అన్వేషించండి

Vijay Sethupathi: ఆస్కార్ లిస్ట్‌లో ఆ మూవీ - నా గుండె పగిలిపోయింది, అదంతా రాజకీయం: విజయ్ సేతుపతి

Vijay Sethupathi at Merry Christmas Promotions: తన అప్‌కమింగ్ మూవీ ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న విజయ్ సేతుపతి.. తన సినిమా ‘సూపర్ డీలక్స్’ ఆస్కార్స్‌కు వెళ్లకపోవడంపై స్పందించారు.

Vijay Sethupathi about Super Deluxe: సౌత్ ఇండస్ట్రీలో వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. అందుకే బాలీవుడ్ మేకర్స్ సైతం తనను క్యాస్ట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత రెండేళ్లలో సౌత్‌తో పాటు హిందీలో కూడా బిజీ అయిపోయాడు ఈ నటుడు. ఇప్పటికే షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’లో విలన్‌గా నటించాడు విజయ్ సేతుపతి. ఇక త్వరలోనే ‘మెర్రీ క్రిస్ట్మస్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు మేకర్స్. అదే సమయంలో తన ‘సూపర్ డీలక్స్’ సినిమా ఆస్కార్స్‌కు వెళ్లకుండా.. ‘గల్లీ బాయ్‌’ చిత్రం వెళ్లడంపై విజయ్ సేతుపతి స్పందించాడు.

‘సూపర్ డీలక్స్’ కాకుండా ‘గల్లీ బాయ్’..
‘సూపర్ డీలక్స్’ అనే తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించాడు. అప్పటికే విజయ్‌కు స్టార్‌డమ్ ఏర్పడింది. అంత పెద్ద స్టార్ అయ్యిండి ఇలాంటి పాత్ర చేశాడేంటి అంటూ చూసిన ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. చాలారోజులు ఈ సినిమా గురించి, అందులోని సేతుపతి నటన గురించే మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్స్ వరకు వెళ్తుందని తన ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఆస్కార్స్ లిస్ట్‌లో ‘సూపర్ డీలక్స్’ కాకుండా ‘గల్లీ బాయ్’లాంటి సినిమా ఉంది. ఈ విషయంలో ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రమోషన్ సమయంలో విజయ్ సేతుపతి స్పందించారు.

నేను లేకపోయినా అదే కోరుకునేవాడిని..
‘‘అది నాకు గుండె పగిలిపోయిన మూమెంట్. నాకు మాత్రమే కాదు సూపర్ డీలక్స్ టీమ్‌కు కూడా. నేను కృంగిపోయాను. కానీ అదంతా రాజకీయం. ఏదో జరిగిందని అందరికీ తెలుసు. నేను ఆ సినిమాలో ఉన్నానని కాదు. అందులో నేను లేకపోయినా కూడా సినిమా అక్కడవరకు వెళ్లాలని కోరుకునేవాడిని. కానీ మధ్యలో ఏదో జరిగింది. దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. అదంతా అనవసరం’’ అని టాపిక్‌ను సింపుల్‌గా పక్కన పెట్టేశారు విజయ్ సేతుపతి. 

హిందీతో పాటు తమిళంలో..
త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ‘సూపర్ డీలక్స్’ 2019లో విడుదలయ్యింది. విజయ్ సేతుపతితో పాటు ఫాహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్ లాంటి స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో ఉన్నారు. ఇందులో ఒక ట్రాన్స్‌జెండర్‌గా శిల్పా అనే పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఈ మూవీలో సపోర్టింగ్ యాక్టర్‌గా సేతుపతికి నేషనల్ అవార్డ్ దక్కింది. ఇక ప్రస్తుతం ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న మూవీ విడుదల కానుంది. హిందీతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను ఒకేసారి షూట్ చేశారు. అందుకే తమిళంలో ఒకలాగా, హిందీలో ఒకలాగా ట్రైలర్‌ను కట్ చేసి విడుదల చేశారు. దీంతో ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - ఫేక్ అని నిరూపించుకున్న జబర్దస్త్ వెంకీ
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - ఫేక్ అని నిరూపించుకున్న జబర్దస్త్ వెంకీ
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget