Vijay Sethupathi: ఏం ఉపయోగం దానివల్ల? హిందీ భాషపై విలేఖరి ప్రశ్న - విజయ్ సేతుపతి ఘాటు రిప్లై
Merry Christmas: విజయ్ సేతుపతి ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తనకు హిందీ భాషకు సంబంధించి ప్రశ్న ఎదురవ్వడంతో తను ఘాటుగా రిప్లూ ఇచ్చాడు.
Vijay Sethupathi at Merry Christmas Promotions: ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాలు గుర్తింపు సాధిస్తుండగా.. ఇంక సౌత్, నార్త్ అనే తేడాలు పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ఏ సినిమా ప్రెస్ మీట్ జరిగిన ఇతర భాషల గురించి మీరెలా ఫీలవుతున్నారు అంటూ నటీనటులకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా విజయ్ సేతుపతికి కూడా అలాంటి ప్రశ్నే ఎదురయ్యింది. తన అప్‌కమింగ్ మూవీ ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రమోషన్స్ కోసం ఇతర టీమ్ సభ్యులతో పాటు చెన్నైకు వచ్చాడు విజయ్ సేతుపతి. అదే సమయంలో హిందీ భాషపై తన అభిప్రాయాన్ని చెప్పమంటూ ఒక జర్నలిస్ట్ అడిగారు. దానిపై విజయ్ ఘాటుగా స్పందించాడు.
అమీర్ ఖాన్‌ను కూడా అడిగారు..
‘‘అమీర్ ఖాన్‌లాంటి నటులను కూడా హిందీ గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? ఏం ఉపయోగం దానివల్ల?’’ అని రివర్స్ అయ్యాడు విజయ్ సేతుపతి. అయితే తమ వ్యతిరేకత హిందీ భాషపై కాదని, దాని నేర్పించే విధానంపై అని స్పష్టం చేశాడు. ఇదే విషయంపై తమిళనాడు సమాచార శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ ఇచ్చిన వివరణను గుర్తుచేశాడు విజయ్. ‘మెర్రీ క్రిస్ట్మస్’ కోసం ఢిల్లీలో ప్రమోషన్స్ పూర్తిచేసుకున్న తర్వాత చెన్నైకు వచ్చింది మూవీ టీమ్. చెన్నైలోని ఎగ్మోర్‌లో ఒక ప్రైవేట్ హోటల్‌లో ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి తమ సినిమా గురించి చెప్పుకొచ్చారు. అసలు ఈ ప్రాజెక్ట్ తన చేతికి ఎలా వచ్చింది అనే విషయాన్ని విజయ్ సేతుపతి బయటపెట్టాడు.
నేనే ఊహించుకోలేకపోతున్నాను..
‘‘అది అనుకోకుండా జరిగిపోయింది. కొన్నిసార్లు మనం వెతుక్కుంటూ వెళ్లకముందే బెస్ట్ విషయాలు అనేవి మన దగ్గరకు వస్తాయి. ‘96’ చూసిన తర్వాత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆయన తెరకెక్కించిన ‘బద్లాపూర్’ సినిమా నన్ను చాలా కదిలించింది. ఆయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించాను. నా బర్త్‌డే రోజే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనుకున్నాం. కత్రినా కైఫ్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు విజయ్. మొదట్లో కష్టపడినా భాష నేర్చుకోవడం కోసం కత్రినా చాలా కష్టపడిందన్నాడు. ‘‘మా ఇద్దరినీ ఒక కపుల్‌లాగా నేనే ఊహించుకోలేకపోతున్నాను’’ అంటూ కత్రినాతో జోడీకట్టడంపై నవ్వుతూ కామెంట్ చేశాడు విజయ్ సేతుపతి.
అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్..
ఇక ప్రమోషన్స్‌లో కత్రినా మాట్లాడుతూ.. ‘‘మెర్రీ క్రిస్ట్మస్ అనేది నా మొదటి తమిళ చిత్రం. నేను కొన్ని తెలుగు, మలయాళ సినిమాల్లో కనిపించినా కూడా తమిళ ప్రేక్షకులు నన్ను ఈ సినిమాతో ఆదరిస్తారని నమ్ముతున్నాను. షూటింగ్ సమయంలో తమిళ పదాలు నేర్చుకోవడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇది అనుకోకుండా వచ్చిన సినిమా అయినా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది’’ అని తెలిపింది. జనవరి 12న విడుదల కానున్న ‘మెర్రీ క్రిస్ట్మస్’ను తమిళంతో పాటు హిందీలో కూడా తెరకెక్కించారు. అందుకోసమే ఆయా భాషల్లోని ప్రముఖ నటీనటులను క్యాస్ట్ చేసి సినిమాను తెరకెక్కించాడు శ్రీరామ్ రాఘవన్. హిందీలో సంజయ్ కపూర్, వినయ్ పాటక్, టిన్నూ ఆనంద్‌లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించగా.. తమిళంలో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజన్ వంటివారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Also Read: ఆస్కార్ లిస్ట్‌లో ఆ మూవీ - నా గుండె పగిలిపోయింది, అదంతా రాజకీయం: విజయ్ సేతుపతి