IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Karthika Deepam జనవరి 12 ఎపిసోడ్: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 12 బుధవారం 1247 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం జనవరి 12 బుధవారం ఎపిసోడ్

సౌందర్య ఇంట్లో సీన్ ఓపెన్ అయింది. కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన శ్రావ్యతో... మమ్మీ వాళ్లు లేచారా, కాఫీ ఇచ్చావా అని అడిగి..లేరు కదా అని బాధపడతాడు ఆదిత్య. ఒకప్పుడు ఆనందంగా అందరి కళ్లూ కుట్టేలా ఉన్న మనం ఇలా అయిపోయాం ... సునామీ వచ్చి చెల్లాచెదురైనట్టు తలో దిక్కు అయిపోయాం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.  ఇంటినిండా జ్ఞాపకాలున్నాయి కానీ మనుషులే లేరు.. ఏం చేయాలో అర్థంకావడం లేదన్న ఆదిత్యతో.. బాధపడొద్దు ఆదిత్య అంతా సర్దుకుంటుందని చెబుతుంది శ్రావ్య. 

Also Read: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
తాడికొండలో మోనిత:  ప్రియమణి వెళ్లిపోయినప్పటి నుంచీ కనీసం ఫోన్ చేయలేదు..మీ కార్తీకయ్య పార్టీలో చేరావా..దీపమీద నీకు అభిమానం కదా..నిన్ను కూడా పట్టుకుంటాను అని అందర్నీ ఆరాతీస్తుంది. ఇంతలో దీప బాబుని తీసుకుని అటువైపు వస్తుంది. అమ్మ దగ్గర్లో ఉందని బాబుకి అనిపిస్తుందో ఏమో..మోనితని సమీపంలోకి వెళ్లగానే ఏడుపు మొదలెడతాడు. ఎవరో పిల్లాడు ఏడుస్తున్నాడు...నా ఆనందరావు కూడా ఇలానే ఏడ్చేవాడు..ఎవరో ఆ తల్లి..ఇంత ఏడుస్తున్నా పట్టించుకోవడం లేదేంటని బాబుని వెతుకుతూ వెళుతుంది. ఎవరో ఏడుస్తుంటే ఇంత బాధగా అనిపించిందేంటి నాకు నా ఆనందరావు ఎక్కడున్నాడో ఏంటో..ఆకలేస్తుంది ఇక్కడేదైనా హోటల్ ఉందో లేదో అనుకుంటుంది మోనిత. 

Also Read: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
బొంబాయి హోటల్లో: హోటల్లో సర్వర్ గా చేరిన కార్తీక్...డాక్టర్ గా తనకు జరిగిన సన్మానాలు గుర్తుచేసుకుంటాడు. ప్లేట్లు క్లీన్ చేయి  హోటల్ నీటిగా ఉండాలి కదా అన్న యజమాని...ఏం చదువుకున్నావ్ అని అడుగుతాడు.... సిగ్గుపడుతున్నావా ఈ పని చేయడానికి అంటాడు. పెద్దింటోడిలా కనిపిస్తున్నావ్ అని అంటే రేపటి నుంచి అలా కనిపించను అంటాడు కార్తీక్. ఆకలి అవసరం ఏదైనా నేర్పిస్తుందని అన్న కార్తీక్ తో... చూడబోతే నీకు తెలివితేటలతో పాటూ పౌరుషం కూడా బాగానే ఉన్నట్టుంది అనుకుంటాడు. మీది ఏ ఊరు అంటే విజయనగరం అని చెబుతాడు కార్తీక్. కొన్ని పార్సిళ్లు తీసుకెళ్లి ఇవ్వాలని కార్తీక్ తో చెప్పిన హోటల్ యజమాని మోటర్ సైకిల్ పై కాదు...సైకిల్ పై వెళ్లాలని చెబుతాడు. దీనంగా మొహంపెట్టిన కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Also Read:  వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
దీప: చీటీ కావాలని దీప అడిగితే..ఏం చూసి నీకివ్వాలని అడుగుతుంది. పిండి వంటలు చేసి అమ్ముతానంటున్నావు నికరంగా ఆదాయం వస్తుందా అంటే.. చెప్పిన డేట్ కే చీటీ కట్టేస్తాను అంటుంది దీప. అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పావ్ కదా అక్కడే పడిపోయా అంటుంది ఓ మహిళ. సాయం చేస్తానని చెప్పి దీపని పంపించేసిన బంగారమ్మ అనే మహిళ... దీప వెళ్లగనే రుద్రాణికి కాల్ చేసి ఏం చేయమంటావ్ అని అడుగుతుంది. ముందు ఓ చీటీ రాయించు..ఏం చేయాలో చెబుతాను అంటుంది. కట్ చేస్తే హోటల్లో సర్వ్ చేస్తున్న కార్తీక్ ను చూసి మనోడు పనిమంతుడే అనుకుంటాడు హోటల్ యజమాని. కార్తీక్ లోపలకు వెళుతుండగా అక్కడకు మోనిత ఎంట్రీ ఇస్తుంది. 

Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
సౌందర్య: కట్ చేస్తే ప్రకృతి వైద్యశాలలో కూర్చున్న సౌందర్య... అన్నీ ఉన్నా కార్తీక్-దీప ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు, మేం ప్రకృతి ఆశ్రమానికి రావాల్సి వచ్చింది..ఆదిత్య-శ్రావ్య ఒంటరైపోయారు... ఇంతకీ కార్తీక్ ని వెతికేందుకు పంపించిన మహేశ్ ఏం చేస్తున్నాడని గుర్తుచేసుకుని ఆ బిచ్చగాడికి కాల్ చేస్తుంది సౌందర్య. అన్ని ఊర్లూ వెతుకుతున్నా మేడం ఆచూకీ తెలియలేదు అంటాడు. నీకు కావాలంటే ఎక్కువ డబ్బులిస్తాను శ్రద్ధగా వెతుకు అని చెప్పిన సౌందర్యతో...పనయ్యాక వచ్చి డబ్బులు తీసుకుంటా అంటాడు. మేం ఇంట్లో లేం..తాడికొండ ప్రకృతి వైద్యశాలలో ఉన్నామని చెబుతుంది. ఆ ఊరంతా వెతికాను అని చెబుతాడు.

Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
హోటల్లో: నేను నీకు సీనియర్ ని నా పేరు అప్పారావు, కొందరు అప్పు అంటారు మరికొందరు అనగానే..అప్పిగా అంటారా అంటాడు కార్తీక్. నువ్వు నన్ను అప్పిగా అని పిలవొచ్చు..నేను నిన్ను బావా అంటా అంటాడు. ఇంతలో హోటల్ యజమాని ఒరే అప్పిగా కస్టమర్స్ వచ్చారు చూసుకో అంటాడు. జూనియర్స్ ముందు అంటూ కార్తీక్ ని పంపించబోయి..ఆగు నేను వెళతాను అంటాడు. మోనితని చూసి సినిమా హీరోయిన్ లా ఉంది..అర్జెంట్ గా విగ్గు కొనుక్కోవాలి అనుకుంటూ వెళ్లి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది మేడం అనగానే..షూటింగ్ ఏంటి అన్న మోనితతో... కామెడీ నా అంటుంది. ఏం తింటారు మేడం అని అడిగి లిస్ట్ చెబుతాడు. ఆ వాయిస్ విని మోనిత వాయిస్ లా ఉందే అనుకున్న కార్తీక్..ఇక్కడికి ఎందుకొస్తుందని అనుకుంటాడు..కానీ డౌట్ తీరక వెళ్లి చూసి షాకవుతాడు. ఎపిసోడ్ ముగిసింది...

Also Read: ఐ లవ్ వసుధార అనేసిన గౌతమ్..షాక్ లో రిషి.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో 
ఆ రుద్రాణి మంచిది కాదు..వచ్చేనెల ఆ రుద్రాణి పుట్టిన రోజు..ఆ రోజు పిల్లలకు బట్టలు కుట్టమని నాకు కొలతలు ఇచ్చిందని ఓ మహిళ దీపకు చెబుతుంది. బయట నీ పిల్లల బట్టలు ఆరేస్తే వాళ్ల మనిషొచ్చి అవి ఎత్తుకెళ్లాడంట..నీ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతోందని నా అనుమానం అని చెబుతుంది. మరోవైపు రుద్రాణి వచ్చి సోఫాలో కూర్చోగానే ఎదురుగా వంట చేస్తూ దీప కనిపించడంతో షాక్ అవుతుంది రుద్రాణి....

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Jan 2022 09:01 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam Written Update Future story of Karthika Deepam Nirupam Paritala as Karthik Premi Viswanath as Deepa Shobha Shetty as Monitha Bhavana Reddy as Rudraani. Written UpdateKarthika Deepam 12th January 2022

సంబంధిత కథనాలు

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..

Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!

Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!

Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే

Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే

Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?