Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 43 రివ్యూ... రమ్యకు తనూజ ఘాటు రిప్లై... భుజాలు తడుముకున్న దువ్వాడ మాధురి... ఇమ్మూను మోసం చేసిన కళ్యాణ్
Bigg Boss 9 Telugu Today Episode - Day 43 Review . 7వ వారం నామినేషన్లలో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం రివేంజ్ నామినేషన్లతో రచ్చ రచ్చ చేశారు ఇంటి సభ్యులు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే ?

దీపావళి సెలబ్రేషన్స్ తర్వాత మారే లెక్కలతో ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలనే ఆసక్తితో ఉన్నారు ఆడియన్స్. ఇక ఆరోజు రానే వచ్చింది. ఈ సోమవారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. ఆశ్చర్యకరంగా భరణి వెళ్ళిపోగానే తనూజా దివ్య ఇద్దరూ ఒక్కటయ్యారు. ఉదయాన్నే సరికొత్తగా నామినేషన్లు మొదలెట్టారు బిగ్ బాస్. కెప్టెన్లు అయిన సుమన్ శెట్టికి రెడ్ పిల్ లో 'సేవ్ యువర్ సెల్ఫ్', గౌరవ్ గుప్తాకు బ్లూ పిల్ తో 'సేవ్ సమ్ వన్' అనే పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్. అయేషా, ఇమ్మాన్యుయేల్ కు బెలూన్లు పగలగొట్టి నామినేషన్ టికెట్స్ సంపాదించమన్నారు.
రీతూ వర్సెస్ అయేషా
బెలూన్లు అన్నీ పగలగొట్టగా, ఆయేషాకు డైరెక్ట్ నామినేట్ 1, నామినేట్ 1 అని మరో కార్డు దొరికింది. ఇమ్మాన్యుయేల్ కు నామినేట్ 2 అని ఒకటి, నామినేట్ 1 అని మరొ 4 చిట్స్ వచ్చాయి. అయితే వాటిని ఎవరికైనా ఇవ్వొచ్చు. లేదా మీరే అయినా వాడుకోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చారు. శ్రీనివాస్ సాయి ఈసారి ఇమ్యూనిటీని వాడుకోనని చెప్పాడు. కళ్యాణ్, దివ్య, రమ్య, తనూజా, రీతూకి నామినేషన్ల కార్డ్స్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. అయేషా ఒకటి సంజనాకు ఇచ్చింది.
Also Read: భరణి ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే... 6 వారాల్లో నాన్న జేబులో పడింది ఎంతంటే?
"లవ్ కంటెంట్ కోసం వచ్చావు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు. నీ యాటిట్యూడ్, అరోగెన్స్ నాకు నచ్చదు" అంటూ డైరెక్ట్ రీతూ చౌదరిని నామినేట్ చేసింది అయేషా. ఇద్దరి మధ్య ఈ విషయమై రచ్చ జరిగింది. "మనం అవతలి వ్యక్తిని అనడమే కాదు, తీసుకోవాలి కూడా. టూ హైపర్, నిన్న దీపావళి ఎపిసోడ్ లో ఆయన ఒపీనియన్ చెప్తే తీసుకోలేకపోయావ్" అంటూ దివ్య అయేషాని నామినేట్ చేసింది. "మీ ఒపీనియన్ రైట్ అనుకుంటారు. మానిప్యులేట్ చేస్తారు. చెప్పేది వినరు" అంటూ శ్రీనివాస్ సాయిని కూడా నామినేట్ చేసింది.
"ఫస్ట్ గేమ్ ఆడు. తరువాత ఇంకొకరిని అను" అంటూ అయేషాను రివేంజ్ నామినేషన్ చేసింది రీతూ చౌదరి. "గేమ్ లో నువ్వు ఎక్కడా కనిపించట్లేదు. ఫేక్ గేమ్, సింపతీ" అంటూ రాముని నామినేట్ చేసింది రీతూ.
కళ్యాణ్ తో చేతులు వేయించుకుని సమాధానం
రమ్య మోక్ష "నువ్వు గేమ్ ఆడలేదు. ముసుగు దొంగవి. పక్కనోళ్ల గేమ్ చెడగొట్టడానికి వచ్చిన దేవతవి. ఆల్రెడీ ఒకళ్ళను పంపించావు. మరొకరిని పంపడానికి రెడీగా ఉన్నావు" అంటూ తనూజను నామినేట్ చేసింది. "నీ ఏజ్ కి తగ్గట్టు బిహేవ్ చెయ్. నన్ను అర్థం చేసుకోవడానికి కాదు, గేమ్ ఆడదానికి వచ్చావ్. కన్ఫెషన్ రూమ్ లో ఏం అనిపించుకున్నావో నాకు బాగా తెలుసు. ఇది బిగ్ బాస్ లాగా లేదు లవర్స్ పార్క్ లాగా ఉంది అన్నావు. నువ్వు చేసిన బ్యాక్ బిచింగ్ నేను చేయలేను. దేవతనే వచ్చి దర్శనం చేసుకో" అంటూ ఇచ్చిపడేసింది తనూజా. పదే పదే చప్పట్లు కొడుతూ, కళ్యాణ్ తో చేతులు వేయించుకుని విజిల్ వేసి మరీ "నాకు నచ్చింది" అంటూ తిరిగి రమ్యని నామినేట్ చేసి ఇచ్చిపడేసింది. అయితే ఎక్కడా దువ్వాడ మాధురి పేరు రాకపోయినా ఆమె మాత్రం అలెర్ట్ అవుతూ కన్పించింది.
"వెన్నుపోటు పొడిచినా కూడా నేను వదిలేశాను. నాకున్న ఇమ్యూనిటి పవర్ ను చూసి భయపడుతున్నారు. మీవాళ్లను మీరు సపోర్ట్ చేయడం కాదు" అంటూ కళ్యాణ్ ను నామినేట్ చేశాడు సాయి. "వాళ్ళు మోసం చేశారంటే అది వాళ్ళ గేమ్. నేను నమ్మాను కాబట్టి నాది ఎంతోకొంత తప్పు ఉంది. రియలైజ్ కావడం ముఖ్యం. పాయింట్ లెస్ నామినేషన్" అంటూ కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్నారు.
ఇక కళ్యాణ్ జెన్యూన్ గా లేరంటూ సంజనను నామినేట్ చేశాడు. "నాకు కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారు. వాళ్ళలో నీకు ఎవ్వరో నచ్చలేదు. తనూజా అనే సెలబ్రిటీ చుట్టూ తిరగడమే తప్ప ఏం చేశావ్ నువ్వు?" అంటూ మండిపడింది సంజన. "తనూజను నామినేట్ చేస్తానని చెప్పి, సంజనను నామినేట్ చేసి మోసం చేశావ్" అంటూ ఇమ్మాన్యుయేల్ ఫైర్ అయ్యాడు. "ఆల్రెడీ తనూజాపై పాయింట్స్ వచ్చాయి కాబట్టి సంజనాను నామినేట్ చేశాను" అని సమాధానం ఇచ్చాడు కళ్యాణ్.
"లీడర్ బోర్డు నుంచి ఫ్లోరాను తీసేశావు. నీవల్ల భరణి గారు వెళ్ళిపోయారు. నువ్వు వచ్చాక నేను దూరం అయ్యాను" అంటూ దివ్యను నామినేట్ చేసింది సంజన. "నామినేషన్ లోకి లాగుదాం అని ఇలా చేశారు. రాముని నామినేట్ చేస్తానని మీరు ముందు అన్నారు" అంటూ వాదించింది దివ్య. కెప్టెన్ గౌరవ్ 'సేవ్ సమ్ వన్' పవర్ ను ఉపయోగించి, అయేషాను సేవ్ చేశాడు. రీతూ, సాయి, రామ్, తనూజా, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్య ఈవారం నామినేట్ అయ్యారు.






















