By: ABP Desam | Updated at : 10 Jan 2022 09:53 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu January 10h Episode (Image Credit: Star Maa/Hot Star)
కాలేజీ దగ్గర కారు ఆపిన వెంటనే వసుధార పంపిన మెసేజ్ చూసుకుంటాడు రిషి. కాలేజీ మెట్ల దగ్గరున్నా అన్న మెసేజ్ చూసి ఇది ఆర్డరా, రిక్వెస్టా..అయినా ఆమె పిలిస్తే నేనెందుకు వెళ్లాలి అనుకుంటూనే వెళతాడు. ఎందుకు పిలిచావ్ మేటరేంటి అడుగుతాడు రిషి. ఏమీలేదు..ఊరికే కాసేపు కలుద్దామని అన్న వసు మాటలకు..మన మధ్య ఏముంటుందని అంటాడు. నాకు చాక్లెట్ తినాలని ఉందన్న వసుతో..అందుకు నా పర్మిషన్ కావాలా నువ్వు తినేసెయ్, లేదంటే కొనుక్కో, డబ్బుల్లేకపోతే మీ మేడంని అడిగి తీసుకో అంటాడు. నా దగ్గర చాక్లెట్ ఉంది..మీరు తింటేనే నేను తిందామని అనగానే..సెలబ్రేషన్సా దేనిగురించో తెలుసుకోవచ్చా..అయినా నాకెందుకులే అని వెళ్లిపోతున్న రిషిని ఆగమని చెప్పి చాక్లెట్ ఇస్తుంది. మరి నీకు తినడానికి ఉందా ఏది చూపించు అంటాడు. వసు దగ్గర లేదని తెలిసి చాక్లెట్ ముక్కలు చేసి ఇచ్చి వెళ్లిపోతాడు. సర్ మూడ్ బాగానే ఉంది పర్వాలేదు...అయినా సార్ కి నేను చాక్లెట్ ఎందుకిచ్చాను..నేను ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు అనుకుంటుంది వసుధార. ఏం మాట్లాడాలి అనుకున్నా, ఏం మాట్లాడా..ఏంటో సర్ ని చూడగానే అన్నీమర్చిపోతున్నా అనుకుంటుంది.
Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి అప్ డేట్ విషయాలన్నీ మినిస్టర్ గారికి మెయిల్ చేశాం... కొన్ని స్కూల్స్, కాలేజీలకు మెటీరియల్ సప్లై చేయాలి. అందరం సేవా భావంతో చేస్తున్నాం కాబట్టి మన సొంత పనిలా భావించి చేద్దాం అంటాడు ఫణీంద్ర. అందరకీ ఉపయోగపడడమే ఈ ప్రాజెక్ట్ అంతిమ లక్ష్యం అంటుంది జగతి. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి...మనం చాక్లెట్ గురించి షార్ట్ ఫిలిం చేయాలి అనుకుంటున్నాం కదా అంటాడు...( ఇంకా వసు ఇచ్చిన చాక్లెట్ ఆలోచనలోనే ఉంటాడు). చాక్లెట్ ఏంటని మహేంద్ర అనడంతో సారీ... షార్ట్ ఫిలిం గురించి అంటాడు. మన స్టూడెంట్స్ ని షార్ట్ ఫిలింలో ఆర్టిస్టులుగా తీసుకుందాం అన్న జగతితో..మంచి ఆలోచన అంటాడు రిషి. మిగిలిన వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాడు.
Also Read: ఐ లవ్ వసుధార అనేసిన గౌతమ్..షాక్ లో రిషి.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
రిషి రూమ్ లో గౌతమ్ గీసిన వసుధార బొమ్మ చూసి ధరణి ఆలోచనలో పడుతుంది. ఏం జరుగుతోంది రిషి..వసుధార బొమ్మ గౌతమ్ వేస్తుంటే నువ్వేం చేస్తున్నావ్... ఇది కరెక్ట్ కాదుకదా..వసుధార నీ మనసులో ఉందికదా..ఈ విషయం చిన్న మావయ్యకి చెప్పాలా వద్దో కూడా నాకు అర్థం కావడం లేదనుకుంటుంది ధరణి. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని..ధరణిని కోపంగా చూస్తూ.. అక్కడ నిల్చుని ఏం చేస్తున్నావ్ నా బొమ్మ గీస్తున్నావా అని దండకం మొదలెడుతుంది. రూమ్ సర్దుతున్నా అన్న ధరణితో..హా..అన్ని పనులు మాత్రం బాగా చేస్తావ్..నేను అడిగిన, చెప్పిన పనులు మాత్రం చేయవు. జగతి-వసుధార గురించి ఏం తెలుసుకోవు కానీ ఏమైనా అడిగితే అమాయకంగా మొహం పెడతావు అని మండిపడుతుంది.
Also Read: ఒక చోటుకి చేరిన ప్రేమ పక్షులు, మహేంద్రపై గౌతమ్ ప్రశ్నకు సమాధానం ఏంటి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
అవునురా..నేను వసుధారని ప్రేమిస్తున్నా..నీకేంటి బాధ..నీ పర్మిషన్ తీసుకోవడం ఏంటి..చెప్పరా రిషి..నా ప్రేమకి వసుధార ఫ్యామిలీ వాళ్లు విలన్ కావాలి కానీ నువ్వు నా ఫ్రెండ్ కదా హెల్ప్ చేయాలి కదా అని రిషి ఫొటో చూసి మాట్లాడుతుంటాడు. ఇంతలో అక్కడకు రిషి వచ్చి ఏం చేస్తున్నావ్ అంటే..ఏమీ లేదనేస్తాడు. రిషిని కాకా పడుతున్న గౌతమ్ తో...అదంతా ఆపి విషయం చెప్పు అంటాడు. నాకు లవ్ లెటర్ రాసిపెట్టు అంటాడు. ఏంటి మతి ఉండే మాట్లాడుతున్నావా..నేను లవ్ లెటర్ రాయడమేంటి అయినా ఎవరికి ఇద్దామని అని అడుగుతాడు. నిజం చెబితే వీడు తిడతాడు.. అబద్దం చెప్పి గట్టేక్కెద్దాం అనుకుని... అమెరికాలో మా స్ట్రీట్ లో లవ్ లెటర్స్ పోటీ పెట్టరు..రాసి పెట్టమని అడుగుతాడు గౌతమ్. నా కన్నా నువ్వు బెటర్ కదా అని చెప్పి బలవంతంగా రాయిస్తాడు. నేను ట్రై చేస్తాను నువ్వెళ్లు అని గౌతమ్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు.
Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
ఏం రాయాలి, ఎలా మొదలు పెట్టాలనే ఆలోచనలో పడిన రిషి.. పేపర్లు చింపుతూనే ఉంటాడు. ప్రేమ లేఖ రాయడం అంత ఈజీ కాదన్నమాట అనుకుని...ఎదురుగా వసుధార ఉన్నట్టు ఊహల్లోకి వెళతాడు. వసు మొహం చూస్తూనే అదో అలా రాసేస్తాడు. ఆ లెటర్ లాక్కున్న గౌతమ్ తీసుకెళ్లి వసుధారకి ఇవ్వాలనుకుంటాడు... ఎపిసోడ్ ముగిసింది..
రేపటి ఎపిసోడ్ లో
గౌతమ్ వసుకి ఇవ్వాలనుకున్న లవ్ లెటర్ జగతికి దొరుకుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి-గౌతమ్-వసుధార..ఏంటది అని అడగడంతో... ఎవరో వసుధారకి లవ్ లెటర్ రాశారని చెబుతుంది. ఇరుక్కుపోయా అని గౌతమ్ అనుకుంటే..నన్ను కూడా ఇరికించావ్ అనుకుంటాడు రిషి.. ప్రియమైన నీకు నా వసుధారకు అని జగతి చదవడం మొదలెడుతుంది.. పేరు నేను రాయలేదు కదా నువ్వే రాసుకున్నావా అనుకుని మనసులోనే తిట్టుకుంటాడు రిషి...నాకు ప్రేమ లేఖ రాయడం ఇదే మొదటిసారి..ఇది ఎవరు రాశారో తెలుసుకోవాలి.. వదిలిపెట్టొద్దు సార్ .. మాట్లాడరేంటని జగతి అడుగుతుంది. రిషి అయోమయంలో అలా చూస్తూ ఉండిపోతాడు...
Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Krishna Mukunda Murari December 4th Episode - 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్: మురారితో తన మనసులో మాట చెప్పేసిన కృష్ణ!
Trinayani Serial December 4th Episode : 'త్రినయని' సీరియల్: తిలోత్తమ చేసిన పనికి మైకంలో విశాలాక్షి - పరుగు పరుగున వచ్చిన నాగయ్య పాము!
Brahmamudi December 4th episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : అరుణ్ ఇంటికెళ్లిన కావ్య, రాజ్ - స్వప్నను ఇంటికి తీసుకెళ్లమన్న రుద్రాణి
Goutham: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>