IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Karthika Deepam జనవరి 8 ఎపిసోడ్: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 8 శనివారం 1244 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం జనవరి 8 శనివారం ఎపిసోడ్

కార్తీకదీపం శనివారం ఎపిసోడ్ మోనిత ఎంట్రీతో మొదలైంది. విన్నీ అనే కొత్త క్యారెక్టర్ ని వారణాసి ఆటోలో తీసుకొస్తాడు. మోనిత దగ్గరకు అని తెలిసి షాక్ అవుతాడు. నేను మీ దగ్గరకు వస్తున్నానని తెలియక మిమ్మల్ని చాలా తిట్టాడు అని చెబితే..ఆ తిట్లే నాకు దీవెనలు అని చెబుతుంది మోనిత. నేను కూడా మీ దీపక్కలాంటిదాన్నే నన్ను కూడా అక్క అని పిలువు అన్న మోనితతో.. అదెప్పటికీ జరగదని చెప్పేసి వెళ్లిపోతాడు.

Also Read: రుద్రాణికి షాక్ ఇచ్చిన దీప..తాడికొండలో సౌందర్య ఎంట్రీ ఉండబోతోందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
దుకాణాలన్నీ తిరిగి తిరిగి సరుకులు అమ్ముడవకపోవడంతో ఇలా అయితే రుద్రాణి అప్పు ఎలా తీరుస్తా అనుకుంటుంది దీప. ఇంతలో అడ్డొచ్చిన రుద్రాణి.... సరుకులు అలాగే ఉన్నట్టున్నాయి అమ్ముడైనట్టు లేవు ఇప్పటికైనా రుద్రాణి అంటే ఏంటో అర్థమైందా అంటుంది. నువ్వు ఓడిపోతావనే భయంతో ఉన్నావ్..నేను గెలుస్తాననే ధీమాతో ఉన్నా అంటుంది దీప. అయినా నేనంటే ఏంటో తెలిసేలా చేశాను కదా అన్న దీపతో..అన్నీ గుర్తున్నాయ్...నీ సార్ నా దగ్గరకు వచ్చి సంతకం పెట్టిన విషయం నువ్వు గుర్తుపెట్టుకో అంటుంది రుద్రాణి. లక్షల బాకీ ఇలా తిరుగుతూ సంపాదిస్తే ఎలా తీరుస్తారు..మిమ్మల్ని సంపాదించనివ్వాలి కదా అంటుంది. గాలికి చిన్న దీపాలు ఆరిపోతాయి...మంట మాత్రం ఇంకొంచెం పెరుగుతుందని చెప్పి వెళ్లబోతుంటే..మళ్లీ అడ్డుకున్న రుద్రాణి.. అప్పు తీర్చలేరన్నది నాకు అర్థమైంది..అందుకే నీ పిల్లల్లో ఒకర్ని నాకిచ్చెయ్ అంటుంది. రుద్రాణి అంటూ చేయి పైకెత్తిన దీప ఆగిపోతుంది... ఒకటి పాపని ఇవ్వడం, రెండు రంగరాజుని ఇవ్వడం, మూడు అప్పు తీర్చడం ఈ మూడే ఆప్షన్లు ఉన్నాయన్న రుద్రాణితో....గడువులోగా అప్పు తీరుస్తా అంటుంది. ఏం చేసి తీరుస్తావ్ అని అడిగితే అన్నీ నీకు అనవసరం అనేసి వెళ్లిపోతుంది దీప. ఎలా తీరుస్తావు..పైనుంచి దేవుడు వచ్చి తీరుస్తావా అని రుద్రాణి రెట్టించడంతో..దేవుడే వస్తాడో, దేవత వస్తుందో ఎవరికి తెలుసని వెళ్లిపోతుంది.

Also Read: ఒక చోటుకి చేరిన ప్రేమ పక్షులు, మహేంద్రపై గౌతమ్ ప్రశ్నకు సమాధానం ఏంటి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
స్కూల్ నుంచి హడావుడిగా ఇంటికివెళ్లిన కార్తీక్... పిల్లలు.... ఆకలి అన్నమాట గుర్తుచేసుకుని వంట చేద్దాం అనుకుని చూస్తే బియ్యం కనిపించవు. దీప ఇంట్లో ఎక్కడైనా డబ్బులు పెట్టిందేమో అని వెతుకుతాడు. ఇంట్లో బియ్యం,డబ్బులు రెండూ లేవు..పిల్లలు ఆకలితో ఉన్నారు ఏం చేయాలి అనుకుంటాడు. మరోవైపు తిరిగి తిరిగి అలసిపోయిన దీప.. పిండి వంటలు అమ్ముడవకపోవడంతో బాధపడుతుంది. రుద్రాణిని తక్కువ అంచనా వేశానా..నేను ఓడిపోకూడదు..ఏదో ఒకటి చేసి రుద్రాణి పీడ వదిలించుకోవాలి అనుకుంటుంది. అడుగుఅడుగునా అడ్డుపడుతున్న రుద్రాణికి సరైన సమాధానం చెప్పాలనుకుంటుంది దీప. 

Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
ప్రకృతి వైద్యశాలకు వెళ్లేందుకు సిద్ధమైన సౌందర్యతో..నేను కూడా వస్తా అని అడుగుతాడు ఆదిత్య. భారతి చెప్పినట్టు నాన్న ఈ నాలుగు గోడల మధ్యే ఉండటం మంచిది కాదని చెబుతుంది.  డాడీ రావడానికి ఒప్పుకున్నారా అంటే ఒప్పించా అంటుంది. కట్ చేస్తే ఓ హోటల్ లో సీన్ ఓపెన్ అవుతుంది. అక్కడకు వెళ్లిన కార్తీక్  భోజనం కావాలని అడుగుతాడు. ఫుల్ మీల్స్ 120 అని చెప్పడంతో డబ్బుల్లేక అలాగే నిల్చుని ఉండిపోతాడు. ఏం కావాలని అడిగిన హోటల్ యజమానితో డబ్బుల్లేవ్, పార్సిల్ కావాలని అడుగుతాడు. ఇదేం ధర్మ సత్రం కాదుకదా డబ్బుల్లేకుండా ఎలా ఇస్తాం అంటాడు. వంద రూపాయలే కదా సాయంత్రంలోగా ఇస్తానన్న కార్తీక్ మాటలకు.. డబ్బుని తేలిగ్గా తీసుకోవద్దు వంద రూపాయలే కదా అంటావేంటి కోట్లు ఉన్నట్టు అని పంపించేస్తాడు. 

రేపటి ఎపిసోడ్ లో
హోటల్లో వంటచేసి పిల్లలకు భోజనం తీసుకెళతాడు కార్తీక్. మరోవైపు దీప వంటలు రుచి చూసిన హోటల్ యజమాని..నువ్వు వంటలు బాగా చేస్తావని అర్థమైంది..నీకు పనిస్తా అంటాడు. అంతకన్నా కావాల్సిందే ఏముంది సంతోషంగా పనిచేస్తా అంటుంది. ఇంతలో అక్కడకు కార్తీక్ రావడంతో ఎపిసోడ్ ముగిసింది...

Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
Also Read: మోనిత కొడుకుపై ప్రేమ పెంచుకుంటున్న డాక్టర్ బాబు, వంటలక్క.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Jan 2022 08:38 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam Written Update Future story of Karthika Deepam Nirupam Paritala as Karthik Premi Viswanath as Deepa Shobha Shetty as Monitha Bhavana Reddy as Rudraani. Written UpdateKarthika Deepam 8th January 2022

సంబంధిత కథనాలు

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో  తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం