News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Guppedantha Manasu జనవరి 11 ఎపిసోడ్: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. గౌతమ్ కోసం..తనకు తెలియకుండా వసుధారకి లవ్ లెటర్ రాసిన రిషి..జగతి ముందు బుక్కైపోయాడు. జనవరి 11 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

వసుధారని ఊహించుకుని రిషి రాసిన లవ్ లెటర్ తీసుకున్న గౌతమ్..ఇది ప్రేమ లేఖ కాదు కెవ్వుకేక అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రియమైన నీకు అని చదివిన గౌతమ్...నీకు ఏంటి నీకు పేరు రాయలేదేంటని వసుధార పేరు యాడ్ చేస్తాడు. ప్రేమ లేఖ తీసుకున్నాక వసుధార ఏమంటుంది..సిగ్గుపడుతుందా, ఐ టూ అంటుందా, పాత సినిమాల్లో హీరోయిన్లా పరిగెడుతుందా... ఏదైనా నాకు ఓకే..నువ్వు హీరోవి గౌతమ్ అనుకుంటాడు. జేబులోంచి దువ్వెన తీసుకుంటుండగా లెటర్ జారి కిందపడిపోతుంది. అది చూసుకోని గౌతమ్ ...వసు దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు. వెదర్ బావుంది కదా  అంటే పర్లేదు సార్ బావుంది అంటుంది. ఇంతలో బయటకు వచ్చిన రిషి..వాళ్లిద్దర్నీ చూసి షాక్ అవుతాడు. ప్రపోజ్ చేస్ స్టైల్లో కూర్చుని  తన జేబులో లెటర్ తీసి వసుకి ఇద్దామని వెతుకుతుంటాడు. వీడేమైనా వసుధారకి అనుకుంటూ రిషి వెళ్లబోతుంటాడు...గౌతమ్ మాత్రం లెటర్ అనుకుని దువ్వెన బయటకు తీసి చూపిస్తాడు. అంతలో తేరుకుని లెటర్ వెతుకుతుంటాడు.  వసు అలా చూస్తూ నిల్చుండిపోతుంది.

Also Read: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
కట్ చేస్తే ఆ లెటర్ జగతి మేడం చేతిలో పడుతుంది. గౌతమ్-రిషి షాక్ లో ఉండిపోతారు. ఏంటి మేడం అది అని వసు అడిగితే.. ప్రేమ లేఖ అని సమాధానం చెబుతుంది జగతి. అక్కడకు రిషి రావడం చూసి అమ్మబాబోయ్ వీడు ఇప్పుడే ఇక్కడకు రావాలా ఈ రోజు నా పనైపోయింది అనుకుంటాడు గౌతమ్. ఏంటి మేడం అది అని అడిగిన రిషికి..మన కాలేజ్ డిసిప్లైన్ సర్ ఇది అన్న జగతి.. వసుధారకి ఎవరో లవ్ లెటర్ రాశారని చెబుతుంది. ఎవరు రాశారు అని వసుతో..కింద పేరు, ఫోన్ నంబర్ రాయరు కదా అంటూ చదవడం మొదలు పెడుతుంది...( కాంపిటేషన్ కి అంటే రాసిచ్చి బుక్కయ్యా అని రిషి- రైటింగ్ నాది కాదు కాబట్టి నేను సేఫ్ అని గౌతమ్ అనుకుంటారు)  " ప్రియమైన నీకు..నా వసుధారకు ( పేరు నేను రాయలేదు కదా వీడు యాడ్ చేసుకుని ఉంటాడని రిషి అనుకుంటాడు). ప్రేమలేఖ రాయడం ఇదే మొదటిసారి ... ప్రేమంటే ఏంటో తెలియదు కానీ... నువ్వు కనిపిస్తే వర్షం వచ్చేముందు గాలి వీచినంత హాయిగా ఉంటుంది ( కత్తిలా రాశాడు ఈ లెటర్ ఇచ్చి ఉంటే వసు పడిపోయేదని గౌతమ్ అనుకుంటాడు). అందరిలా నువ్వు మామూలుగానే ఉంటావ్,కానీ అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది..నువ్వు అందరిలానే నవ్వుతావు కానీ చలికాలంలో సూర్యుడి కిరణాలు తాకినట్టు ఆనవ్వు చాలా బావుంటుంది..దీన్ని ప్రేమంటే నేను నిన్ను ప్రేమిస్తున్నట్టే కదా" చదవడం పూర్తిచేసిన జగతి...ఏంటి సార్ ఇది అని రిషిని క్వశ్చన్ చేస్తుంది. 

Also Read:  కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
ఎవరు సార్ ఈ లెటర్ రాసింది.. రాసి ధైర్యంగా వసుధారకి ఇద్దామని తీసుకొచ్చాడంటే వాడికెంత ధైర్యం...ఆ వెధవ నాకు కనిపించాలి వాడి కాలర్ పట్టుకుని చెంపమీద వాయించేస్తాను అంటుంది. జగతి కొట్టినట్టు ఊహించుకున్న గౌతమ్..వద్దు వద్దు  అని అరుస్తాడు. ఈ విషయం మీరు సీరియస్ గా తీసుకుని ఎవరు రాశారో తెలుసుకోవాలి, వాళ్లని వదిలిపెట్టొద్దు సార్ అని రిషితో అంటుంది . స్పందించిన గౌతమ్ మేడం ఎవరో పాపం అంటుండగా.. ఇలా ఎలా రాస్తారు, రిషి సార్ ఊరుకుంటారా...మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి అంటూ ఇడియట్, రాస్కెల్ అని తిడుతూ ఆ లెటర్ చించి పడేస్తుంది. ఇలాంటి వాళ్ల వల్లనే కాలేజీలో పరువు పోయేదని అంటుండగా...గౌతమ్ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటాడు. సార్ మీరేం చేస్తారో నాకు తెలియదు... ఎలాగైనా వాడిని పట్టుకుని శిక్షించాలని చెప్పేసి వెళ్లిపోతుంది. వసుధార ఏమనుకుని ఉంటుంది అనే ఆలోచించిన రిషి...జగతి చింపేసిన ఆ పేపర్ ముక్కలన్నీ ఏరి జేబులో పెట్టుకుంటాడు. 

Also Read:  ఐ లవ్ వసుధార అనేసిన గౌతమ్..షాక్ లో రిషి.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
ఇంతలో ఎదురొచ్చిన మహేంద్ర ఏంటీ జగతి మేడం అక్కడ మీటింగ్ అని అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది. రిషి ఏం జరిగిందని అడిగితే..ఏం లేదు అనేస్తాడు. గౌతమ్ చెప్పేందుకు ప్రయత్నించినా చెప్పనివ్వకుండా గౌతమ్ ని తీసుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు.  నీకు బుద్ది ఉందా..కాంపిటేషన్ అని చెప్పి రాయించావు కదా అని అడుగుతాడు..గౌతమ్ ని సమాధానం చెప్పనివ్వకుండా విరుచుకుపడతాడు. ఏంటిరా ఈ వంకర బుద్ధులు, నీకు మళ్లీ చెబుతున్నా కాలేజీలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు..నువ్వు చేసింది కరెక్ట్ కాదు నాకు చాలా కోపం వస్తోంది..అనవసరంగా నన్ను ఇరికించావు కదా... ఆ ప్రేమ లేఖ కాంపిటేషన్ అబద్ధమా..ఏమైనా అందామంటే చిన్నప్పటి ఫ్రెండ్ వి అయిపోయావ్ పోరా అనేసి వెళ్లిపోతాడు. నువ్వు వద్దంటే, నువ్వు క్లాసేస్తే డ్రాప్ అయిపోతానా..ప్రేమ ఎవ్వరికీ భయపడదు అనుకుంటాడు గౌతమ్. 

Also Read: ఒక చోటుకి చేరిన ప్రేమ పక్షులు, మహేంద్రపై గౌతమ్ ప్రశ్నకు సమాధానం ఏంటి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
వసుని రెస్టారెంట్ దగ్గర దింపేసిన జగతితో కాఫీ తాగివెళ్లండి అంటుంది వసుధార. నా మూడ్ బాగాలేదన్న జగతి..గ్రౌండ్ లో జరిగిన విషయంపై ఎక్కువ రియాక్టయ్యానా అని అడుగుతుంది.. సముద్రానికి తన లిమిట్స్ తెలుసు మేడం...మీకు హద్దులు-లిమిట్స్ నేను చెప్పడం కరెక్ట్ కాదు అంటుంది. జగతి బై చెప్పి వెళ్లిపోతుంది. మేడం మీకన్నా నాకు ఎవరు ఎక్కువ... మీరు ఏం చేసినా నా మంచికే చేస్తారు..ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు అనుకుంటూ లోపలకు వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు కారు ఓ పక్కన ఆపిన రిషి.. జగతి మాటలు గుర్తుచేసుకుని వసుధార ఎలా ఫీలైందో..ఈ విధంగా అయినా వసుకి ప్రేమపై ఉన్న అభిప్రాయం తెలుస్తుంది అనుకుంటే జగతి మేడం మధ్యలో వచ్చి అంతా చెడగొట్టింది అనుకుంటాడు. ఇంతలో సార్ నేను మీతో మాట్లాడాలి అని వసుధార మెసేజ్ చేస్తుంది. ఎపిసోడ్ ముగిసింది...

రేపటి ఎపిసోడ్ లో
ప్రేమలేఖ ఎవరు రాసి ఉంటారు సార్...( గౌతమ్ నన్ను చాలా టెన్షన్ పెట్టావ్ రా అని గౌతమ్ అనుకుంటాడు)...చాలా బాగా రాశారు సార్. నా జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన వాళ్లే రాసి ఉంటారు. ఎవరో వాళ్లని ఒకసారి చూడాలని ఉంది అంటుంది. ఇది నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి అని రిషి అనుకుంటాడు...

Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 09:50 AM (IST) Tags: Mukesh Gowda గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Sai Kiran Guppedantha Manasu Episode serial Guppedantha Manasu January 11th Episode Raksha Gowda

ఇవి కూడా చూడండి

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Allu Aravind: అది ఆయన ఫెయిల్యూర్, మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: ‘సంతోషం’ వివాదంపై అల్లు అరవింద్ కామెంట్స్

Allu Aravind: అది ఆయన ఫెయిల్యూర్, మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: ‘సంతోషం’ వివాదంపై అల్లు అరవింద్ కామెంట్స్

టాప్ స్టోరీస్

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
×