IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Guppedantha Manasu జనవరి 12 ఎపిసోడ్: కాకిఎంగిలి చేసిన చాక్లెట్ వసుతో షేర్ చేసుకున్న రిషి, ఐ యామ్ వెరీ హ్యాపీ అంటూ రోడ్డుపై అరుపులు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్...

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. గౌతమ్ ఇవ్వాలనుకున్న, జగతి చించేసిన ప్రేమలేఖ.. చాలా బావుందని వసుధార చెప్పడంతో రిషి గాల్లో తేలిపోతున్నాడు. జనవరి 12 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

FOLLOW US: 

గుప్పెడంత మనసు జనవరి 12 బుధవారం ఎపిసోడ్

జగతి ఇంట్లో సీన్ ఓపెన్ అయింది..
రిషి నీకు ఏమైనా చెప్పాడా అన్న జగతితో...ఏమీ చెప్పలేదంటాడు మహేంద్ర. వసుధారకి లవ్ లెటర్ రాశారని అంటే.. అంత ధైర్యం ఎవరికి ఉంటుందంటాడు మహేంద్ర. వసుధారకి ప్రమలేఖ చూసి రిషి బాధపడతాడు అని జగతి అంటే..రిషికి ఎందుకు బాధ రాసినవాడెవడో వాడికి ఉంటుందని చెబుతాడు. రిషి వెనుక ఏదో జరుగుతోందని అన్న జగతితో..ఈ ప్రేమ లేఖ ఏదో రిషి రాసి ఉంటే బావుండేది అనుకుంటారిద్దరూ. అది జరిగే పనేనా అంటే..జరిగితే బావుండును అనుకుంటారు. కానీ ఆ చేతిరాత ఎక్కడో చూశాను అనిపిస్తోంది అని జగతి అంటే..అంతమంది స్టూడెంట్స్ చేతిరాత తెలుసుకదా చూసే ఉంటావులే అని సమాధానమిస్తాడు మహేంద్ర. రిషి ఎలా తీసుకుంటాడో అని ఆలోచిస్తున్నా అంటుంది జగతి..

Also Read: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
చిరాగ్గా ఇంట్లోకి వెళ్లిన గౌతమ్..లెటర్ పడిపోవడం ఏంటి నేనో ఫూల్ ని మంచి అవకాశం మిస్ చేసుకున్నా అనుకుంటాడు. ఎదురుగా దేవయాని కనిపించి..నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావ్ అంటే.. ఆత్మవిమర్శ అంటాడు. రిషి ఎక్కడ అని అడిగితే..ఏమో తెలియదు అంటాడు. గౌతమ్ నిన్నొక మాట అడగాలి అన్న దేవయాని... ఇప్పుడు కాదులే సమయం వచ్చినప్పుడు అడుగుతా అంటుంది. రిషి-వసుధారకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడంలో గౌతమ్ ని వాడుకోవచ్చా..రిషికి చెప్పకుండా ఎంతవరకూ సమాచారం ఇవ్వగలడు..ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అనుకుంటుంది దేవయాని. ఆపరేషన్ ప్రేమలేఖ ఫెయిలైంది..ఆ ప్రేమ లేఖ వసుకి నేనిస్తే ఎంత బావుండేదో... చూడబోతే వసుధార ప్రేమలేఖ విషయంలో పాజిటివ్ గా ఉన్నట్టుంది.. ఇది చాలు అనుకుంటాడు గౌతమ్.

Also Read:  ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
వసుధార ఎందుకు రమ్మంది..ఆ ప్రేమలేఖలో హ్యాండ్ రైటింగ్ కనిపెట్టేసిందా అనుకున్న రిషి..ఎందుకు రమ్మన్నావ్ అని అడుగుతాడు. ప్రేమలేఖ అని నసుగుతున్న వసుని చూసి.. ఒరేయ్ గౌతమ్ గా నువ్వు నన్ను టెన్షన్ పెట్టేందుకే వచ్చావురా అనుకుంటాడు. ఆ ప్రేమలేఖ ఎవరు రాశిఉంటారు సార్ అన్న వసుతో.. ఇప్పుడా టాపిక్ అవసరమా అంటాడు. చాలా బాగా రాశార్ కదా సార్ అన్న వసు మాటలు విని షాక్ అవుతాడు రిషి. ఒక్క పదం కూడా చెడుగా లేదు చాలా పద్ధతిగా రాశారు అన్న వసుధార మాటలు విని... నవ్వాలో-ఏడవాలో తెలియని పరిస్థితి అంటే ఇదేనేమో అనుకుంటూ నీకు కోపం రాలేదా అని ప్రశ్నిస్తాడు. జీవితంలో అన్నీ నెగిటివ్ గా తీసుకుంటే ఎలా..ఆ అక్షరాలు , మాటలు అన్నీ...నా జీవితాన్ని బాగా చూసిన వ్యక్తే రాశి ఉంటాడని పిస్తోంది ... రాసింది ఎవరో తెలుసుకోవాలి సార్ అంటుంది  వసు. ఏం చేస్తావ్ ఏంటి అని రిషి అడిగితే..ఎందుకో తనని చూడాలని ఉంది సార్..తనపై కోపం రావడం లేదు..ఏంటో నాకే అర్థం కావడం లేదు ... ఒకవేళ ఆ లెటర్ డైరెక్ట్ గా ఇచ్చి ఉంటే వాడి ప్రేమని నువ్వు ఒప్పుకునే దానివా అంటాడు ( గౌతమ్ ఇవ్వకపోవడం మంచదైంది..మేడం చించేసి మంచి పని చేశారు అనుకుంటాడు రిషి). ప్రేమలేఖ రాసిన విధానం, ఆభావం నచ్చాయి..అంతే కానీ..లెటర్ ఇవ్వగానే ఒప్పుకోవడం ఏంటి..ఆ లేఖ బాగా నచ్చింది రాసిన వాళ్లెవరో ఒక్కసారి చూడాలని ఉంది అంటుంది వసు. 

Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
ప్రేమలేఖ రాసిన వాడు దొరుకుతాడన్న నమ్మకం నాకైతే లేదని చెప్పిన రిషి.. నీలో గొప్ప లక్షణాలు ఉన్నాయి... ప్రేమలేఖ రాసినందుకు కోప్పడకుండా రాసిన విధానం బావుందనడం బావుందంటాడు. స్పందించిన వసుధార చిన్న చిరునవ్వుతో ఎన్నో సమస్యలని దాటుకుంటూ వెళ్లిపోవచ్చు కదా అంటుంది. జేబులోంచి చాక్లెట్ తీసి వసుకి ఇస్తాడు...అది చూసి మీరు చాక్లెట్స్ కొంటున్నారా అంటే..ఏదో కొంటే చిల్లర లేదని ఇచ్చారులే అంటాడు రిషి. నాకు మొదటి ప్రేమ లేఖ వచ్చినందుకు పార్టీ అనుకుంటా అని తీసుకుని షేర్ చేసుకుందాం అంటుంది. ఎప్పుడూ నువ్వేనా ఈసారి కాకి ఎంగిలి నా వంతు అంటూ కశ్చీఫ్ లో పెట్టి ఓ ముక్క చేసి వసుకి ఇస్తాడు. కలసి తిరుగుతున్నాం కదా..ఆ మాత్రం అలవాట్లు రాకుండా ఉంటాయా అని సెటైర్ వేస్తాడు రిషి. ఇప్పుడా ప్రేమలేఖ వసుధారకి ఇవ్వాలని చూసిన గౌతమ్ ని తిట్టాలా-మెచ్చుకోవాలో అర్థంకావడం లేదు..మొత్తానికి వసుకి నేను రాసిన ప్రేమ లేఖ నచ్చింది అనుకుంటూ వసుని చూస్తూ ఉండిపోతాడు. 

Also Read: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
రిషి..ఎక్కడ తిరుగుతున్నావు రా..మీ పెద్దమ్మ రిషిని పట్టించుకోవు అంటుంది, మీ అమ్మ ఏమో రిషి గురించి ఆలోచించవు అంటుంది..నన్ను ఏం చేయమంటావ్... జగతి అన్నట్టు రిషి మనసులో వసు ఆలోచనలు పెరుగుతున్నాయా ఏంటో అనుకుంటాడు మహేంద్ర. కట్ చేస్తే కార్లో కూర్చున్న వసుధార... రిషి కాకి ఎంగిలి గుర్తుచేసుకుని నవ్వుకుంటుంది. ఏంటో చెప్పు అంటే ఏమీలేదని చెప్పిన వసు..చాక్లెట్ ని తెలుగులో ఏమంటారో తెలుసా అంటే ఏమో అన్న రిషితో..మిఠాయి అంటారని చెబుతుంది. ఇంతలో గౌతమ్ కి కాల్ చేసిన మహేంద్ర ఎక్కడున్నావ్ అంటే ఇంటికొస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు. జగతి ఇంటి దగ్గర దిగిన వసుధార గుడ్ నైట్ చెబుతుంది...మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో భాగంగా స్లమ్ ఏరియాలకు వెళ్లాలి..షార్ట్ ఫిలిం వర్క్ ప్రారంభమైతే మనం బిజీ అయిపోతాం కదా అంటాడు. వెళిపోతూ వెనక్కి తిరిగి బై చెబుతుంది. వసు డోర్ కొట్టే సమయానికి డోర్ తీసిన జగతి.. వసు చిరునవ్వు నవ్విందంటే ఈ రోజు వీళ్ల మధ్య గొడవలు లేవన్నమాట అనుకుంటుంది జగతి. మరోవైపు కారులో వెళుతున్న రిషి..ప్రేమలేఖ బాగా రాశారు కదా సార్ అన్న వసుమాటలు గుర్తుచేసుకుని కారు పక్కన ఆపి రోడ్డుపై నిల్చుని ఆ ప్రేమలేఖ రాసింది నేనే.. ఐ యామ్ సో హ్యాపీ అని అరుస్తాడు. గౌతమ్ నువ్వు వెధవ పని చేసినా నాకు బాగా ఉపయోగపడిందిరా అనుకుంటాడు.. ఎపిసోడ్ ముగిసింది...

Also Read:  ఐ లవ్ వసుధార అనేసిన గౌతమ్..షాక్ లో రిషి.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
వసుధార అర్జెంటుగా రా.. మా ఇంటికి వచ్చేసెయ్ అంటాడు రిషి. ఎక్కడికైనా వెళ్లాలా అని అడుగుతాడు ఫణీంద్ర... ఒకరికోసం వెయిట్ చేస్తున్నా పెదనాన్న అంటాడు. ఇంతకీ ఎవరికోసం అని దేవయాని అడగడం ..అప్పుడే వసుధార ఎంట్రీ ఇవ్వడం..మహేంద్ర షాక్ అవడం.. రేపటి ఎపిసోడ్ లో దేవయానికి పెద్ద షాక్ తగిలేట్టుంది...

Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Jan 2022 09:49 AM (IST) Tags: Mukesh Gowda గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Sai Kiran Guppedantha Manasu Episode serial Guppedantha Manasu January 12th Episode Raksha Gowda

సంబంధిత కథనాలు

Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

Dhanush: తన తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వృద్ధ దంపతులకు నోటీసులు పంపిన ధనుష్

Dhanush: తన తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వృద్ధ దంపతులకు నోటీసులు పంపిన ధనుష్

Keerthi Suresh: మహేష్ బాబుని బూతు తిట్టడానికి కీర్తి పడ్డ కష్టాలు!

Keerthi Suresh: మహేష్ బాబుని బూతు తిట్టడానికి కీర్తి పడ్డ కష్టాలు!

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ఘోర ప్రమాదాలు - నేడు 11 మంది అక్కడికక్కడే దుర్మరణం

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ఘోర ప్రమాదాలు - నేడు 11 మంది అక్కడికక్కడే దుర్మరణం

CM KCR: నేడు చండీగఢ్‌కు సీఎం కేసీఆర్, వెంట ఢిల్లీ సీఎం కూడా - పర్యటన పూర్తి వివరాలివీ

CM KCR: నేడు చండీగఢ్‌కు సీఎం కేసీఆర్, వెంట ఢిల్లీ సీఎం కూడా - పర్యటన పూర్తి వివరాలివీ

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Breaking News Live Updates: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

Breaking News Live Updates: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం