News
News
X

Karthika Deepam జనవరి 7 ఎపిసోడ్: రుద్రాణికి షాక్ ఇచ్చిన దీప..తాడికొండలో సౌందర్య ఎంట్రీ ఉండబోతోందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 6 గురువారం 1243 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం జనవరి 7 శుక్రవారం ఎపిసోడ్

సౌందర్య ఇంట్లో
ఆనందరావుని చెక్ చేసిన డాక్టర్ భారతి.. కార్తీక్ వాళ్లు లేనందుకు బాధపడుతున్నారు కానీ అంతకుమించి ఎలాంటి సమస్య లేదంటుంది. అంకుల్ డిప్రెషన్లోకి వెళుతున్నారు జాగ్రత్త అంటుంది భారతి. ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు ఎక్కువ సమయం ఒంటరిగానే ఉంటున్నారని చెబుతుంది సౌందర్య. దీంతో ఏదో సలహా ఇచ్చి అక్కడనుంచి వెళ్లిపోతుంది భారతి. కట్ చేస్తే తాడికొండలో ఉన్న డాక్టర్ బాబు..దీప చేసిన పిండివంటలు ప్యాకింగ్ చేస్తుంటాడు. ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారని అడిగితే.. సోమరిలా కూర్చుని తింటున్నా నాకేదోలా ఉందంటాడు కార్తీక్. డాక్టర్ కార్తీక్ అంటూ అంతా పొగుడుతున్న విషయం గుర్తుచేసుకున్న దీప..మీరు ఎంతో మందికి ప్రాణం పోసిన వైద్యుడు అంటుంది. నువ్వు నన్ను సోమరిని చేయొద్దన్న కార్తీక్ తో... రాజు ఎప్పుడూ సేవకులతో పని చేయిస్తాడు పని చేయడు అంటుంది దీప. 

Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
మోనిత
వంటలక్క ప్రజా వైద్యశాలలో కూర్చున్న మోనిత.. సౌందర్య ఆంటీ మీకు తెలివి తేటలు ఎక్కువని తెలుసు కానీ ఇంత ఎక్కువ అని తెలియదు అనుకుంటుంది. ఫోన్ దొరికిన బిచ్చగాడు మహేశ్ ని పిలిపించి వాడికి డబ్బులిచ్చి రహస్యంగా వెతికిస్తారా..మీరెన్ని గేమ్ లు ఆడినా చివరకు విజయం నాదే..మోనితని తక్కువ అంచనా వేస్తున్నారు కదా.. కానీ నా గేమ్ నేను ఎప్పుడో సెట్ చేసి పెట్టుకున్నా ఆంటీ అంటుంది. ఇంతలో ఫోన్ రింగవుతుంది.. ఓ కొత్త క్యారెక్టర్ ఎంటరైంది. హలో మేడం నేను విన్నీని మాట్లాడుతున్నా అంటూ అడ్రస్ చెప్పమని అడుగుతుంది. బస్తీ వాసులు నాకు వార్నింగ్ ఇస్తారా..వన్నీ వస్తోంది ఆగండి అనుకుంటుంది. 

Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
కార్తీక్
బ్యాగ్రౌండ్ లో కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది.. కార్తీక్ నువ్వు పేషెంట్ ని చంపేశావ్ అనే మాటల నుంచి రుద్రాణి బెదిరింపుల వరకూ అన్నీ గుర్తుచేసుకుని రోడ్డుపై గట్టిగా అరుస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప..ఏమైంది మీకు అని తీసుకెళ్లి ఓ దగ్గర కూర్చోబెడుతుంది. ఏదో ఆలోచిస్తూ ఒకదానికొకటి అనుకుంటూ మనసు పాడుచేసుకోవద్దని చెబుతుంది. నాకు భయంగా ఉంది, పిచ్చిపట్టేలా ఉందంటాడు కార్తీక్. జీవితంలో ఏం పోగొట్టుకున్నా జీవితాన్ని పోగొట్టుకోకూడదంటుంది. మనకు అన్నీ ఉన్నాయ్..డబ్బు లేదంతే అని చెప్పి పిల్లలకు బాక్స ఇచ్చి రమ్మని పంపిస్తుంది. 

Also Read: మోనిత కొడుకుపై ప్రేమ పెంచుకుంటున్న డాక్టర్ బాబు, వంటలక్క.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
ఇంట్లో కూర్చుని పిల్లల్ని తలుచుకుని సౌందర్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ఆదిత్య, శ్రావ్య..డాడీ కనిపించడం లేదంటాడు. వాకింగ్ చేస్తున్నాడు అంటే..ఈ టైమ్ లోనా అంటాడు ఆదిత్య. బయటకు బాగానే కనిపిస్తున్నా లోపల కుమిలిపోతున్నారు..మానసికంగా చాలా వీక్ గా ఉన్నారని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం అని డాక్టర్ భారతి చెప్పిన విషయం చెబుతుంది. మందులతో మనోవ్యాధి తగ్గదు..ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్లమని భారతి సలహా ఇచ్చింది..తప్పదు తీసుకెళ్లాలని చెబుతుంది సౌందర్య. ఆ ఏర్పాట్లు చూస్తానన్న ఆదిత్య..ఈ వయసులో వీళ్లకు ఇన్ని కష్టాలు అవసరమా అనిపిస్తోందంటాడు. 

Also Read: డాక్టర్ బాబు తమ్ముడిని 'బుజ్జి బంగారం' అంటూ వెంటపడుతోన్న మోనిత
ప్రతి దుకాణానికి తిరిగి పిండివంటలు తీసుకోమని అడిగిన దీపకు రుద్రాణి షాకిచ్చింది.  నువ్వు ప్యాకెట్ 30 రూపాయలు అంటున్నావ్.. రుద్రాణి 25 రూపాయలకే ఇచ్చిందని చెబుతాడు వ్యాపారి. రుద్రాణి పిండివంటలు అమ్మడం ఏంటని అడిగిన దీపకు..అవన్నీ నాకు తెలియదు... నీ దగ్గర కొనుక్కుని రుద్రాణితో గొడవ పెట్టుకోలేనంటాడు. ఆ తర్వాత దుకాణాలకు, ప్రతి ఇంటికి తిరిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరోవైపు స్కూల్ కి బాక్స్ తీసుకెళుతున్న కార్తీక్ మళ్లీ ఆలోచనల్లో పడతాడు..ఇంటి భారం మొత్తం దీప మోస్తోంది..ఏదో ఒకటి చేసి దీప భారాన్ని తగ్గించాలి అనుకుంటాడు. ఆకలేస్తోందని పిల్లలు అనడంతో తీసుకొచ్చా కదా అని కార్తీక్ అనేలోగా..పక్కనుంచి ఓ పిల్ల వచ్చి తోసుకుంటూ వెళ్లిపోతే బాక్స్ కిందపడిపోతుంది. కార్తీక్ బాధపడుతుంటే చూసిన పిల్లలు మీరు ఇంటికి వెళ్లండి ఇంటికి వచ్చాక తింటా అంటారు. 

రేపటి ఎపిసోడ్ లో
మీ బాకీ త్వరలోనే తీరుస్తా అన్న దీపతో.. లక్షల బాకీ ఇలా తిరుగుతూనే ఎలా తీరుస్తావ్ అంటుంది రుద్రాణి. సంక్రాంతి ఆఫర్ గా నీ పిల్లల్లో ఒకర్ని నాకిచ్చెయ్ అనగానే దీప కొట్టేందుకు చేయి పైకి లేపుతుంది. బాకీ ఎలా తీరుస్తారు పైనుంచి దేవుడు వస్తాడా అన్న రుద్రాణి మాటలకు..దేవుడే వస్తాడో-దేవతే వస్తుందో చూడండి అంటూ వెళ్లిపోతుంది దీప....

Also Read: వసుధారపై ప్రేమను బయటపెట్టే ప్రయత్నాల్లో రిషి, మరి గౌతమ్ సంగతేంటి..గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Jan 2022 08:50 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam Written Update Future story of Karthika Deepam Nirupam Paritala as Karthik Premi Viswanath as Deepa Shobha Shetty as Monitha Bhavana Reddy as Rudraani. Written UpdateKarthika Deepam 7th January 2022

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 17th Update: గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి అఖిల్ వెళ్తున్నాడని పసిగట్టిన మల్లిక- అన్నకి రాఖీ కట్టమని జానకికి చెప్పిన జ్ఞానంబ

Janaki Kalaganaledu August 17th Update: గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి అఖిల్ వెళ్తున్నాడని పసిగట్టిన మల్లిక- అన్నకి రాఖీ కట్టమని జానకికి చెప్పిన జ్ఞానంబ

Guppedantha Manasu ఆగస్టు 17 ఎపిసోడ్: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి

Guppedantha Manasu ఆగస్టు 17 ఎపిసోడ్: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి

Lucifer 2 Empuraan Movie : మెగాస్టార్ రీమేక్ సినిమాకు మాలీవుడ్‌లో సీక్వెల్ షురూ

Lucifer 2 Empuraan Movie : మెగాస్టార్ రీమేక్ సినిమాకు మాలీవుడ్‌లో సీక్వెల్ షురూ

Gruhalakshmi August 17th Update: సామ్రాట్ కాలర్ పట్టుకున్న నందు, నిజం బట్టబయలు- సముద్రంలో కొట్టుకుపోయిన తులసి?

Gruhalakshmi August 17th Update: సామ్రాట్ కాలర్ పట్టుకున్న నందు, నిజం బట్టబయలు- సముద్రంలో కొట్టుకుపోయిన తులసి?

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

టాప్ స్టోరీస్

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్

V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్