Guppedantha Manasu జనవరి 8 ఎపిసోడ్: ఐ లవ్ వసుధార అనేసిన గౌతమ్..షాక్ లో రిషి.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకీ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తన మనసులో మాట బయటపెట్టకుండా గౌతమ్ దూకుడుకి కళ్లెం వేస్తున్నాడు రిషి. శనివారం జనవరి 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

FOLLOW US: 

గుప్పెడంతమనసు జనవరి 8 శనివారం ఎపిసోడ్

గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్ లో అంతా ఒకే చోటుకి చేరడంతో ముగిసింది...శనివారం అదే సీన్ తో ప్రారంభమైంది. రిషిగాడికి దొరికేశా అనుకుంటూ అక్కడకు వెళ్లిన గౌతమ్ ఇబ్బందిగా అందర్నీ పలకరిస్తాడు. నా కార్లో వచ్చి సగం దారిలో దిగిపోయావు అని మహేంద్ర అనగానే.. ఆపని అవలేదంటాడు. నువ్వెందుకు వచ్చావ్ అంటే నువ్వెందుకు వచ్చావ్ అని గౌతమ్-రిషి అనుకుంటారు. ఈ రోజు పెండింగ్ లో ఉన్న మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ చేయాలి మనం అని రిషి అనగానే.. కాఫీ తెమ్మని జగతి అనడంతో..ఏం వద్దు అంటాడు రిషి. అంకుల్ మీరేంటి ఇలా వచ్చారని గౌతమ్ అడగడంతో అంతా మొహాలు చూసుకుంటారు...పైగా నాలాగే చనువుగా మిర్చి బజ్జీ పకోడి అంటున్నారని అన్న గౌతమ్..మేడం-మీరు క్లాస్ మేట్స్ అనుకుంటా అందుకే ఇంత ఫ్రీగా ఉంటున్నారని అంటాడు. అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు అని గౌతమ్ ని రిషి అడుగుతాడు..నువ్వెందుకు వచ్చావని రివర్స్ లో అడిగితే మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కోసం అని రిషి చెప్పడంతో నేను కూడా అందుకే వచ్చా అంటాడు గౌతమ్. ఏంటీ నమ్మడం లేదా అంటూ జేబులోంచి పెన్ డ్రైవ్ తీసి ఇస్తాడు. అందరం కలిసాం కదా అలా వెళ్లి స్నాక్స్ తిందాం అన్న గౌతమ్ తో... ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ లేవు తమరు వెళ్లొచ్చు అంటూ మహేంద్ర కార్ కీ  గౌతమ్ కి ఇచ్చి పంపించేస్తాడు రిషి. 

Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
ఓ గ్రౌండ్ లో కార్ ఆపిన రిషి.. తండ్రిని కిందకు దిగమని అడుగుతాడు. సారీ డాడ్ అనడంతో..నువ్వెందుకు సారీ చెబుతున్నావ్ అని అడుగుతాడు మహేంద్ర. గౌతమ్ ఏదో అన్నాడని నేను ఫీలవుతున్నా అని నువ్వు ఫీలవుతున్నావా అంటాడు. గౌతమ్ కి మీ గురించి పూర్తిగా తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు..అలాంటి సందర్భం మీరు ఎదుర్కోవడం నాకు బాధకలిగించిందని రిషి అంటే..అక్కడకు నేను రావాల్సింది కాదేమో అంటాడు మహేంద్ర. మీరు ప్రపంచంలో నాకు తప్ప ఎవ్వరికి సారీ చెప్పినా బాధపడతాను..అలా అని నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు..నా జీవితంలో మీరే నా హీరో..మీరు ఏ తప్పూ చేయలేదు..మీరు ఎక్కడా తలదించుకోవాల్సిన అవసరం లేదు..దేనికీ బాధపడాల్సిన పనిలేదు.. మీకెప్పటికీ నేను రక్షణగా ఉంటాను మిమ్మల్ని ఎవరైనా ఒక్కమాట అనాలంటే నన్ను దాటి వెళ్లాల్సిందే అని ఏమోషనల్ అవుతాడు రిషి. మీ మనసుకి నచ్చింది మీరు చేయండి..మీరేం చేసినా యూ ఆర్ మై హీరో అని తన మాటలతో కదిలిస్తాడు రిషి. 

Also Read: ఒక చోటుకి చేరిన ప్రేమ పక్షులు, మహేంద్రపై గౌతమ్ ప్రశ్నకు సమాధానం ఏంటి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
ఇంటి ముందు కూర్చుని ఆలోచనలో పడిన వసుధార దగ్గరకు వచ్చిన జగతి.. రిషి కోపం బావుంటుందా-సహనం బావుంటుందా అని అడుగుతుంది. మేడం రిషి సర్ సహనమే బావుంటుందని వసు అంటే.. నాకు కోపమే బావుందేమో అనిపించింది వసు అంటుంది జగతి. రిషి...రిషిలా ఉంటేనే బావుంటుంది..తన కోపాన్ని అదుపులో పెట్టుకుని మహేంద్రకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని రిషి పడిన ఆరాటం నేను చూశాను..తల్లిగా నా మనసుకి చాలా బాధేసింది..నిజమైన కష్టం అంటే మనం కష్టాలు పడడం కాదు..మనకు ఇష్టమైన వాళ్ల మనకోసం కష్టపడుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోతాం చూడు అదే కష్టం... చాలా సార్లు అనిపిస్తుంది వసుధార..రిషికి నాపై కోపం ఉండడంలో తప్పులేదని..తన ద్వేషంలో న్యాయం ఉంది..వాడి కోపంలో నిజం ఉంది.. వాడు మా ఇద్దరి గురించి గౌతమ్ కి తెలియకూడదని పడే తపన చూసి బాధేసింది...వాడి బాల్యాన్ని అందంగా మార్చలేకపోయాను..భవిష్యత్ లో కొంతైనా ఆనందాన్ని ఇవ్వగలిగితే చాలని చూస్తున్నా అనేసి జగతి అక్కడి నుంచి లేచెళ్లిపోతుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది మేడం అంటుంది వసుధార. 

Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
రిషి గీసిన వసుధార బొమ్మ ముందు కూర్చుని చూస్తుంటాడు గౌతమ్. ఏరా ఇంకా పడుకోలేదా అని ఎంట్రీ ఇచ్చిన రిషిని చూసి...నువ్వెందుకురా నన్ను వెంటాడుతున్నావ్ అంటాడు. పరిగెడుతున్న నా కాళ్లకు కాళ్లు అడ్డంపెట్టి ఆపేస్తున్నావ్ కదా అంటాడు గౌతమ్. సాధ్యమైతే నాకు హెల్ప్ చేయి..కానీ..ఇలా అడ్డుపడడం బాలేదని బాధపడతాడు గౌతమ్. నువ్వు నా ఫ్రెండ్ వి దేనికి సపోర్ట్ చేయాలో నాకు తెలుసు అంటాడు రిషి. ఏంటో నీ కోపాన్ని తట్టుకోలేను, నీ ప్రేమను భరించలేను..అందుకే ఓ పని చేస్తా అంటాడు. ఏం పని కూడా అడగవేంట్రా అని రిషి వైపు చూస్తుంటే..చెబితే చెప్పు లేదంటే లేదు అనేసి వెళ్లిపోతాడు రిషి. నా ప్రేమకి అందరూ విలన్స్ లా తయారయ్యారని వసు ఫొటో చూస్తూ మాట్లాడతాడు గౌతమ్. నా మనుసులో నువ్వుండగా నీ కళ్లు నేను గీయలేకపోయాను.. మరి రిషి ఇంత అందంగా ఎలా గీయగలిగాడు అనుకుంటాడు గౌతమ్.

రేపటి ఎపిసోడ్ లో
కాలేజీ మెట్ల దగ్గరున్నా అని మెసేజ్ చేసిన వసు దగ్గరకి వెళతాడు రిషి. సార్ నాకు చాక్లెట్ తినాలని ఉందంటుంది. నేనేం చేయాలని అడిగుతాడు రిషి. మీరు తిన్నాక తిందామని అనుకుంటున్నా అంటుంది. నేను వసుధారని ప్రేమిస్తున్నాను అని ఓపెన్ అయిపోతాడు గౌతమ్..షాక్ లో ఉన్నాడు రిషి...

Also Read: వసుధారపై ప్రేమను బయటపెట్టే ప్రయత్నాల్లో రిషి, మరి గౌతమ్ సంగతేంటి..గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
Also Read: రుద్రాణికి షాక్ ఇచ్చిన దీప..తాడికొండలో సౌందర్య ఎంట్రీ ఉండబోతోందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Jan 2022 09:18 AM (IST) Tags: Mukesh Gowda గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Sai Kiran Guppedantha Manasu Episode serial Guppedantha Manasu January 8th Episode Raksha Gowda

సంబంధిత కథనాలు

Anasuya: 'జబర్దస్త్' వదిలేసిన అనసూయ - ఆ స్టార్ డైరెక్టరే కారణమా?

Anasuya: 'జబర్దస్త్' వదిలేసిన అనసూయ - ఆ స్టార్ డైరెక్టరే కారణమా?

Malayalam Actor Sreejith: లైంగిక వేధింపుల కేసు- ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవి అరెస్ట్

Malayalam Actor Sreejith: లైంగిక వేధింపుల కేసు- ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవి అరెస్ట్

Thor Love and Thunder Review: థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?

Thor Love and Thunder Review: థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్?

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్?

Producer Gorantla Rajendra Prasad: టాలీవుడ్‌లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూత

Producer Gorantla Rajendra Prasad: టాలీవుడ్‌లో మరో విషాదం,  ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూత

టాప్ స్టోరీస్

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!

Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!