By: ABP Desam | Updated at : 10 Jan 2022 08:54 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deepam 10th January Episode (Image Credit: Star Maa/Hot Star)
కార్తీకదీపం జనవరి 10 సోమవారం ఎపిసోడ్
పిల్లల భోజనం కోసం హోటల్ కి వెళ్లి ప్రాధేయపడిన డాక్టర్ బాబుకి నిరాశే ఎదురవుతుంది. వందరూపాయలే కదా ఇచ్చేస్తాను అన్న కార్తీక్ కి హోటల్ యజమాని క్లాస్ పీకుతాడు. హోటల్లో ప్లేట్లు కడిగే పనులు చేస్తాను ఓ ఫుల్ మీల్స్ పార్సిల్ ఇవ్వండని అడిగి స్కూల్ కి భోజనం తీసుకెళతాడు. స్కూల్లో పిల్లలు మంచినీళ్లు తాగి కడుపునింపుకోవడం చూసి చలించిపోతాడు. ఇది ఇంటి భోజనం కాదు కదా ..హోటల్ కివెళ్లి తెచ్చావా..నీ దగ్గర డబ్బుల్లేవు కదా ఎలా తెచ్చావని అడిగిన పిల్లలకు..అమ్మ ఇంట్లో డబ్బులు పెట్టి వెళ్లిందని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత పిల్లలిద్దరూ తండ్రికి భోజనం తినిపిస్తారు.
Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
పిండివంటలు పట్టుకుని ఊరంతా తిరుగుతున్న దీప... అప్పెలా తీరుస్తారన్న రుద్రాణి మాటలు గుర్తుచేసుకుంటూ కార్తీక్ కి పార్సిల్ ఇచ్చిన హోటల్ దగ్గరకు వెళుతుంది. ఆ పిండి వంటలు రుచి చూసిన హోటల్ యజమాని వంటలు చాలా బావున్నాయంటాడు. ఈమెతో హోటల్లో వంటలు చేయిస్తే జనం ఎగబడి తింటారు అనుకుంటాడు. చంటిపిల్లాడిని తీసుకుని తిరుగుతున్నావంటే నువ్వెన్ని కష్టాల్లో ఉన్నావో అర్థమవుతోంది..మా హోటల్లో పనిచేస్తావా అంటే సంతోషంగా పనిచేస్తా అంటుంది దీప. నేను ఇక్కడ పనిచేస్తున్నానని రుద్రాణికి తెలియకుండా ఉంటే చాలంటుంది దీప. నాక్కూడా ఆ రుద్రాణి అంటే పడదు..మా ఇద్దరికీ గొడవలు ఉన్నాయి కానీ నేను లొంగలేదు..నువ్వొచ్చి పనిలో చేరు అని ధైర్యం చెబుతాడు. ఇంతలో హోటల్ లోపలకు కార్తీక్ అడుగుపెడుతుండగా పనోడు తనని తీసుకుని వెళ్లిపోతాడు. కార్తీక్ లోపల వంటలకు సాయం చేస్తుంటాడు.
Also Read: రుద్రాణికి షాక్ ఇచ్చిన దీప..తాడికొండలో సౌందర్య ఎంట్రీ ఉండబోతోందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
కార్తీక్ కోసం వెతుకున్న బిచ్చగాడు ఊరూరా తిరుగుతుంటాడు. ఈ ఫోన్ నాకు దొరకడం ఏంటో.. నేను ఊరూపా వెతకడం ఏంటో...వీళ్లు నాకు దొరకరు..దొరికితే కానీ డబ్బులు రావని అనుకుంటాడు. బస్సొచ్చిన రూట్లో ప్రతి ఊరిలో ఆగుతూ వెతుక్కుంటూ వస్తున్నా కదా..నా జుట్టు పెరుగుతోంది కానీ వీళ్లు మాత్రం దొరకడం లేదనుకుంటాడు. కట్ చేస్తే దీప ఇంటికి వెళ్లి రుద్రాణి పిల్లలు ఇద్దర్నీ పక్కన కూర్చోబెట్టుకుని ముద్దులాడుతుంటుంది. పిల్లలు మాత్రం రుద్రాణిని చూసి భయపడిపోతుంటారు. నేను కూడా మీ అమ్మ లాంటిదాన్నే కదా..రాక్షసిలా కనిపిస్తున్నా అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన దీప రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. ఎవరూ లేనప్పుడు ఇంటికొచ్చి చిన్నపిల్లల్ని బెదిరించడం ఏంటి..ఇంటికొచ్చి పిల్లల్ని ఎందుకు హింసిస్తున్నావ్ అంటుంది. నేను హింసించడం ఏంటి పిల్లల దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడాను, ఆడుకుందాం అన్నాను, నేను కూడా మీ అమ్మలాంటిదాన్నే అన్నాను..ఇందులో నా తప్పేంటని అడుగుతుంది రుద్రాణి. నువ్వేమో మానవత్వం, కఠినత్వం, రాక్షసత్వం అని ఏదేదో మాట్లాడుతున్నావ్ తప్పు కదా దీపా అన్న రుద్రాణి...పిల్లలూ నన్ను చూసి భయపడొద్దు..మీరెప్పుడూ అమ్మ దగ్గరే ఉండాలని లేదు కదా అంటుంది. రుద్రాణి గారు మర్యాదగా మాట్లాడండి..దయచేసి మీరు వెళ్లండని చెబుతుంది. ఆంటీ అలా మాట్లాడుతోందేంటి..నిన్ను ఏమైనా చేస్తుందా..మనం ఇక్కడినుంచి వెళ్లిపోదాం అని ఏడుస్తారు పిల్లలు. మనం ఎందుకు ఇంత కష్టపడాలి అని అడిగితే...ఒకేసారి అన్ని ప్రశ్నలు అడగొద్దు..అన్నింటికి మీకు సమాధానం చెబుతాను అంటుంది దీప.
Also Read: ఐ లవ్ వసుధార అనేసిన గౌతమ్..షాక్ లో రిషి.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
సౌందర్య-ఆనందరావు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు. ప్రకృతి వైద్యశాలకు వెళదామన్న సౌందర్యతో..ఈ ప్రయాణం అవసరమా అంటాడు ఆనందరావు. సరదాగా వెళుతున్నాం అనుకోండి అన్న సౌందర్యతో....సరదా అనే పదం మన జీవితంలోంచి ఎప్పుడో వెళ్లిపోయిందంటాడు ఆనందరావు. తల్లిప్రేమ అద్దంలా తెలుస్తుంది...తండ్రి ప్రేమ మనసులోనే దాచుకుంటారు. ప్రేమతో పాటూ మీరు బాధని దాస్తున్నారని అంటుంది సౌందర్య. శ్రావ్య మీరు జాగ్రత్త, దీపూని వదిలి ఎక్కడికీ వెళ్లొద్దనని చెప్పి సౌందర్య, ఆనందరావు బయలుదేరుతారు. అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన మోనిత వీళ్లు బయలుదేరడం చూసి ఆగిపోతుంది. కార్తీక్ ఆచూకీ ఏమైనా తెలిసిందా..వీళ్లంతా ఎక్కడకు వెళుతున్నారని అనుకుంటుంది. ఎపిసోడ్ ముగిసింది.
Also Read: ఒక చోటుకి చేరిన ప్రేమ పక్షులు, మహేంద్రపై గౌతమ్ ప్రశ్నకు సమాధానం ఏంటి, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్న్యూస్
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు
Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !