Bigg Boss Telugu 9 :తింగరి తనూజ కాదు- స్ట్రాటజీ మాష్టార్- మాధురి, రమ్య, ఆయేషా మైండ్ గేమ్‌కు రివర్స్ అటాక్- తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 షోలో మారుతున్న ఈక్వేషన్స్
Bigg Boss Telugu 9 : వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారి మైండ్ గేమ్‌కు రివర్స్ స్ట్రాటజీతో వెళ్తోంది తనూజ. తన తోటి వారిని కూడా ఆ దిశగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 9 :తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లోకి వైల్డ్‌కార్డుల ఎంట్రీతో గేమ్‌లో చాలా మార్పులు జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్‌లో ఫైర్‌ను తీసుకురావడంలో బిగ్‌బాస్ టీం విజయవంతమైంది. మొన్నటి వరకు ఏదో పిక్‌నిక్ వెళ్లినట్టుగా ఆడారు. గేమ్ చూసి వెళ్లిన దివ్యలాంటి వ్యక్తులు కూడా అప్పటికే హౌస్‌లో ఉన్న వారి ట్రాప్‌లో పడిపోయారు. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా వెళ్లిన వైల్డ్ కార్డు ఎంట్రీతో ఆట అదిరిపోతుంది. ఇప్పటి వరకు వాళ్లు చూసిన ఆటలో ఉన్న లోటు పూడుస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న వారి వీక్‌నెస్‌ను పట్టుకొని ఆడుకోవాలని చూస్తున్నారు. నాలుగు రోజులుగా ఇదే జరుగుతోంది. వీళ్ల మైండ్‌గేమ్ పసిగట్టిన తనూజ రివర్స్ అటాక్ మొదలు పెట్టింది.
వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో మాధురి, రమ్య, ఆయేషా చాలా అగ్రెసివ్‌గా గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్స్‌లో ప్రజల్లో వీక్‌గా ఉన్న వారిని పూర్తిగా పట్టించుకోకుండా వారితో మిస్ బిహేవ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ వారిని డైలమాలో పడేసే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఈ మైండ్ గేమను ఈ ముగ్గురు చాలా క్రూరంగా అమలు చేస్తున్నారు. అందుకే కొందరిపై నోటికి ఎంత వస్తే అంతలా మాట్లాడుతున్నారు. ఇది ప్రేక్షకులకు నచ్చడం లేదు. అలాంటి వారిలో ముందు ఉన్నది మాధురి దివ్వెల. ఈమె చాలా మందికి నచ్చకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఆమె వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఒకటైతే, రెండోది హౌస్‌లో ఆమె బిహేవ్ చేస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంటోంది. రెండో వ్యక్తి రమ్య. ఈమె కూడా రెండు కారణాలతో చాలా మందికి నచ్చడం లేదు. ఒకటి ఆమెకు ఉన్న వివాదాల బ్యాక్‌గ్రౌడ్, రెండోది హౌస్‌లో ఒరిద్దరితో ప్రవర్తిస్తున్న తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. ఆయేషాది పూర్తిగా భిన్నం, చూడటానికి క్యూట్‌గా ఉంటున్నా కొన్నిసార్లు ఆమె చేస్తున్న ఓవరాక్షన్ చిరాకు తెప్పిస్తోంది. కంటెంట్ కోసమే గొడవలు పెట్టుకుంటున్నట్టు ఉంది.
ఈ ముగ్గురు అమలుచేస్తున్న మైండ్ స్ట్రాటజీ అర్థంకాక ఇప్పటి వరకు హౌస్‌మేట్స్ నలిగిపోయారు. తాము ఆడుతున్న తీరుపై ఇంత నెగటివిటీ ఉందా అని ఆశ్చర్యపోయారు. దీనికి తోడు ఒకరిద్దరికి ఈ ముగ్గురు ఇస్తున్న సలహాలు కూడా వారిని డైలమాలో పడేశాయి. అందులో బాండింగ్‌లు లవ్‌ట్రాక్‌లపై జనాల్లో ఉన్న నలుగుతున్న వాదన కొందరకే చెప్పి ఎక్కిస్తున్నారు. అదే విషయాన్ని ఎవరెవరు క్లోజ్‌గా ఉన్నారో వాళ్లకు చెప్పకుండా ఒకరికే సమాచారాన్ని చేరవేస్తున్నారు. దీంతో అవతలి వాళ్లతో కలిసి ఉండలేక, విడిపోలేక బయటకు ఎలా వెళ్తుందో అర్థం కాక జుట్టు పీక్కున్నారు. దీంతో స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా మెంటల్‌గా వీక్ అవుతారని, ఫలితంగా తమది పైచేయి అవుతుందని వైల్డ్ కార్డు ద్వారా వెళ్లిన వాళ్లు భావించారు.
కానీ వీళ్ల గేమ్ ప్లాన్‌ను తింగరిగా కనిపించే తనూజ కనిపెట్టేసింది. అందుకు తగ్గట్గుగానే తమ తోటి వారిని ప్రిపేర్ చేస్తోంది. తనకు క్లోజ్‌గా ఉన్న భరణి, కల్యాణ్, ఇతర సభ్యులతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని నూరిపోస్తోంది. వాళ్లు చెప్పినట్టు బాండింగ్‌లో లేమని నిరూపించుకునేందుకు విడిపోతే జనాల దృష్టిలో మరింత పలుచనైపోతామని సజెస్ట్ చేసింది. ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లు టార్గెటెడ్‌గా గేమ్ ఆడుతుంటే సేమ్ స్ట్రాటజీతో ఎదుర్కోవాలని చెప్పింది. లేకుంటే గేమ్‌ల వెనుకబడతామని సలహా ఇస్తోంది. ఇది అందర్నీ ఇంప్రెస్ చేస్తోంది. సైలెంట్‌గా ఉండే తనూజ ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఎత్తులు వేస్తోందని అంటున్నారు.





















