Guppedantha Manasu జనవరి 7 ఎపిసోడ్: ఒక చోటుకి చేరిన ప్రేమ పక్షులు, మహేంద్రపై గౌతమ్ ప్రశ్నకు సమాధానం ఏంటి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్

వసు విషయంలో గౌతమ్ దూకుడుని చూస్తూ ఊరుకోలేక సతమతమైన ఈగో మాస్టర్ రిషి..వసుకి తన మనసులో మాట అర్థమయ్యేలా చెప్పకనే చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. గుప్పెడంత మనసు జనవరి 7 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు జనవరి 7 శుక్రవారం ఎపిసోడ్

రిషి-వసు-గౌతమ్..రోమియోజూలియట్ బుక్ గురించి మాట్లాడుకుంటుండంగా గురువారం ఎపిసోడ్ ముగిసింది..ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడే మొదలైంది...
రిషి-వసు-గౌతమ్
వసుధార నువ్వు రోమియో జూలియట్ బుక్ చదవలేదా..నేను ఓ పాతికసార్లు చదివా అంటాడు గౌతమ్. నీకు టైమ్ వేస్ట్ కాకూడదంటే నేను చెబుతా నువ్వు విను అని మొదలుపెడతాడు.. ఇంతలో నోర్ముయ్ అంటూ రిషి అడ్డుతగులుతాడు. వసు నువ్వెళ్లు అని పంపించేస్తాడు. ఇది కరెక్ట్ కాదు రిషి అని గౌతమ్ అంటే..నువ్వు చేసేది కరెక్ట్ కాదని నేను అంటున్నా అని రిప్లై ఇస్తాడు రిషి. అసలు నువ్వు నాకెందుకు అడ్డుపడుతున్నావని అడుగుతాడు గౌతమ్. నువ్వు వెళ్లేదారి కరెక్ట్ కాదని రిషి అంటే..నువ్వు నా పాలిట విలన్ లా తయారవుతున్నావ్ అంటాడు. వసు గురించి నా గురించి ఆలోచించు అడ్డుపడకు అని గౌతమ్ అంటాడు. నువ్వు చేసే ప్రయత్నాలు తప్పు , నీ దారి తప్పు అని రిషి అనగానే.. నువ్వేమైనా అని డౌట్ వ్యక్తం చేసిన గౌతమ్ తో అదేం లేదంటాడు. నువ్వు నీ లిమిట్స్ క్రాస్ అయితే నేను కూడా నా లిమిట్స్ క్రాస్ అవుతా చూసుకో అంటాడు. 

Also Read: రుద్రాణికి షాక్ ఇచ్చిన దీప..తాడికొండలో సౌందర్య ఎంట్రీ ఉండబోతోందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
ఇంట్లో కూర్చుని ప్రేమ గురించి ఆలోచనలో పడిన వసుధార దగ్గరకు జగతి వచ్చి మాట్లాడుతుంది. నీకు సెలవు దొరికిన రోజు కూడా చదవాలా..ఎక్కడికైనా బయటకు వెళదామా అంటే ఎందుకు లెండి అంటుంది వసు. సరేలే అని జగతి వెళ్లిపోతుంటే.. మహేంద్ర సర్ ని రమ్మనండి కబుర్లు చెబుతారు అంటుంది వసు. స్పందించిన జగతి..మహేంద్రని రమ్మని చెప్పడానికి నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అంటుంది. మీరు వద్దంటే నేను మానేస్తానా అంటూ కాల్ చేస్తుంది వసు... మహేదంర్  ఆ ఫోన్ ఉత్సాహంగా మాట్లాడుతుండగా ఎదురుగా రిషి వస్తాడు. ఎక్కడికి అని అడగను డాడ్.. ఆనందంలో కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరిచిపోవద్దని చెబుతాడు. మరోవైపు గౌతమ్.. ధరణి దగ్గరకు వెళ్లి నేను వసుధార దగ్గరకు వెళుతున్నా అంటాడు. మీరే షాక్ అవుతున్నారు..రిషికి తెలిస్తే ఇంకా షాక్ అవుతాడు ఈ విషయం వాడికి చెప్పొద్దనేసి వెళ్లిపోతాడు. గౌతమ్..వసు దగ్గరకు వెళతా అంటున్నాడేంటి అసలు ఏం జరగబోతోందో అనుకుంటుంది ధరణి.

Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
అంకుల్ బయటకు వెళుతున్నారా అంటూ మహేంద్రని అడిగిన గౌతమ్..లిఫ్ట్ కావాలంటాడు. ఎక్కడికి వెళ్లాలి అని అడిగితే ఓ ఇంపార్టెంట్ ప్లేస్ కి అని చెబుతాడు గౌతమ్. కొన్ని పనులు చెబితే అవవు అంటారు కదా అందుకే ఇప్పుడు చెప్పలేనని రిప్లై ఇస్తాడు. నన్ను దీవించండి అంటే..నీ కోరికలో నిజాయితీ ఉంటే విజయం నీదే అంటాడు మహేంద్ర. ఇద్దరూ కలసి కార్లో వెళతారు. తండ్రి-కొడుక్కి అభిప్రాయబేధాలు వస్తుంటాయి.. మీరిద్దరికీ ఎలా కుదిరింది అని అడుగుతాడు గౌతమ్. రిషి పై మీకెప్పుడూ కోపం రాలేదా అంటే..నాపై నాకు కోపం వస్తుంది కానీ రిషిపై కోపం రాదంటాడు. మీరు జోవియల్-రిషి సీరియస్..మీరు అందరితో కలసిపోతారు-రిషి వాడి సొమ్మేదో తిన్నట్టు సీరియస్ గా ఉంటాడు, వాడు జోక్ వేయడు-మనం జోక్ వేసినా నవ్వడు...రిషి అలా ఉంటే ఎలా నచ్చుతుంది అని అడుగుతాడు గౌతమ్. తను తనలా ఉంటేనే బావుంటుందన్న మహేంద్ర... రిషి నాకు కొడుకు మాత్రమే కాదు నా హీరో ..నువ్వు చెప్పినవన్నీ చిన్న చిన్న కారణాలు.. కానీ లక్షల మందిలో లేని క్వాలిటీస్ వాడిలో ఉన్నాయి...రిషి విషయంలో గర్వంగా ఫీలవుతా అని చెబుతాడు మహేంద్ర. 

Also Read: వసుధారపై ప్రేమను బయటపెట్టే ప్రయత్నాల్లో రిషి, మరి గౌతమ్ సంగతేంటి..గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
ఎక్కడున్నావ్ అని వసుధారకి కాల్ చేసిన రిషి..ఎవరైనా వచ్చారా అని అడిగేసి కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిషిని చూసి షాక్ అవుతుంది. ఎందుకు వచ్చారు అని అడిగితే ఏం రాకూడదా అని సమాధానం ఇస్తాడు. వాటర్ కావాలి అని అడగడంతో లోపలకు వెళ్లిన వసుకి..వాటర్ బాటిల్ ఇచ్చిన జగతి..రిషి టెన్షన్ గా కనిపిస్తున్నాడు ఎక్కువ ప్రశ్నలు వేయకని చెబుతుంది. ఏదైనా ప్రాబ్లెమా అని వసు అడిగిన ప్రశ్నకు కొందరు మనుషుల వల్ల ప్రాబ్లెమ్ అని రిప్లై ఇస్తాడు. పద వెళదాం అంటూ తూలిపడబోతుంటే వసు పట్టుకుంటుంది( బ్యాగ్రౌండ్ లో సాంగ్ ). ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర రిషిని చూసి షాక్ అవుతాడు. రిషి నువ్వేంటి ఇక్కడ అంటే పనుండి వచ్చా అని చెబుతాడు రిషి. వాటర్ కావాలని మహేంద్ర అడుగుతాడు.. అదే సమయానికి అక్కడకు వచ్చిన గౌతమ్ అందర్నీ చూసి షాక్ అవుతాడు. నేను వసుధారతో ఏకాంతంగా మాట్లాడుదాం అని వస్తే అందరూ ఇక్కడున్నారేంటి..ఇలా బుక్కైపోయానేంటి అనుకుంటాడు.

రేపటి ఎపిసోడ్ లో
అంకుల్ మీరేంటి ఇక్కడకు వచ్చారని గౌతమ్ అడగడంతో అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రిషి కోపం బావుంటుందా-సహనం బావుంటుందా అని అడిగిన జగతికి.. సహనం బావుంటుందని సమాధానం ఇస్తుంది. కానీ నాకు రిషి కోపం బావుంటుందనుకుంటా అంటుంది జగతి. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేనని తండ్రికి చెబుతాడు రిషి.

Also Read: వసుధార విషయంలో గౌతమ్ కి షాకిచ్చిన రిషి, సర్ ప్రైజ్ చేసిన గౌతమ్..గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Jan 2022 09:35 AM (IST) Tags: Mukesh Gowda గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Sai Kiran Guppedantha Manasu Episode serial Guppedantha Manasu January 7th Episode Raksha Gowda

సంబంధిత కథనాలు

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!

GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ 

GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ 

Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' -  ట్రైలర్ అదిరిపోయింది!

Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' -  ట్రైలర్ అదిరిపోయింది!

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

టాప్ స్టోరీస్

No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !

No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !

IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!

IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!

IND Vs ENG 5th Test England Target: 245 పరుగులకు టీమిండియా ఆలౌట్ - ఇంగ్లండ్ లక్ష్యం భారీనే అయినా!

IND Vs ENG 5th Test England Target: 245 పరుగులకు టీమిండియా ఆలౌట్ - ఇంగ్లండ్ లక్ష్యం భారీనే అయినా!

OnePlus TV 50 Y1s Pro: వన్‌ప్లస్ కొత్త టీవీ దిగింది - 50 ఇంచుల టీవీల్లో బెస్ట్!

OnePlus TV 50 Y1s Pro: వన్‌ప్లస్ కొత్త టీవీ దిగింది - 50 ఇంచుల టీవీల్లో బెస్ట్!