపై మనసు పారేసుకున్న పచ్చళ్ళ పాప
Bigg Boss 9 Telugu Today Episode - Day 39 Review : వైల్డ్ కార్డు ఎంట్రీల అసలు రంగు ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. ఈరోజు దువ్వాడ మాధురి వర్సెస్ రీతూ ఫైట్, పికిల్స్ రమ్య మోక్ష హైలెట్ గా నిలిచారు.

బిగ్ బాస్ డే 39 ఎపిసోడ్ లో నిన్న జరిగిన గొడవతో పాటు లేట్ నైట్ గుసగుసల గురించి హౌస్ మేట్స్ అందరూ కలిసి డిస్కషన్ చేశారు. దువ్వాడ మాధురి "నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నారు. మా హెల్త్ కరాబ్ అవుతుంది. నైట్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే బయటకెళ్ళి మాట్లాడుకోండి" అంటూ ఫైర్ అయ్యింది. "అదేమన్నా బిగ్ బాస్ రూలా?" అని రీతూ అడగ్గానే, మాధురి తీవ్రంగా మండిపడింది. కెప్టెన్ కలగజేసుకుని "మాట్లాడకూడదు అనే రూల్ పెట్టను. కానీ ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చూడండి" అని చెప్పాడు. మరోవైపు రమ్య కోరిన ఫుడ్ మొత్తాన్ని బ్రేక్ ఫాస్ట్ కి పంపారు బిగ్ బాస్. ఇమ్మాన్యుయేల్ - శ్రీనివాస్ ఇద్దరూ కలిసి దువ్వాడ మాధురి గేమ్ గురించి మాట్లాడుకున్నారు. తనూజా - భరణి మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం చేశాడు రామూ. ఇక ఆర్డర్ చేసిన ఫుడ్ ను తినలేక తినలేక తిన్నారు రమ్య - సుమన్ శెట్టి. ఆ తరువాత కూడా పొట్ట ఫుల్ అవ్వడంతో సగంలోనే వదిలేసి "అత్యాశ పడ్డాము. నైట్ కు కొంచెమే ఫుడ్ పంపండి" అంటూ రమ్య బిగ్ బాస్ ను వేడుకుంది. అంతలోనే బిగ్ బాస్ రమ్య - సుమన్ లకు బిర్యానీ పంపి, హౌస్ మేట్స్ ఆకలిని పెంచాడు. చూస్తూ ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయారు.
దివ్యకు భరణి కండిషన్స్
"రీతూ నన్ను నామినేట్ చేశాక ఆమెతో నువ్వు క్లోజ్ గా ఉండడం నాకు నచ్చలేదు" అంటూ భరణి దివ్య దగ్గర ఓపెన్ అయ్యాడు. "హౌస్ లో అందరూ ఒక్కడితోనే ఉంటున్నావ్ అంటూ చావగొడుతున్నారు. అందరిలో వాళ్లేదో కాస్త బెటర్ అని కాసేపు మాట్లాడితే ఇంత అపార్థం చేసుకున్నారా?" అంటూ ట్యాప్ తిప్పేసింది దివ్య. ఆమెను చూసి భరణి కన్నీళ్లు పెట్టుకోవడంతో... "మీరు ఎడవకండి నేను చూడలేను" అంటూ భరణి కన్నీళ్లు తుడిచింది దివ్య.
కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి మాస్ పర్ఫార్మెన్స్
ఫైర్ స్టార్మ్స్ ను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించిన బిగ్ బాస్ మిగతా వాళ్ళలో 5 గురిని సెలెక్ట్ చేసుకోండి అని ఆదేశించారు. దివ్య, భరణి, తనూజా, సంజన, సుమన్ లను సెలెక్ట్ చేసుకున్నారు వైల్డ్ కార్డ్స్. రీతూ ఛాన్స్ ఇవ్వమని అడిగినా, అయేషా కనికరించలేదు. ఫైర్ స్టార్మ్స్, వాళ్ళు ఎంచుకున్న సభ్యులు రెండు టీములుగా మారి, "కెప్టెన్సీ ఎయిమ్" అనే టాస్క్ ఆడారు. ఇందులో మొదటి రౌండ్ లోనే భరణిని, తరువాత వరుసగా దివ్య, సంజన, తనూజాను ఎలిమినేట్ చేసి విన్ అయ్యారు వైల్డ్ కార్స్డ్. సుమన్ శెట్టితో పాటు ఐదుగురు మిగిలారు.
డెమాన్ - రమ్య మోక్ష సీక్రెట్ టాక్
"అవతలి వైపు నుంచి జెన్యూన్ గా రాలేదా ?" అని రమ్యతో సీక్రెట్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు డెమోన్. "చాలా బ్యాడ్ ఉంది. అంతకంటే ఏం చెప్పను. నువ్వు లవ్వులు ఆడానికి రాలేదు. నీ కళ్ళు చూస్తే అర్థం అయ్యింది. ఓవర్ యాక్షన్ చేయకు" అంటూనే ఆటతీరును మార్చుకోమని సలహా ఇచ్చింది రమ్య. "నేను ఆమె గురించి ఏడవను. లవ్ చేయట్లేదు" అని చెప్పాడు. "ఆమె జెన్యునా కాదా నాకు తెలీదు. బయట ఏం జరిగింది అన్నది మాత్రమే చెప్తున్నా" అన్నది రమ్య.
దువ్వాడ మాధురి "నీకు హౌస్ లో ఎవరంటే ఇష్టం అంటే... "పవన్ అంటేనే ఇష్టం" అని చెప్పింది రమ్య. మరోవైపు తనూజతో శ్రీనివాస్ మాట్లాడుతూ "ఆమెకు ముందు నుంచే పవన్ పై ఉంది. క్రష్" అంటూ బాంబ్ పేల్చాడు. డెమోన్, కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్ లను బిగ్ బాస్ గుసగుసలు ఆడొద్దు అని హెచ్చరించారు. "రీతూతో ఉండొద్దు అప్పుడే నేను నీకోసం సేవింగ్ పవర్ ఉపయోగిస్తా అని మాధురి చెప్పారు కదా" అని అడిగింది రీతూ. అలాగైతే వద్దని చెప్పానని క్లారిటీ ఇచ్చాడు డెమోన్. నైట్ ఇమ్మాన్యుయేల్ పై తనూజా అరవడంతో అతను హర్ట్ అయ్యాడు. "మిగతా వాళ్ళతో అయితే బాండ్లు దెబ్బతింటాయి, వీడైతే పడుంటాడు అనుకుంటుందేమో. టైం వచ్చినప్పుడు చెప్తా" అంటూ ఫైర్ అయ్యాడు ఇమ్మూ - రమ్య - నిఖిల్ కలిసి 'అపరిచితుడు' స్పూఫ్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు.




















